వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్రదేశం అమెరికా చేతిలో కరోనా వ్యాక్సిన్ ... ట్రంప్ కీలక ప్రకటన

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతుంది . మరణమృదంగం మోగిస్తుంది . ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 10,033కు చేరింది. పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,45 850 కి చేరుకుంది . ఇక దేశాలకు దేశాలే కరోనాకు వణుకుతున్న పరిస్థితి. అగ్ర దేశమైన అమెరికా సైతం కరోనా మహమ్మారి విషయంలో గడగడలాడిన పరిస్థితి . ఇక 87 వేలకు పైగా బాధితులు కరోనా నుంచి కోలుకుంటున్నారు.

భారత్ లో మరో కరోనా బాధితుడి మరణం .. ఐదుకు చేరిన మృతుల సంఖ్యభారత్ లో మరో కరోనా బాధితుడి మరణం .. ఐదుకు చేరిన మృతుల సంఖ్య

కరోనాకు వ్యాక్సిన్ ఉందన్న డోనాల్డ్ ట్రంప్

కరోనాకు వ్యాక్సిన్ ఉందన్న డోనాల్డ్ ట్రంప్


రోజురోజుకూ విస్తరిస్తోన్న కరోనా వైరస్‌‌ని నివారించేందుకు ప్రపంచ దేశాలూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటి వరకు మందు లేని మహమ్మారిని నివారించటానికి ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనల్లో మునిగిపోయారు. క్లినికల్ ట్రయల్స్ లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటన అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది.
మందులేని మహమ్మారి కరోనాను నిరోధించేందుకు ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్న తరుణంలో కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టమని చెప్పారు ట్రంప్.

కరోనా వైరస్ విరుగుడు మందు చెప్పిన ట్రంప్

కరోనా వైరస్ విరుగుడు మందు చెప్పిన ట్రంప్

ఇప్పటికే చైనాలో విలయ తాండవం చేసిన కరోనా వైరస్ విషయంలో హాంకాంగ్ కు చెందిన పరిశోధకులు మందు కనిపెట్టారు . వారు కనిపెట్టిన కరోనా వైరస్ విరుగుడు మందు విషయంలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని త్వరలో మెడిసిన్ అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఇక అమెరికాలో కూడా కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన అన్ని దేశాల్లోనూ ఆసక్తిని రేపుతోంది.

Recommended Video

Karthik Aryan Spreading Awareness On Covid 19
క్లోరోక్విన్‌ను వినియోగించడానికి ఎఫ్‌డీఐ ఆమోదం

క్లోరోక్విన్‌ను వినియోగించడానికి ఎఫ్‌డీఐ ఆమోదం

కరోనా వైరస్ కు మలేరియా చికిత్సలో వాడే క్లోరోక్విన్‌ సమర్థవంతంగా పనిచేస్తోందని ట్రంప్ ప్రకటించారు. దీన్ని కరోనా చికిత్సకు ఉపయోగించేందుకు ఎఫ్‌డీఏ ఆమోదం కూడా తెలిపినట్టు ట్రంప్ పేర్కొన్నారు. కరోనా వైరస్ సోకిన చాలా మంది రోగులకు తక్షణమే క్లోరోక్విన్‌ను వినియోగించడానికి ఎఫ్‌డీఐ ఆమోదించినట్లుగా ట్రంప్ వెల్లడించారు . ఇప్పటికిప్పుడు ఈ మెడిసిన్ ను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు, ఎఫ్‌డీఐ అనుమతి కోసం ఇతర యాంటీవైరల్ ఔషధాలను కూడా గుర్తించనున్నట్టు తెలిపారు.

English summary
Clinical trials have also begun in the United States as the corona effect is more prevalent in the United States. It is in this backdrop that US President Donald Trump's announcement has sparked interest in all countries. Trump also stated that the FDA has approved the use of corona treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X