వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coroglobal update :ప్రపంచ వ్యాప్తంగా 50లక్షలు దాటిన కేసులు..కరోనాపై యుద్ధానికి నాయకత్వం-డబ్ల్యూహెచ్ఓ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ మహమ్మారిపై జరుగుతున్నయుద్ధానికి తాను నాయకత్వం వహించడం కొనసాగిస్తానని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్ చెప్పారు.చాలా ధనిక దేశాలు లాక్డౌన్ నుండి బయటపడటం ప్రారంభించినప్పటికీ, పేద దేశాలలో పెరుగుతున్న కొత్త కరోనావైరస్ కేసుల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

corona update : ఇండియాలో లక్ష దాటిన కేసులు... ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షలకు చేరువలోcorona update : ఇండియాలో లక్ష దాటిన కేసులు... ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షలకు చేరువలో

 గత 24 గంటల్లో కరోనావైరస్ 106,000 కొత్త కేసులు

గత 24 గంటల్లో కరోనావైరస్ 106,000 కొత్త కేసులు

తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన వివరాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనావైరస్ 106,000 కొత్త కేసులు నమోదయ్యాయని గ్లోబల్ హెల్త్ బాడీ తెలిపింది.

ఈ మహమ్మారితో ఇంకా మనం చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది అని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ చెప్పారు.పేద మరియు మధ్య ఆదాయ దేశాలలో పెరుగుతున్న కేసుల గురించి మేము చాలా ఆందోళన చెందుతున్నామని ఆయన తెలిపారు.

 ప్రపంచ దేశాల్లో 5 మిలియన్ల కేసుల మైలురాయిని దాటిన పరిస్థితి

ప్రపంచ దేశాల్లో 5 మిలియన్ల కేసుల మైలురాయిని దాటిన పరిస్థితి

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 5 మిలియన్ల కేసుల విషాద మైలురాయిని దాటిన పరిస్థితి అటు ప్రపంచ ఆరోగ్య సంస్థను సైతం ఆందోళనకు గురి చేస్తుంది. గత ఏడాది చివర్లో వైరస్ ఉద్భవించిందని భావిస్తున్న యు.ఎస్. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ WHO పై నిప్పులు చెరిగారు. ఈ వారం ట్రంప్ WHO నుండి వైదొలగాలని మరియు నిధులను శాశ్వతంగా నిలిపివేస్తానని కూడా హెచ్చరికలు జారీ చేశాడు . ఇక ఈ నేపధ్యంలో ట్రంప్ నుండి లేఖ అందుకున్నట్లు టెడ్రోస్ పేర్కొన్నారు. కాని దీనిపై స్పందించడానికి నిరాకరించాడు.

కరోనా మహమ్మారి కట్టడికి ప్రపంచ దేశాలతో సమీక్ష

కరోనా మహమ్మారి కట్టడికి ప్రపంచ దేశాలతో సమీక్ష

టెడ్రోస్ తాను ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ గా కరోనా వైరస్ విషయంలో జవాబుదారీతనానికి కట్టుబడి ఉన్నానని, మహమ్మారి కట్టడికి సమీక్ష నిర్వహిస్తానని చెప్పాడు. ఈ వారంలో సభ్యదేశాలు ఏకాభిప్రాయంతో ఆమోదించిన తీర్మానంలో ఇటువంటి సమీక్షను నిర్వహించాలని కోరాయి. ఇక త్వరలో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. అత్యవసర ప్రతిస్పందన, కరోనా వ్యాప్తి నియంత్రణ, వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం మరియు పంపిణీ చేయడం, మా నిఘాను మెరుగుపరచడం, ప్రాణాలను కాపాడటం మరియు కార్మికులకు అవసరమైన పిపిఇని పంపిణీ చేయడం మరియు వైద్య ఆక్సిజన్‌ను కనుగొనడం వంటివి చేయటానికి మేము అన్ని విధాలా సహకరిస్తున్నామని పేర్కొన్నారు .

Recommended Video

Lockdown 4.0 : APSRTC Announced New Guidelines For Passengers
అంతర్జాతీయ స్పందనను సమన్వయపరిచేందుకు వ్యూహాత్మక నాయకత్వం

అంతర్జాతీయ స్పందనను సమన్వయపరిచేందుకు వ్యూహాత్మక నాయకత్వం

టెడ్రోస్ తాను చాలాకాలంగా WHO కోసం ఇతర నిధుల వనరులను వెతుకుతున్నానని, దాని 2.3 బిలియన్ డాలర్ల బడ్జెట్ ప్రపంచ ఏజెన్సీకి "చాలా, చాలా చిన్నది" అని పేర్కొన్నారు .డబ్ల్యూహెచ్ఓలోని 194 సభ్య దేశాలతో జరిగిన వర్చువల్ మీటింగ్‌లో టెడ్రోస్ చాలా భావోద్వేగంతో మాట్లాడారు. అంతర్జాతీయ స్పందనను సమన్వయపరిచేందుకు వ్యూహాత్మక నాయకత్వం అందించడాన్ని తాము కొనసాగిస్తామన్నారు.

English summary
The World Health Organization expressed concern about the rising number of new coronavirus cases in poor countries, even as many rich nations have begun emerging from lockdown.Now the cases surpasses 5 millions in the world .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X