వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ఎఫెక్ట్ .. ఇప్పుడు ప్రేగుల మీద కూడా.. నెదర్ల్యాండ్ శాస్త్రవేత్తల రీసెర్చ్

|
Google Oneindia TeluguNews

కరోనా నియంత్రణ , నివారణ కోసం అన్ని దేశాలు పరిశోధనలు మొదలుపెట్టాయి . మెడిసిన్ లేని కరోనాను అరికట్టటం కోసం మెడిసిన్ తయారీపై పరిశోధనలు చేస్తున్నారు వైరాలజీ నిపుణులు , అలాగే వైద్య శాస్త్ర నిపుణులు . ఇక మానవ శరీరాల్లో కరోనా మాత్రం వివిధ అవయవాల మీద తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక తాజాగా కరోనా మానవ శరీరంలో ప్రేగులపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెలుగు చూసింది .

Recommended Video

Coronavirus : Netherland Scientists Revealed That Coronavirus Effects On Human Intestines!!

ఈ లక్షణాలు ఉన్నా కరోనా వచ్చే అవకాశం ... సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ షాకింగ్ స్టడీఈ లక్షణాలు ఉన్నా కరోనా వచ్చే అవకాశం ... సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ షాకింగ్ స్టడీ

 నెదర్ల్యాండ్స్ శాస్త్రవేత్తల రిసెర్చ్ లో కొత్త విషయాలు

నెదర్ల్యాండ్స్ శాస్త్రవేత్తల రిసెర్చ్ లో కొత్త విషయాలు

కరోనా లక్షణాల విషయంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. అలాగే కరోనా వైరస్ మానవ శరీరంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్న విషయంలో కూడా చాలా ఎక్కువగా పరిశోధనలు జరుగుతున్నాయి . ఇంతకాలం కరోనా అంటే తుమ్మితే, దగ్గితే , గొంతు నొప్పి , జ్వరంతో బాధ పడితే వైరస్ ప్రభావం చూపిస్తుంది అని చెప్పిన శాస్త్రవేత్తలు ఇప్పటికే అనేక కొత్త విషయాలు వెల్లడించారు. రోగి శరీరంలో కరోనా ఒక్కో రోగిపై ఒక్కో విధంగా తన ప్రభావం చూపిస్తుంది అని గుర్తించారు. ఇక తాజాగా నెదర్ల్యాండ్స్ శాస్త్రవేత్తలు చేసిన రిసెర్చ్ లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 మానవుల ప్రేగులపై కరోనా ఎఫెక్ట్

మానవుల ప్రేగులపై కరోనా ఎఫెక్ట్

కరోనా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా ప్రవర్తిస్తుంది. కొన్ని కేసుల్లో అసలు లక్షణాలే కనిపించవని చెప్పిన విషయం తెలిసిందే . ఇక సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్య‌య‌నం ప్రకారం వాస‌న గ్ర‌హించే శ‌క్తిని కోల్పోవ‌డం, రుచిని గుర్తించలేకపోవటం, తలనొప్పిగా ఉండటం కండ‌రాల నొప్పి, చ‌లి, వ‌ణ‌కడం, విపరీతమైన గొంతు నొప్పి వంటి వాటిని క‌రోనా ల‌క్ష‌ణాలని పేర్కొంది . ఇక తాజాగా నెదర్ల్యాండ్స్ శాస్త్రవేత్తల పరిశోధనలో మానవుల ప్రేగులపై కరోనా ప్రభావం చూపిస్తుందని గుర్తించారు . ప్రేగులపైన ఇన్ఫెక్షన్ చూపిస్తుందని , ప్రేగుల్లోని కణాల్లో కరోనా వైరస్ వృద్ధి చెందుతుందని నెదర్లాండ్ శాస్త్రవేత్తలు గుర్తించారు.

కరోనా సోకిన వారిలో డయేరియా వంటి జీర్ణాశయ సంబంధ సమస్యలు

కరోనా సోకిన వారిలో డయేరియా వంటి జీర్ణాశయ సంబంధ సమస్యలు

కరోనా సోకిన వారిలో డయేరియా వంటి జీర్ణాశయ సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కరోనా పాజిటివ్ నుండి నెగిటివ్ గా మారినా సరే మలంలో కూడా కరోనా వైరస్ కొద్ది రోజుల పాటు బ్రతికి ఉంటుందని చెప్పింది ఒక అధ్యయనం . ఇక తాజాగా ప్రేగుల్లో ఉండే ఏసీఈ2 రెసెప్టర్లు పేగుల్లోని కణాల్లో ఉండి అవి వైరస్ పెరగటానికి కారణంగా ఉన్నాయని వారు తాజాగా గుర్తించారు. ఏసీఈ2 రెసెప్టార్ల స్థాయి ఎక్కువగా ఉన్న కణాలపై ఈ వైరస్ దాడి చేస్తున్నట్లు శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఇక తాజా పరిశోధనతో ప్రేగులు కూడా కరోనాతో ఎఫెక్ట్ అయ్యే జాబితాలో చేరాయి.

English summary
Recently, scientists in the Netherlands have discovered that corona has an effect on the intestines of humans. Scientists in the Netherlands have discovered that coronavirus develops in the intestinal tract, causing infection in the intestines.Those who are infected with corona are warned of the risk of digestive problems such as diarrhea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X