వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

20 నిమిషాల్లోనే కరోనా పరీక్ష ... రిజల్స్ లోనూ కచ్చితత్వం .. శాస్త్రవేత్తల రీసెర్చ్

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ పై కొనసాగుతున్న పోరాటంలో, పరిశోధకులు కేవలం 20 నిమిషాల్లో కరోనా వైరస్ ను నిర్ధారించగల కొత్త పరీక్షను అభివృద్ధి చేశారు. దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ కరోనాను నియంత్రించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రస్తుతం ఇండియాలో కరోనా కేసులు 25 లక్షలు దాటిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ప్రపంచవ్యాప్తంగానూ కరోనా నియంత్రణ కోసం , కరోనా వైరస్ గుర్తింపు కోసం, పూర్తిగా వైరస్ ను నివారించడం కోసం పరిశోధనలు జరుగుతున్నాయి.

ఆహార పదార్థాల ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతుందా?: తేల్చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థఆహార పదార్థాల ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతుందా?: తేల్చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

కరోనా టెస్ట్ ల విషయంలో రోజురోజుకీ పురోగతి

కరోనా టెస్ట్ ల విషయంలో రోజురోజుకీ పురోగతి

ఈ క్రమంలో కరోనా వైరస్ ను గుర్తించి నిర్ధారించే అత్యంత ఖచ్చితమైన, అతి తక్కువ సమయంలో రిజల్ట్ ఇచ్చే పరీక్ష విధానం కూడా అభివృద్ధి చేశారు.

కరోనా వైరస్ ఇండియాలో ప్రవేశించిన తొలి రోజుల్లో కరోనా పరీక్షలు నిర్వహించాలంటే ఒక బ్రహ్మ పదార్ధంలా ఉండేది . కానీ రోజురోజుకీ కరోనా కేసులు పెరగడంతో,అవసరాలకు తగ్గట్టుగా పరీక్షల విధానాన్ని కూడా మెరుగు చేశారు.యాంటీ జెన్ కిట్లు , ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు ఇలా కరోనా పరీక్షలకోసం రక రకాల పరికరాలను అందుబాటులోకి తెచ్చారు.అయితే అత్యంత తక్కువ సమయంలో కేవలం 20 నిమిషాల్లోనే ఖచ్చితమైన ఫలితాలను చూపించే పరీక్ష విధానాన్ని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

20 నిముషాల్లో కచ్చితమైన కరోనా పరీక్ష ... మెల్బోర్న్ యూనివర్సిటీ రీసెర్చ్

20 నిముషాల్లో కచ్చితమైన కరోనా పరీక్ష ... మెల్బోర్న్ యూనివర్సిటీ రీసెర్చ్

ఈ పరీక్ష విధానం చాలా చౌక అయిందని, చాలా సులభమైంది కూడా అని మెల్బోర్న్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టిమ్ స్టినర్ తెలిపారు. ఈ టెస్టింగ్ విధానానికి ఎన్ 1 స్టాప్ ల్యాంప్ అని పేరు పెట్టారు. ఈ వివరాలన్నింటినీ జర్నల్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజీ ప్రచురించారు.


పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఇప్పటివరకు చేస్తున్న పరీక్షల కంటే ఈ పరీక్ష చాలా ఖచ్చితమైనది మరియు ఉపయోగించడానికి సులభమైనది, ఇది పరిమిత పరీక్ష సామర్థ్యాలతో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు .

చిన్న పోర్టబుల్ యంత్ర సహాయంతో పరీక్షలు .. పెరుగుతున్న కేసుల దృష్ట్యా

చిన్న పోర్టబుల్ యంత్ర సహాయంతో పరీక్షలు .. పెరుగుతున్న కేసుల దృష్ట్యా

ఈ పద్ధతిలో చిన్న పోర్టబుల్ యంత్రాన్ని మాత్రమే ఉపయోగించి ముక్కు నుండి స్వాప్ తీసి టెస్ట్ చేస్తారు. 20 నిముషాల్లోనే కచ్చితమైన రిపోర్ట్ వస్తుంది. కరోనా మహమ్మారిని నియంత్రించే రేసులో, వేగవంతమైన, ఖచ్చితమైన విశ్లేషణలకు ఈ కిట్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని పరిశోధనా బృందం తెలిపింది. ఈ కొత్త పరీక్ష ఒక ట్యూబ్‌ను మాత్రమే ఉపయోగిస్తుందని మరియు ఒకే దశను మాత్రమే కలిగి ఉంటుందని అధ్యయనం వెల్లడించింది, ఇది ప్రస్తుత పరీక్షల కంటే ఎక్కువ సమర్థవంతంగా మరియు తక్కువ ఖర్చుతో చేస్తుంది.151 శాంపిల్స్ అంచనా వేయడానికి ఉపయోగించినప్పుడు ఎన్ 1 స్టాప్ ల్యాంప్ పద్ధతి 100 శాతం ఖచ్చితమైనదని మరియు 87 శాతం పరీక్షలను సానుకూలంగా గుర్తించింది. ఫలితాలు వేగంగా ఉన్నాయిఅని పేర్కొన్నారు

English summary
In an ongoing fight against the novel coronavirus, the researchers have developed a new test that can diagnose COVID-19 in just 20 minutes.The findings, published in the Journal of Medical Microbiology, show the rapid molecular test called N1-STOP-LAMP, is 100 per cent accurate in diagnosing samples containing SARS-CoV-2 at high loads.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X