వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ విమానాశ్రయంలో కరోనా పరీక్షలు .. 10 నిముషాల్లోనే రిపోర్టులు

|
Google Oneindia TeluguNews

ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్ కరోనా విషయంలో ఒక అడుగు ముందుకేసింది . ఇక విమానాశ్రయంలోనే ప్రయాణికుల కోసం కరోనా పరీక్షల సదుపాయాన్ని ప్రారంభించింది. దుబాయ్ విమానాశ్రయం నుంచి ఎమిరేట్స్ విమానాలు టేకాఫ్ అయ్యే ముందు ప్రతి ప్రయాణికుడికి కరోనా పరీక్ష నిర్వహిస్తారు. ఇక పరీక్షల ఫలితాలు కూడా పది నిమిషాల్లోనే వస్తాయి. దీంతో ఎవరికైనా కరోనా ఉందని నిర్ధారణ అయితే కరోనా పాజిటివ్ ఉన్న వారిని విమానంలోకి అనుమతించకుండా వారిని ఐసోలేషన్ కు తరలిస్తారు .

తెలంగాణాలో కరోనా మూఢ నమ్మకాలు ... గుండ్లు గీసుకుంటే కరోనా రాదంట !!తెలంగాణాలో కరోనా మూఢ నమ్మకాలు ... గుండ్లు గీసుకుంటే కరోనా రాదంట !!

ఇక దుబాయ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ సహకారంతో ఈ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది .అరబ్‌ దేశాల్లో ఇప్పటివరకు దాదాపు 5వేల మందికి కరోనా సోకగా 28మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు లాక్‌డౌన్‌తో పాటు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో ఎమిరేట్స్ విమనాలను నడుపుతోంది. అయితే అవి కూడా లాక్‌డౌన్ కారణంగా దుబాయ్‌లో చిక్కుకుపోయిన విదేశీయులను స్వదేశం వెళ్లడానికి మాత్రమే అనుమతిస్తున్నారు.

Corona tests at that airport .. reports within 10 minutes

ప్రస్తుతం అక్కడ ఉన్న విదేశీయులు వారి స్వదేశాలకు వెళ్లాలనుకునే వారి కోసమే ఈ సర్వీసులను నడుపుతున్నట్టు ఎమిరేట్స్ చెప్తుంది . దీనిలో భాగంగా తొలుత దుబాయి నుంచి టునీషియా వెళ్లిన ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక స్వదేశాలకి తరలించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరీక్షించిన తరువాతే వారిని విమానాల్లో అనుమతిస్తున్నారు .

English summary
Emirates has taken a step forward in the case of Corona. Corona has begun testing for passengers at the airport. Emirates flights to and from the Dubai airport take corona test for every passenger before they take off. The results of further tests will also come in ten minutes. This means that if someone is diagnosed with corona, those who are corona positive will be allowed to isolate them without allowing them to board.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X