వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయ తాండవం ... 190 దేశాలు .. 14 వేలకు పైగా మరణాలు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ పంజా విసురుతూనే ఉంది.ప్రపంచ దేశాలను భయపెడుతుంది . డ్రాగన్ కంట్రీలో పుట్టిన ఈ మాయదారి వైరస్ క్రమంగా ఇతర దేశాలకు పాకుతూనే ఉంది.. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) విడుదల చేసిన లెక్కల ప్రకారం190 దేశాలకు కరోనా విస్తరించింది . ఇక ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన 3,34,981 మంది పడగా 14,652 మంది మృత్యువాత పడ్డారు. రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడం దేశాలకు విస్తరిస్తున్న ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది.

ప్రపంచ దేశాల్లో కరోనా విలయం

ప్రపంచ దేశాల్లో కరోనా విలయం

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో లాక్‌డౌన్ కొనసాగుతున్నా కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. వేలాదిగా చనిపోతున్నారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి. ఇక కరోనా మహమ్మారి భారతదేశాన్ని కలవరపెడుతోంది. ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా ముంబైలోని కస్తూర్బా ఆస్పత్రిలో ఓ 65 ఏళ్ల వృద్ధుడు కరోనా బారిన పడి మృతిచెందాడు.

భారత్ లో 11 కు చేరిన కరోనా మృతుల సంఖ్య

భారత్ లో 11 కు చేరిన కరోనా మృతుల సంఖ్య

దీంతో దేశంలో కరోనా ప్రభావంతో చనిపోయిన వారి సంఖ్య 11కు చేరింది. మరోవైపు దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య వేలల్లో ఉండటంతో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి.
గాలి ద్వారా కూడా కరోనా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందగలదని డబ్ల్యూ హెచ్ ఓ అంటోంది. కరోనా వైరస్ కణాలు ఏరోసోల్ బిందువుల ద్వారా వ్యాప్తి చెందుతాయని తమ తాజా పరిశోధనలో తేలిందని డబ్ల్యూ హెచ్ ఓ పేర్కొంది.

190 దేశాలకు నిద్ర లేకుండా చేస్తున్న కరోనా

190 దేశాలకు నిద్ర లేకుండా చేస్తున్న కరోనా


గాలిలో కరోనా వైరస్ ప్రభావం కోల్పోవటానికి సుమారు 3 గంటలు పడుతుందన్న ప్రచారం ఇప్పటివరకు జరిగింది కానీ ఆయా ప్రాంతాల్లోని తేమ, ఉష్ణోగ్రత వంటి అంశాలను బట్టి అది మరింత ఎక్కువ సమయం ఉండే అవకాశముందని తెలిపింది. ఏది ఏమైనా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంది. ప్రపంచాన్ని భయపెడుతుంది . ఇప్పటికే ఈ మహమ్మారి 14 వేలకు పైగా ప్రజల ప్రాణాలు హరించింది. 190దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తుంది కరోనా రక్కసి .

English summary
Coronavirus claw continues to threaten the world. The virus, which originated in the Dragon Country, has spread to other countries. So far, 3,34,981 people have infected from the virus and 14,652 have died. The number of coronavirus positive cases is increasing day by day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X