• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లాక్ డౌన్ పాటించని వారికి దెయ్యాల బెడద: కరోనా వింతలు ఇంతింత కాదయా !!

|

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది. శవాల గుట్టలుగా చాలా దేశాలను మారుస్తుంది. లక్షల్లో బాధితులు వేలల్లో మరణాలు వెరసి కరోనా మరణ మృదంగం మోగిస్తుంది . ఇక ఈ మాయదారి మహామ్మారి వైరస్ నుండి ప్రజలను కాపాడుకునేందుకు వైరస్‌ ప్రభావం ఉన్న దేశాల్లో లాక్‌డౌన్‌ విధించారు. ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ కరోనా బారిన పడకుండా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా చాలా చోట్ల ప్రజలు ఏదో ఒక సాకుతో బయటకు వస్తున్నారు. ఇక చాలా దేశాల్లో ప్రజలను బయటకు రాకుండా భయపెట్టేపని మొదలు పెట్టారు.

లాక్ డౌన్ పాటించని వారిని భయపెట్టే పనిలో ఇండోనేషియా కెపూ యువత

లాక్ డౌన్ పాటించని వారిని భయపెట్టే పనిలో ఇండోనేషియా కెపూ యువత

కరోనాతో ఇప్పటివరకు ఇండోనేషియాలో 373 మంది మరణిం చారు. 4241 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా ఇండోనేషియాలోని మారుమూల గ్రామాల్లో కరోనా గురించి అవగాహన లేనివారు నేటికీ వీధుల్లో సంచరిస్తున్నారు. ఇక వారికి ఎంత చెప్పినా వైరస్ పై అవగాహన రావట్లేదు. అంతేకాదు వైరస్‌ గురించి హెచ్చరించినా వారు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇండోనేషియాలోని కెపూ గ్రామానికి చెందిన యువకులు ప్రజలను భయపెట్టే పనిలో పడ్డారు. దెయ్యాలు తిరుగుతున్నాయని చెప్పి వినూత్న ప్రయోగానికి తెరతీశారు.

దెయ్యాల వేషాలతో తిరుగుతూ ప్రజలను భయపెడుతున్న యువత

దెయ్యాల వేషాలతో తిరుగుతూ ప్రజలను భయపెడుతున్న యువత

దెయ్యం బూచిని చూపించి ప్రజలను ఇంట్లోనే ఉండేలా చేస్తున్నారు. ఈ మేరకు వారే పొకాంగ్‌ లను అర్ధ రాత్రులు వీధుల్లో తిప్పుతున్నారు. పొకాంగ్ అంటే తెల్లటి బట్టలో చుట్టబడిన మృతదేహం అని అర్ధం .. ఇక దీనినే అక్కడ దెయ్యంగా వ్యవహరిస్తారు. ఇక కొందరు యువకులు దెయ్యాల అవతారమెత్తి అర్ధరాత్రి వీధుల్లో తిరుగుతున్నారు . దీంతో స్థానిక ప్రజలు భయాందోళన కు గురవుతూ బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. బతిమాలి చెప్పితే వినని వారిని భయంతో దారికి తెస్తున్నారు. ఇందుకు పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారు.

మూఢ నమ్మకాలే కరోనా నుండి కాపాడుతున్నాయంటున్న గ్రామ పెద్ద

మూఢ నమ్మకాలే కరోనా నుండి కాపాడుతున్నాయంటున్న గ్రామ పెద్ద

ఇక ఈ విషయం గురించి గ్రామ పెద్ద ఒకరు మాట్లాడారు. కరోనా వైరస్ గురించి ఎంత చెప్పినా చాలా మంది ప్రజలకు అర్ధం కావటం లేదని, ఇంట్లో ఉండమని చెబితే ఎవరూ వినటం లేదని అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు . ఇక ఇప్పుడు చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ఇంట్లోనే ఉంటున్నారు. మూఢ నమ్మకాలే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా నుండి కాపాడుతున్నాయి అని వారు చెప్తున్నారు.

డ్రోన్లకు దెయ్యాల డెకరేషన్ .. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వింతలు

డ్రోన్లకు దెయ్యాల డెకరేషన్ .. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వింతలు

ఇక కొన్ని దేశాలలో డ్రోన్లకు దెయ్యాలలగా డెకరేట్ చేసి గాలిలో తిప్పుతున్నారు. ఇక వాటిని చూసిన ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారు. ఇళ్ళ నుండి బయటకు రావద్దంటే వినని దేశాలలో ఈ తరహా ప్రయోగాలు చేస్తున్నారు . మూఢ నమ్మకాలనుండి ప్రజలను బయటకు తీసుకురావాల్సిన చోట కరోనా నుండి కాపాడటానికి ఆ మూఢ నమ్మకాలనే ఉపయోగిస్తుండటం భవిష్యత్ లో ఎలాంటి భయాలకు కారణం అవుతుందో . ఏది ఏమైనా ప్రజల్లో అవగాహన కలిగించి వారిలో మార్పు తేవాలి కానీ ఈ తరహా ప్రయోగాలతో కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతాయి అన్న భావన కలుగుతుంది. ఏది ఏమైనా కరోనా వింతలు ఇన్నిన్ని కాదయా అంటున్నారు ఇదంతా చూస్తున్న వాళ్ళు .

English summary
Kepuh village in Indonesia has been haunted by ghosts recently - mysterious white figures jumping out at unsuspecting passers-by, then gliding off under a full-moon sky. The village on Java island has deployed a cast of "ghosts" to patrol the streets, hoping that age-old superstition will keep people indoors and safely away from the coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X