వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ఎఫెక్ట్ ... 15రోజుల పాటు ఆ దేశం లాకౌట్ ... బయటకి వస్తే రూ.11000 ఫైన్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 162 దేశాలను వణికిస్తుంది.ఇక ప్రపంచ దేశాల్లో దాదాపుగా 2 లక్షల వరకు కరోనా కేసులు నమోదు కాగా 7500 మంది ప్రాణాలు విడిచారు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన చైనాలో ప్రస్తుతం 80894 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉంది. ఇప్పటివరకూ ఒక్క చైనాలోనే 3237 మంది కరోనా వల్ల చనిపోయారు. ఇక ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లోనూ ఇప్పటివరకు 147 మంది మీద తన ప్రభావాన్ని చూపిస్తుంది. కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరగటం కూడా ఆందోళన కలిగిస్తుంది .

కరోనా ఎఫెక్ట్ .. పబ్స్ ,బార్స్ ,కేఫ్ లతో సహా 5 లక్షల రెస్టారెంట్లు బంద్ కరోనా ఎఫెక్ట్ .. పబ్స్ ,బార్స్ ,కేఫ్ లతో సహా 5 లక్షల రెస్టారెంట్లు బంద్

కరోనాతో ఫ్రాన్స్ లో 148 మంది మృతి

కరోనాతో ఫ్రాన్స్ లో 148 మంది మృతి

ఇక చైనా తరువాత ఈ కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఇటలీలో నమోదయ్యాయి. ఇప్పటి వరకు 31510 కోవిడ్ కేసులు అక్కడ నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే కొత్తగా 3వేల 530 కేసులు నమోదవ్వడం ఇటలీ వాసులను భయాందోళనకు గురిచేస్తోంది. ఈఇటలీలో ఇప్పటి వరకు కరోనాతో 2500లకుపైగా ప్రజలు ప్రాణాలు వదిలారు. ఇక ఇటలీ తరువాత ఇరాన్ స్పెయిన్ , ఫ్రాన్స్ లో ఈ కరోనా వేగంగా విస్తరిస్తుంది. ఇక కరోనాతో ఫ్రాన్స్ లో ఇప్పటికే 148 మంది మృతి చెందారు.

దేశమంతా లాకౌట్ ప్రకటించిన ఫ్రాన్స్ ప్రభుత్వం

దేశమంతా లాకౌట్ ప్రకటించిన ఫ్రాన్స్ ప్రభుత్వం


15 రోజుల పాటు దేశమంతా లాకౌట్ ప్రకటించింది ఫ్రాన్స్ ప్రభుత్వం . ఇక అక్కడ ఎవ్వరూ ఇళ్లను విడిచి బయటకు రావొద్దని కఠిన ఆంక్షలు పెట్టింది. ఒకవేళ బయటకొస్తే దానికి తగ్గ సరైన కారణం తెలపాలని పేర్కొంది. అధికారులు వారు చెప్పిన కారణం సరైనదైతే దాన్ని అధికారులు విశ్వసిస్తేనే బయటకి వెళ్ళడానికి అనుమతి లభిస్తుంది. సరైన కారణం లేకుండా బయటకి వస్తే రూ.11000 జరిమానా కట్టాలి అని ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది.

Recommended Video

కరోనా Thermal Scanning Center At TDP Central Office | Oneindia Telugu
లక్ష మంది పోలీసుల పహారా..రూ.11000 జరిమానా

లక్ష మంది పోలీసుల పహారా..రూ.11000 జరిమానా

దీనితో ఎవరూ రోడ్లపైకి రాకుండా లక్ష మంది పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. ఇక బయటకు వస్తే రూ.11000 జరిమానా విధించారు .అలాగే మరోవైపు ఆర్థిక మాంద్యం సందర్భంగా కంపెనీలన్నింటినీ జాతీయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక కోరోనా ప్రభావంతో ప్రాణాలే కాదు ఆర్ధిక వ్యవస్థ కూడా బాగా దెబ్బ తింటుంది . ప్రపంచ దేశాలు ఆర్ధిక మాంద్యంతో కొట్టు మిట్టాడే పరిస్థితి వచ్చేలా ఉంది. ప్రపంచ దేశాలన్నీ కరోనాతో అల్లకల్లోలం అవుతున్నాయి. ప్రతి దేశంలోనూ షట్ డౌన్ ప్రకటించే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

English summary
Already 148 people have died in France with Corona. France's government announces lockout across the country for 15 days There was no restriction on anyone leaving the house. It is stated that if it is released, there is a valid reason for it. Authorities are allowed to go out only if the authorities believe the reason they have stated is correct. The French government has announced that it will pay a fine of Rs 11,000 if it comes out without a valid reason.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X