వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10 లక్షలు దాటిన మరణాలు, అమెరికాలోనే 2 లక్షలు.. భారత్‌లో లక్షకు చేరువలో..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3 కోట్ల 35 లక్షల 49 వేల 873గా ఉంది. అయితే వీరిలో 2 కోట్ల 28 లక్షల పై చిలుకు మంది వైరస్ నుంచి కోలుకోవడం కాస్త సానుకూల అంశం. పాజిటివ్ కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాత భారత్, బ్రెజిల్ ఉన్నాయి.

 రాజకీయ నేతలకు కరోనా టెన్షన్ .. డిప్యూటీ స్పీకర్ తో పాటు ఒకేసారి 11 మంది ఎమ్మెల్యేలకు పాజిటివ్ రాజకీయ నేతలకు కరోనా టెన్షన్ .. డిప్యూటీ స్పీకర్ తో పాటు ఒకేసారి 11 మంది ఎమ్మెల్యేలకు పాజిటివ్

 10 లక్షలు దాటిన మరణాలు..

10 లక్షలు దాటిన మరణాలు..

కరోనా వైరస్ కేసులు పెరుగుతోన్న రికవరీ కూడా పెరగడం కాస్త రిలీఫ్ ఇచ్చింది. అయితే మరణాలు మాత్రం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఒక రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 3 వేల 837 మంది చనిపోవడం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీంతో మృతిచెందిన మొత్తం సంఖ్య 10 లక్షలు దాటింది. 10 లక్షల 6 వేల 329 మంది చనిపోయారు. అయితే దానిని డేటాలో 10 లక్షల 6 వేల 129గా కూడా చూపిస్తోంది. దీంతో చనిపోయిన వారి సంఖ్యపై స్పష్టత లేదు. వైరస్ విజృంభిస్తోన్న 7 నెలల్లోనే మృతుల సంఖ్య మిలియన్ దాటింది. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ రాలేదు. దీంతో మరిన్ని మరణాలు సంభవిస్తాయనే ఆందోళన నెలకొంది.

2 లక్షల పైచిలుకు కేసులు

2 లక్షల పైచిలుకు కేసులు

సోమవారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల 30 వేల 547 మందికి వైరస్ సోకింది. ఇటు అమెరికాలో మొత్తం కరోనా కేసులు 7.3 మిలియన్‌గా ఉంది. అయితే మరణాలు 2 లక్షల దాటడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. నవంబర్ రెండో వారం నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకురావాలనే ధృడ నిశ్చయంతో అగ్రరాజ్యం ఉంది. ఏప్రిల్ నాటికి ప్రతీ అమెరికన్‌కు వ్యాక్సిన్ అందజేస్తామని ట్రంప్ చెబుతున్నారు.

ఇండియాలో కూడా

ఇండియాలో కూడా

ఇటు ఇండియాలో కూడా కరోనా కేసులు ఎక్కవగానే ఉన్నాయి. అయితే మరణాలు కూడా ఎక్కువ రావడం టెన్షన్ కలిగిస్తోంది. సోమవారం నాటికి చనిపోయిన వారి సంఖ్య 96 వేల 351గా ఉంది. పాజిటివ్ కేసుల్లో కూడా దేశం రెండో ప్లేస్‌లో ఉంది. అమెరికా కన్నా దాదాపు మిలియన్ తక్కువ కేసులు ఉన్నాయి. అయితే మరికొద్ది రోజుల్లో అమెరికాను దాటుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు.

Recommended Video

Hyderabad లో తగ్గని Corona ఉధృతి, భౌతిక దూరం ఏది? | Corona Bulletin | Telangana

English summary
coronavirus death toll 1 million cross world over. america death toll 2 lakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X