వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా వ్యాక్సిన్‌కు భారీ డిమాండ్: 1.2 బిలియన్ డోసులకు డీల్ కుదుర్చుకున్న భారత్ సహా దేశాలు

|
Google Oneindia TeluguNews

మాస్కో/న్యూఢిల్లీ: రష్యా కరోనా వ్యాక్సిన్ 'స్పుత్నిక్ వీ'కి భారీ డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రపంచ మార్కెట్లోకి తమ వ్యాక్సినే ముందుగా వస్తుందని రష్యా ప్రకటించిన నేపథ్యంలో.. ఈ వ్యాక్సిన్లను ముందుగానే తమ దేశానికి తీసుకెళ్లేందుకు ఇతర దేశాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలతో రష్యాతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి.

రష్యాతో భారత్ తోపాటు పలు దేశాల డీల్

రష్యాతో భారత్ తోపాటు పలు దేశాల డీల్

ఆసియా, సౌత్ అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలు కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ కోసం రష్యాతో ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో వెల్లడించింది. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్.. 100 మిలియన్ల డోసులను ట్రయల్స్ అనంతరం పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. రెడ్డీస్ తోపాటు మనదేశంలోని పలు ఫార్మా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు రష్యా కూడా ప్రయత్నాలు జరుపుతోంది.

క్యూలో సుమారు 20 దేశాలు.. 1.2 బిలియన్ డోసుల ఉత్పత్తి..

క్యూలో సుమారు 20 దేశాలు.. 1.2 బిలియన్ డోసుల ఉత్పత్తి..

ఇక బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, మెక్సికో, సౌదీ అరేబియా దేశాలు కూడా రష్యా వ్యాక్సిన్ కోసం క్యూలో నిల్చున్నాయి. వీటితోపాటు మరో 10 దేశాలు తమ వ్యాక్సిన్ కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని రష్యా చెబుతోంది. తాజా ఒప్పందాలతో సుమారు 1.2 బిలియన్ డోసులను ఉత్పత్తి చేయాల్సి ఉందని వెల్లడించింది.

తొలి వ్యాక్యిన్ రష్యానే..

తొలి వ్యాక్యిన్ రష్యానే..

ఆగస్టు రెండో వారంలోనే ప్రజలకు ఉపయోగించవచ్చనే రెగ్యూలేటరీ అనుమతి పొందింది స్పుత్నిక్ వీ. అయితే, చైనాలో తయారు చేసిన ఓ వ్యాక్సిన్‌ను ఆ దేశంలోనే కొందరిపై ఉపయోగిస్తున్నారు. ఆస్ట్రాజెనికా కూడా ఇప్పుడు ట్రయల్స్ చివరి దశలో ఉంది. వ్యాక్సిన్ తీసుకొచ్చే మూడో కంపెనీగా ఆస్ట్రాజెనికా నమోదైంది.

ట్రయల్స్ చివరి దశలో మరికొన్ని వ్యాక్సిన్లు..

ట్రయల్స్ చివరి దశలో మరికొన్ని వ్యాక్సిన్లు..

మోడెర్నా, ఫిజర్ బాటలో ఆస్ట్రాజెనికా కూడా తమ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్నాయి. ఈ మూడు అమెరికా కంపెనీల్లో ఒకే ఒక్క కంపెనీనే కరోనా వ్యాక్సిన్ ఫేస్-3 ట్రయల్స్ లోకి అడుపెట్టింది. అయితే, కొన్ని వ్యాక్సిన్ ట్రయల్స్ సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో మరోసారి ప్రయోగాలు చేసేందుకు సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇంగ్లాండ్ రూపొందించిన వ్యాక్సిన్‌లో కొన్ని లోపాలు ఉండటంతో ప్రయోగాలను నిలిపివేసి.. నిపుణుల పర్యవేక్షణలో మరోసారి లోపాలు లేని వ్యాక్సిన్ తయారు చేసేందుకు సిద్ధమైంది.

English summary
Coronavirus vaccine tracker: At least ten countries in Asia, South America and the Middle East have entered into agreements to access the Russian coronavirus vaccine Sputnik V, a report in the Wall Street Journal said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X