వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రెండు ప్రాంతల్లో పెరుగుతున్న కరోనా..! కారణం తెలియక తల పట్టుకుంటున్న పాక్..!!

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్/హైదరాబాద్ : ప్రపంచదేశాలను కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. దాదాపు 120 దేశాల్లో కరోనా వివస్తరించి విలయతాండవం చేస్తోంది. లాక్ డౌన్ ఆక్షల పేరుతో స్వీయ నియంత్రణ కూడా పాటిస్తున్నాయి ప్రపంచ దేశాలు. కరోనా మహమ్మారికి వాక్సీన్ కనిపెట్టలేదు కాబట్టి స్వీయ నియంత్రనే సరైన మందని సభ్య దేశాలు భావిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నాయి దేశాలు. అంతే కాకుండా పాకిస్తాన్ దేశం కూడా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నప్పటికి కేసులు ఆ రెండు ప్రాంతాల్లో పెరగడం పట్ల ఆదేశ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

పాకిస్తాన్ లో పెరుగుతున్న కేసులు.. ఆందోళనలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్..

పాకిస్తాన్ లో పెరుగుతున్న కేసులు.. ఆందోళనలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్..

కరోనా మహమ్మారి పాకిస్థాన్‌లో పంజా విసురుతోంది. పవిత్ర రంజాన్ మాసం కావడంతో కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతుండడం పట్ల ఆదేశంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పాక్‌లో సింధ్ ప్రావిన్స్ తో పాటు పంజాబ్‌ ప్రావిన్స్‌లలోనే కేసులు ఎక్కువగా నమోదవ్వడం పాక్ ప్రభుత్వాన్ని విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా నమోదైన కేసులు పట్ల పాక్ నిఘా వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకు కేసులు పెరుడుతన్నాయో తెలుసుకునేందుకు ప్రణాళిక రచిస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం.

ఆరెండు ప్రాంతాల్లో విపరీతంగా పెరుగుతున్న కేసులు.. అర్ధం కాక తలపట్టుకుంటున్న పాక్..

ఆరెండు ప్రాంతాల్లో విపరీతంగా పెరుగుతున్న కేసులు.. అర్ధం కాక తలపట్టుకుంటున్న పాక్..

ఒక్కరోజే అక్కడ 26 మంది కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే పాక్ మంత్రుల వ్యవహారం మాత్రం పరాకాష్టగా మారినట్టు తెలుస్తోంది. ఇతర దేశాలతో పోల్చితే పాకిస్తాన్ లో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య అతి తక్కువ అంటూ కొట్టిపారేస్తుండగా, పాకిస్తాన్ జాతీయ రక్షణ విభాగ ప్రత్యేక కార్యదర్శి మోయీద్ యూసుఫ్ మాటలు మాత్రం ఆదేశ పౌరులను ఖంగుతినేలా చేస్తున్నాయి.

పాజిటీవ్ రోగులను భారత బార్డర్ కు తరలిస్తున్న పాక్.. అందుకే ఆ రెండు ప్రాంతల్లో ప్రబలుతున్న కరోనా..

పాజిటీవ్ రోగులను భారత బార్డర్ కు తరలిస్తున్న పాక్.. అందుకే ఆ రెండు ప్రాంతల్లో ప్రబలుతున్న కరోనా..

కరోనా బారినపడ్డ వారి మరణాల గురించి యూసఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దేశవ్యాప్తంగా కేవలం నలభై నాలుగు మంది మాత్రమే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రి వ్యాఖ్యలకు, పాక్‌లో పెరుగుతున్న కేసులకు పొంతన లేదని లెక్కలు చెప్పుకొస్తున్నాయి. ఇప్పటికే దేశంలో పదిహేను వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వీరిలో మూడువందల నలభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు.

పంజాబ్, సింద్ ప్రాంతాల్లో పురుగుతున్న కేసులు.. కట్టడి చేయాలంటున్న పాక్..

పంజాబ్, సింద్ ప్రాంతాల్లో పురుగుతున్న కేసులు.. కట్టడి చేయాలంటున్న పాక్..

అయితే ఈ పెరిగిన కేసుల్లో అత్యధికంగా పంజాబ్ ప్రావిన్స్‌లో 6,061 కేసులు నమోదవ్వగా, సింధ్ ప్రావిన్స్‌ ప్రాంతంలో 5,695 కేసులు నమోదయ్యాయి. ఇక ఖైబర్ పంక్తుంఖ్వాలో 2,313, బలూచిస్తాన్‌లో 978, గిల్జిత్ బలిస్తాన్‌లో 333, ఇస్లామాబాద్‌లో 313 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ ప్రాంతాల్లోనే కేసులు నమోదవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కరోనా సోకిన పేషెంట్లను భారత్‌ సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు పంజాబ్‌, సింధ్ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం అనుమానాలకు తావిస్తోంది.

English summary
The Pakistani government is astonished by the high incidence of cases in Pakistan as well as in the Punjab province itself. Pak is reportedly preparing to keep an eye on the latest reported cases. The Pakistani government is planning to find out why the cases are getting worse.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X