వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వ్యాప్తికి కారణం వీళ్ళే .. ఆసక్తికర విషయం చెప్పిన డబ్ల్యూహెచ్ఓ

|
Google Oneindia TeluguNews

మానవాళి మనుగడకు పెద్ద ప్రమాదంగా పరిణమించిన కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి నియంత్రణ ప్రపంచ దేశాలకు సాధ్యం కావటం లేదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా తెలియకుండానే వైరస్ మానవ శరీరాల్లోకి ప్రవేశిస్తుంది . కరోనా వ్యాప్తి చేస్తున్న క్యారియర్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

కరోనా వ్యాప్తి యువత , మధ్య వయస్కుల వల్లే .. డబ్ల్యూహెచ్ఓ వెల్లడి

కరోనా వ్యాప్తి యువత , మధ్య వయస్కుల వల్లే .. డబ్ల్యూహెచ్ఓ వెల్లడి

ప్రపంచవ్యాప్తంగా కరోనా నియంత్రణ కోసం, కరోనా నివారణ కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. అయితే కరోనా వ్యాప్తి మాత్రం ఊహించని విధంగా పెరిగిపోతోంది. అసలు కరోనా వ్యాప్తికి కారణం ఎవరు ? కరోనాను ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు ? అన్న అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లారిటీ ఇచ్చింది. చిన్న పిల్లల ద్వారా, వృద్ధుల ద్వారా కరోనా వ్యాప్తి చెందడం లేదని, కరోనాని వ్యాప్తి చేస్తున్నది ముఖ్యంగా యువత, మధ్య వయసు వారేనని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెస్ట్రన్ ఫెసిఫిక్ రీజినల్ డైరెక్టర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయస్సు మధ్య వారే క్యారియర్స్

20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయస్సు మధ్య వారే క్యారియర్స్

ముఖ్యంగా 20 సంవత్సరాల వయసున్న యువత నుండి 50 సంవత్సరాల వయస్సు ఉన్న మధ్యవయసు వారి ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా జరుగుతోందని, కరోనా వ్యాప్తికి వీరే కారణమని వెల్లడించారు. కొంతమందిలో కరోనా సోకినట్లుగా లక్షణాలు కూడా కనిపించడం లేదని, ఇక వీరంతా వేరే వ్యక్తులకు కరోనా వ్యాప్తి చెందడానికి కారణం అవుతున్నారని పేర్కొన్నారు. కొందరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి, వృద్ధులకు ఇది ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా తయారవుతుందని ఆయన పేర్కొన్నారు.

ఎవరికీ అర్ధం కాకుండానే కరోనా వ్యాప్తి .. అప్రమత్తత అవసరం

ఎవరికీ అర్ధం కాకుండానే కరోనా వ్యాప్తి .. అప్రమత్తత అవసరం

అంతేకాదు జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రజలు మరింత ఎక్కువ జాగ్రత్తగా నడుచుకోవాలని, లేదంటే వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రజారోగ్య వ్యవస్థ అందుబాటులో లేని ప్రాంతాలలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కరోనా కారణంగా కొంతకాలం పాటు లాక్డౌన్ కొనసాగినా, ప్రస్తుతం అందరూ దైనందిన జీవనంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా చాలామంది కరోనా బారిన పడుతున్నారు. వారు కరోనాతో ఇబ్బంది పడుతున్నదే కాకుండా ఎవరికీ చెప్పకుండా మరికొందరు కరోనా బారిన పడటానికి కారణమవుతున్నారు.

వ్యాప్తి నియంత్రణ బాధ్యత కూడా వారిదే !!

వ్యాప్తి నియంత్రణ బాధ్యత కూడా వారిదే !!

బయట తిరుగుతున్న జనాలకు ఆరోగ్యవంతులు ఎవరు , కరోనా బారిన పడిన వారు ఎవరు అన్నది తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో కరోనా వ్యాప్తి జరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడం గమనార్హం. కరోనా వ్యాప్తి నియంత్రణ జరగాలంటే ముఖ్యంగా యువత, మధ్య వయస్కులు అప్రమత్తంగా ఉండటం , అవసరానికి తప్ప అనవసరంగా తిరగటం మానుకుంటే కరోనా వ్యాప్తి తగ్గుతుంది అనే భావన ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన విషయం ద్వారా అర్ధం అవుతుంది .

English summary
The World Health Organization gave clarity on corona spread ."Corona is not spread by young children or the elderly, but by young people, especially middle-aged people." They are carriers between the ages of 20 and 50.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X