వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా చివరిది కాదు ...తరువాత మహమ్మారికి సిద్ధంగా ఉండండి : డబ్ల్యూహెచ్ఓ సంచలన హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ చివరి మహమ్మారి కాదని, తరువాత మరిన్ని మహమ్మారులు దాడి చేసే అవకాశం ఉందని , తరువాతి మహమ్మారి కోసం ప్రపంచం బాగా సిద్ధం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసస్ హెచ్చరించారు. తదుపరి మహమ్మారిని మెరుగైన రీతిలో ఎదుర్కోవటానికి ప్రపంచ దేశాలు ప్రజారోగ్యంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు . విలేకరుల సమావేశంలో టెడ్రోస్ మాట్లాడుతూ,ఇది చివరి మహమ్మారి కాదు. ఇలాంటి మహమ్మారుల వ్యాప్తి తరువాత కాలంలో కూడా కొనసాగుతుందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టెన్షన్ పెడుతున్నాయి .

కరోనా నుండి కోలుకున్న వారందరిలోనూ యాంటీ బాడీలు లేవు : సెరో సర్వేలో షాకింగ్ అంశాలుకరోనా నుండి కోలుకున్న వారందరిలోనూ యాంటీ బాడీలు లేవు : సెరో సర్వేలో షాకింగ్ అంశాలు

తదుపరి మహమ్మారికి సిద్ధం కావాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

తదుపరి మహమ్మారికి సిద్ధం కావాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

మహమ్మారి అనేది జీవిత సత్యం అని చరిత్ర మనకు బోధిస్తుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ పేర్కొన్నారు . అయితే తదుపరి మహమ్మారి వచ్చినప్పుడు ప్రపంచం సిద్ధంగా ఉండాలని ఆయన సంచలన హెచ్చరిక చేశారు .ఇప్పటి కంటే మన ఆరోగ్య రక్షణలో ఎక్కువగా మనం సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు . అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల సమీక్ష కమిటీ ఆ పనిని ప్రారంభిస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆరోగ్య నియంత్రణ ప్రపంచ ఆరోగ్య భద్రతలో అతి ముఖ్యమైన ఒక చట్టపరమైన వ్యవస్థ అని పేర్కొన్నారు టెడ్రోస్ .

 కరోనా మహమ్మారి ఒకటే చివరిది కాదు

కరోనా మహమ్మారి ఒకటే చివరిది కాదు

ఇప్పటివరకు మహమ్మారి సమయంలో వివిధ దేశాల పనితీరును ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ సమీక్ష కమిటీ అంచనా వేస్తుందని ఆయన చెప్పారు . అవసరమని భావించే ఏవైనా మార్పులను సిఫారసు చేయండి అని టెడ్రోస్ విలేకరుల సమావేశంలో అన్నారు. కరోనా మహమ్మారి ఒక్కటే ప్రపంచానికి చివరి మహమ్మారి కాదని, తరువాతి కాలంలో మరిన్ని ప్రాణాంతక మహమ్మారులు వచ్చే అవకాశం లేకపోలేదని, మహమ్మారి మానవ జీవితంలో ఒక భాగంగా ఉండే పరిస్థితి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ప్రస్తుతం కంటే మెరుగైన ఆరోగ్య సౌకర్యాలతో సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.

Recommended Video

COVID-19 : Coronavirus పై పారదర్శకంగా వ్యవహరించాం! - చైనా అధ్యక్షుడు || Oneindia Telugu
ప్రజారోగ్యానికి భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధం కండి

ప్రజారోగ్యానికి భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధం కండి

ప్రజారోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని, ప్రజారోగ్యానికి భారీగా ఖర్చు పెట్టే లాగా ప్రపంచ దేశాలు రెడీ గా ఉండాలని ఆయన పేర్కొన్నారు. కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా 27.19 మిలియన్లకు పైగా ప్రజలు సోకినట్లు లెక్కలు చెప్తున్నాయి . 888,326 మంది మరణించినట్లు తెలుస్తుంది .ఇక తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంచలన హెచ్చరికతో అన్ని దేశాలు ఆలోచనలో పడ్డాయి. కరోనా కారణంగానే వైద్య సదుపాయాల కల్పనలో దృష్టి పెట్టిన చాలా దేశాలు , ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికతో ఆరోగ్య భద్రతపై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంది .

English summary
World Health Organization chief Tedros Adhanom Ghebreyesus said on Monday the world must be better prepared for the next pandemic, as he called on countries to invest in public health."This will not be the last pandemic," Tedros told a news briefing in Geneva. "History teaches us that outbreaks and pandemics are a fact of life. But when the next pandemic comes, the world must be ready – more ready than it was this time."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X