వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచ వ్యాప్తంగా కరోనా బీభత్సం .. రోజుకు 3, 50,000 కేసులతో .. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ మహమ్మారి గత పది నెలలుగా ప్రపంచాన్ని గజాగజా వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 3,71,13,410 మందికి ఈ వైరస్ సోకి అనారోగ్యం బారిన పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా 3,50,000 రోజు వారీ కొత్త కరోనావైరస్ కేసులను నమోదు చేస్తున్నట్టు పేర్కొంది .ఇక ఇప్పుడు శీతాకాలం కావటంతో కరోనా కరాళ నృత్యం చేస్తుందన్న భావన వ్యక్తం అవుతుంది. వైద్య నిపుణులు ఈ సీజన్ లో కరోనా తీవ్రతరం అవుతుందని హెచ్చరికలు జారీ చెయ్యటమే కాకుండా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .

కరోనా వ్యాప్తి రెట్టిపు అవుతుందని బ్రిటీష్ శాస్త్రవేత్తల అంచనా

కరోనా వ్యాప్తి రెట్టిపు అవుతుందని బ్రిటీష్ శాస్త్రవేత్తల అంచనా

యుఎన్ ఆరోగ్య సంస్థ ప్రకటనలో ఈ వారంలో నమోదైన రోజువారీ 3,50,766 కేసుల సంఖ్యలో దాదాపు 12,000 వరకు పెరిగినట్టు తెలిపింది. ఈ లెక్క ఐరోపా లో 1,09,000 కంటే ఎక్కువ కేసులు నమోదు అయ్యేలా చేసిందని పేర్కొంది. కరోనావైరస్ వ్యాప్తి రెట్టింపు అవుతుందని బ్రిటిష్ శాస్త్రవేత్తలు నివేదించారు. ఫ్రెంచ్ ఆస్పత్రులు ఐసియు పడకలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కేసులు పెరుగుతున్న దృష్ట్యా కచ్చితంగా వైద్య సదుపాయాలూ పెరగాల్సిన అవసరం ఉంది .

ప్రపంచ వ్యాప్తంగా 37 మిలియన్ల కరోనా కేసులు .. అమెరికా ఫస్ట్ ప్లేస్

ప్రపంచ వ్యాప్తంగా 37 మిలియన్ల కరోనా కేసులు .. అమెరికా ఫస్ట్ ప్లేస్

కేసులు పెరుగుతున్నందున స్పెయిన్ మాడ్రిడ్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రపంచ కరోనావైరస్ కేసుల సంఖ్య 37 మిలియన్లనుదాటుతుండగా , మరణాలు 10,72,712 కు పైగా పెరిగాయని వరల్డ్ మీటర్స్ లెక్కల ప్రకారం తెలుస్తుంది. శనివారం ఉదయం నాటికి మొత్తం కేసుల సంఖ్య 3,71,13,410 కు పెరిగాయి. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో కేసులు 76,60,123 నమోదు కాగా 2,13,588 మరణాలు నమోదయ్యాయి . అమెరికా కరోనా మహమ్మారి కారణంగా అత్యధికంగా నష్టపోయిన దేశం.

ప్రపంచంలో కేసుల్లో రెండో స్థానంలో ఇండియా

ప్రపంచంలో కేసుల్లో రెండో స్థానంలో ఇండియా

కేసుల విషయంలో భారత్ రెండవ స్థానంలో ఉంది. ఇండియాలో 69,06,151 తాజా కేసులు ఉండగా, దేశ మరణాల సంఖ్య 1,06,490 కు పెరిగింది. గత ఏడాది చివర్లో చైనాలో కరోనా వైరస్ ఉద్భవించినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా 10,72,712 మంది మరణించారు. అధికారిక వర్గాల లెక్క ప్రకారం దాదాపు 37 మిలియన్ కేసులు నిర్ధారించబడ్డాయి. అమెరికాలో అత్యధిక మరణాలతో మొదటి స్థానంలో ఉండగా 1,48,957 మరణాలతో బ్రెజిల్ రెండో స్థానంలో, ఆ తర్వాత 106,490 మరణాలతో ఇండియా ఉన్నాయి. మెక్సికో 83,096 మరణాలు , బ్రిటన్ 42,679 మరణాలను నమోదు చేసింది .

Recommended Video

Top News Of The Day : ప్రపంచంలో అత్యంత కాలుష్య కారక నగరాల్లో రెండు మన తెలుగు నగరాలే! || Oneindia
 కరోనా కట్టడికి నిర్ణయాత్మకంగా వ్యవహరించాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

కరోనా కట్టడికి నిర్ణయాత్మకంగా వ్యవహరించాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

అవసరం అనుకుంటే లాక్ డౌన్ లు, సామూహిక సమావేశాలను అరికట్టడం ద్వారా సహా, కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టటానికి యూరోపియన్ ప్రభుత్వాలు నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క అత్యున్నత అత్యవసర వైద్య నిపుణులు చెప్పారు.కరోనా వైరస్ బలహీనపడినా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటికే డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా ముందు ముందు మరింత ఉధృతంగా ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

English summary
The World Health Organisation reports a worldwide record of 3,50,000 new daily coronavirus cases. British scientists reported the coronavirus outbreak is doubling every few weeks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X