వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ఒక మహమ్మారి.. ప్రకటించిన డబ్ల్యూ‌హెచ్‌ఓ: ప్రపంచాన్ని వణికించిన 'మహమ్మారి' వైరస్ లు ఇవే

|
Google Oneindia TeluguNews

చైనాను వణికించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. అగ్రరాజ్యమైన అమెరికా సైతం కరోనాతో వణుకుతుంది. కరోనావైరస్ వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక మహమ్మారి అని ప్రకటించింది . చైనా వెలుపల కరోనా వైరస్ కేసులు గత రెండు వారాల్లో 13 రెట్లు పెరిగాయని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ డాక్టర్ టెడ్రాస్ అద్నామ్ గ్యాబ్రియేసస్ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ నియంత్రణలో అత్యవసరంగా తీవ్రంగా స్పందించకపోవటం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. ఇదే సమయంలో కరోనా వైరస్ నియంత్రణకు కొన్ని దేశాలు మెరుగైన చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు.

Recommended Video

Coronavirus: WHO Declares COVID-19 A Global Pandemic | Oneindia Telugu
కరోనా వైరస్ ఒక మహమ్మారి అన్న డబ్ల్యూ‌హెచ్‌ఓ

కరోనా వైరస్ ఒక మహమ్మారి అన్న డబ్ల్యూ‌హెచ్‌ఓ

ఒకే సమయంలో వివిధ దేశాలలో ప్రజల మధ్య వ్యాపించే ఒక వ్యాధి ఏదైనా సరే మహమ్మారి అని వికీపీడియా పేర్కొంది. గతంలో కలరా, ప్లేగు, సార్స్, స్వైన్ ఫ్లూ లాంటి వ్యాధులను మహమ్మారిగా ప్రకటించారు. ఈ వ్యాధుల కారణంగా వేల నుంచి లక్షలాది మంది మృత్యువాతపడ్డారు. శతాబ్దానికో మహ్మమారి భూగోళాన్ని అతలాకుతలం చేస్తోందనేది సత్యం . కరోనావైరస్ ఖచ్చితంగా మహమ్మారి అని , అది ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే సామర్థ్యాన్ని కలిగి ఉందని ఫిబ్రవరిలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది.

స్వైన్ ఫ్లూ అంత ప్రమాదకరం కాకున్నా డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా

స్వైన్ ఫ్లూ అంత ప్రమాదకరం కాకున్నా డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కూడా మహమ్మారి కోవలోకే వస్తుంది. అయితే ఇది స్వైన్ ఫ్లూ అంత ప్రమాదకరం కానప్పటికీ కరోనాను నివారించడానికి మందులు అందుబాటులోకి రాని కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి. అందువల్ల దీని వ్యాప్తిని అరికట్టలేకపోతున్నారు. సాధారణ జలుబు, దగ్గు, జ్వరంలా ఉండే ఈ వైరస్ ప్రాణాలను హరిస్తుంది.

గతంలో తీవ్రంగా భయపెట్టిన హెచ్ఐవీ , ఎయిడ్స్

గతంలో తీవ్రంగా భయపెట్టిన హెచ్ఐవీ , ఎయిడ్స్

ఇక మహమ్మారిగా మానవ సమాజాన్ని కబళించిన పలు వైరస్ లను చూస్తే హెచ్ ఐవీ , ఎయిడ్స్ .. ఇది మొట్టమొదట డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 1976 లో గుర్తించబడింది. ఇది 1981 నుండి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 36 మిలియన్లకు పైగా ప్రజలు దీంతో మరణించారు. అవగాహన మరియు కొత్త చికిత్సలు అభివృద్ధి చెందడంతో ఈ రోజు బాధితులకు కొంత మేర ఉపశమనం కలిగిస్తున్నారు . 2005 మరియు 2012 మధ్య, ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు 2.2 మిలియన్ల నుండి 1.6 మినియన్లకు పడిపోయింది.

ప్రపంచాన్ని వణికించిన ఫ్లూ

ప్రపంచాన్ని వణికించిన ఫ్లూ

ఇక ఫ్లూ మహమ్మారి.. హాంగ్ కాంగ్ ఫ్లూ అని కూడా పిలువబడే ఈ మహమ్మారి మొదటి కేసు 1968 లో హాంకాంగ్‌లో నమోదు అయ్యింది . తరువాత ఇది సింగపూర్, వియత్నాం, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా మరియు యునైటెడ్ స్టేట్స్ వరకు వ్యాపించింది. దీని ఫలితంగా లక్షకు పైగా ప్రజలు మరణించారు. ఇక ఆసియా ఫ్లూ అనేది H2N2 సబ్ టైప్ యొక్క ఇన్ఫ్లూఎంజా A యొక్క మహమ్మారి. ఇది చైనాలో 1956 లో ఉద్భవించి 1958 వరకు కొనసాగింది. సుమారు 2 మిలియన్ల మరణాలు సంభవించాయి. ఈ మహమ్మారి చైనా, సింగపూర్, హాంకాంగ్ మరియు యునైటెడ్ స్టేట్స్ ను వణికించింది .

ఆసియా దేశాలను భయపెట్టిన కలరా, ప్లేగు

ఆసియా దేశాలను భయపెట్టిన కలరా, ప్లేగు

ఇక కలరా మహమ్మారి ... కలరా మహమ్మారి భారతదేశంలో ఉద్భవించింది. ఇక్కడ 8 లక్షల మంది కలరా బారిన పడి మరణించారు. ఇది మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, తూర్పు ఐరోపా మరియు రష్యాకు వ్యాపించింది. కలరా మహమ్మారి 1910 మరియు 1911 మధ్య సంభవించింది. అమెరికా కలరా వ్యాప్తికి మూలం. ఈ మహమ్మారి 20 మిలియన్ల ప్రజల ప్రాణాలను బలిగొంది. ది బ్లాక్ డెత్ గా పిలువబడే ప్లేగు వ్యాధి .. ఈ మహమ్మరి 1346 మరియు 1353 మధ్య సంభవించింది. ప్లేగు యొక్క వ్యాప్తి యూరప్, ఆఫ్రికా మరియు ఆసియాను నాశనం చేసింది. మరణించిన వారి సంఖ్య 75 నుండి 200 మిలియన్ల మధ్య ఉందని అంచనా. ఆసియాలో ఉద్భవించిందని భావించిన ప్లేగు, ఎలుకలపై నివసించే ఈగలు ద్వారా వివిధ దేశాలలో వ్యాపించింది.

అత్యవసర తీవ్ర చర్యలకు ఉపక్రమించాలన్న డబ్ల్యూ‌హెచ్‌ఓ

అత్యవసర తీవ్ర చర్యలకు ఉపక్రమించాలన్న డబ్ల్యూ‌హెచ్‌ఓ

ఇక ప్రస్తుతం కరోనా వైరస్ ... ఇది కూడా మహమ్మారి అని డబ్ల్యుహెచ్ ఓ ప్రకటించింది. ప్రపంచ దేశాలను వణికిస్తుందని ఇది వ్యాప్తి చెందుతుందని పేర్కొంది . అత్యవసరంగా తీవ్ర చర్యలు చేపట్టాలని ఆయన ప్రపంచ దేశాలకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించింది . ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూనే వినాశనాన్ని తగ్గిస్తూ, మానవ జీవితాలను కాపాడాలంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పిలుపునిచ్చింది.

English summary
The coronavirus outbreak has been labelled a pandemic by the World Health Organisation (WHO). A pandemic describes a disease that spreads between people in different countries at the same time. Wikipedia describes pandemic as a disease epidemic that has spread across a large region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X