10 కోట్లకు చేరిన కేసులు .. కరోనా వ్యాక్సిన్ వచ్చినా కొత్త వేరియంట్లతో ప్రపంచానికి పెను సవాల్
ప్రపంచవ్యాప్తంగా కరోనా తన పంజా విసురుతూనే ఉంది. మరణ మృదంగాన్ని మోగిస్తూనే ఉంది. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ, మరో నాలుగు కొత్త రకాల ఉత్పరివర్తనలతో కరోనా మహమ్మారి తన ప్రభావం మానవాళి మీద కొనసాగిస్తూనే ఉంది. ఒకపక్క కరోనా మహమ్మారి వ్యాక్సిన్ వచ్చి, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా , కరోనా వ్యాప్తి మాత్రం ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది.
ఏడాది క్రితం చైనాలో ప్రారంభమైన కరోనా మహమ్మారి ఇప్పటివరకు ప్రపంచ దేశాలకు విస్తరిస్తూ అతలాకుతలం చేస్తుంది.
యూకే కొత్త కరోనా స్ట్రెయిన్ అత్యంత ప్రాణాంతకం, అధిక మరణాలకు ఛాన్స్ : బోరిస్ జాన్సన్

రూపం మార్చుకుంటున్న మహమ్మారి వైరస్ .. తీవ్ర సంక్షోభంలో ప్రపంచం
ప్రపంచం మొత్తం కరోనా కారణంగా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. కరోనా నుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత చేపట్టిన అన్ని దేశాలు యుద్ధప్రాతిపదికన కరోనా మహమ్మారి నివారించడం కోసం అనేక టీకాలు అభివృద్ధి చేశాయి . అంతేకాదు రికార్డు వేగంతో అనుమతులు పొంది వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించాయి. అయినప్పటికీ కరోనా మహమ్మారి రూపం మార్చుకుంటూ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూనే ఉంది. యూకే లో కొత్త రకం, దక్షిణాఫ్రికాలో మరో జాతి, జర్మనీలో ఇంకో జాతి ఇలా రోజుకో కొత్త రకం వైరస్ ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 100 మిలియన్లకు, అంటే పది కోట్లకు చేరిన కేసులు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 100 మిలియన్లకు, అంటే పది కోట్లకు చేరుకున్నాయి.
కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ మరియు యుఎస్ లలో విస్తరిస్తున్న ఈ వైరస్ కొత్త వేరియంట్లకు వ్యతిరేకంగా ప్రస్తుత టీకాలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయో అన్న ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమౌతుంది. ప్రస్తుతం విస్తరిస్తున్న కొత్త వేరియంట్లు అసలు మొదట వ్యాప్తిచెందిన కరోనా వైరస్ కంటే ఎక్కువ ప్రభావవంతంగా వ్యాప్తి చెందేవని తెలుస్తుంది.

యూఎస్ లో మార్చి నాటికి కరోనా కొత్త రకం పంజా
బ్రిటన్లో మొట్టమొదట కనుగొనబడిన ఈ వేరియంట్ మార్చి నాటికి పెద్ద ఎత్తున విస్తరిస్తుంది అని సిడిసి ఇటీవల హెచ్చరించింది.
యూఎస్ లో ప్రతి 13 మందిలో ఒకరికి కరోనా కొత్త వేరియంట్ విస్తరిస్తుంది అని తత్ఫలితంగా, దేశంలో మరణాలు కూడా పెద్ద సంఖ్యలో పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. ప్రస్తుతం యూఎస్ లో 4,14,000 మందికి పైగా వైరస్‌తో బాధపడుతున్నారు. దేశంలోని ప్రతి 800 మందిలో ఒక మరణం సంభవిస్తుందని అధికారికంగా లెక్కలు చెబుతున్నారు.

దక్షిణాఫ్రికా కొత్త రకం వైరస్ పై తీవ్ర ఆందోళన
ఇక ఇదే సమయంలో బోరిస్ జాన్సన్ తన దేశంలో మొదట కనుగొన్న వేరియంట్ కూడా మరణానికి కొంచెం ఎక్కువ అవకాశంతో సంబంధం కలిగి ఉండవచ్చని చెప్పి ఆందోళనను రేకెత్తించారు, ఇది చాలా త్వరగా ఖచ్చితంగా జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
దక్షిణాఫ్రికాలో మొదట కనుగొనబడిన వేరియంట్, B.1.351 అని పిలువబడుతుంది, ఇది మరింత ఆందోళన కలిగిస్తుంది . ఆ వేరియంట్ వ్యాక్సిన్ ప్రతిస్పందనపై కొంత ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తోందని పేర్కొన్నప్పటికీ ఆందోళన వ్యక్తమవుతోంది.

కరోనా ప్రమాదకర రూపం తీసుకుంటుందని నిపుణుల ఆందోళన
ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ తో పాటుగా, ఈ వైరస్ పై అధ్యయనం చేస్తున్న మరికొంత మంది నిపుణులు, వ్యాక్సిన్ లకు లొంగని, పరీక్షలలో గుర్తించలేని అత్యంత ప్రమాదకరమైన వైరస్ కూడా వచ్చే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండటం అవసరమంటూ చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత కూడా కరోనా రూపం మార్చుకుంటున్న తీరు ప్రపంచానికి సవాల్ విసురుతుంది. ముందు ముందు మరెలాంటి పెను ముప్పును ఎదుర్కోవాల్సిన వస్తుందో అన్న ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ కరోనా నియంత్రణ కోసం, మహమ్మారి నివారణ కోసం యుద్ధ ప్రాతిపదికన ప్రపంచం అడుగులు వేస్తుంది.

వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా ప్రపంచం ముందు పెద్ద సవాల్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పది కోట్లకు చేరువగా ఉన్న కరోనా కేసులు ఒకింత ఆందోళన కలిగిస్తున్నా , వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో మహమ్మారి నుండి బయటపడగలుగుతామనే ఊరటలో ప్రపంచం ఉంది.
ఈ సవాల్ ను ప్రపంచం ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి .