వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వైరస్ నెగిటివ్ వచ్చినా వాటిలో వైరస్ ఉంటుంది : ఆనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్ రీసెర్చ్

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇక కరోనా సంబంధించిన లక్షణాలు కనిపించగానే ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు . చికిత్స పొందిన చాలా మంది తర్వాత నయమై ఇళ్ళకు కూడా వెళ్తున్నారు. చికిత్స పొందిన వారి రక్త నమూనాల్లో నెగటివ్ వచ్చినప్పటికీ కూడా ఈ భయంకర వైరస్ ఎనిమిది రోజుల పాటు శరీరంలో తిష్ట వేసి ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది . ఇక తాజాగా మరో పరిశోధన కరోనా నెగిటివ్ వచ్చినా సరే బాధితుడి కళ్ళె లో (స్పుటం ), అలాగే బాధితుడి మలంలో కరోనా వైరస్ బ్రతికే ఉంటుందని తేల్చింది .

వైద్య నిపుణుల‌కు, శాస్త్ర‌వేత్త‌ల‌కు క‌రోనా వైర‌స్ కొత్త స‌వాళ్ళు

వైద్య నిపుణుల‌కు, శాస్త్ర‌వేత్త‌ల‌కు క‌రోనా వైర‌స్ కొత్త స‌వాళ్ళు

క‌రోనాకు మందు లేదు . అంతే కాదు నియంత్రణ లేకుంటే లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి . ఇక ఇంకా మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ కనిపెట్టని కరోనా కోసం ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు జరుగుతున్నాయి. ప్ర‌పంచ వైద్య నిపుణుల‌కు, శాస్త్ర‌వేత్త‌ల‌కు క‌రోనా వైర‌స్ కొత్త స‌వాళ్ల‌ను విసురుతోంది. ఇక ఈ క్రమంలోనే అసలు కరోనా వైరస్ ఏంటి? అది ఎలా ప్రవర్తిస్తది? దాన్ని అరికట్టాలంటే ఎలా? అని పరిశోధనలు జరుగుతున్నాయి. చైనాలో మొన్నటివరకు మరణ మృదంగం మోగించిన కరోనా కాస్త తగ్గు ముఖం పట్టిన నేపధ్యంలో ఇటీవ‌ల ఓ షాకింగ్ న్యూస్ అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెడుతోంది.

ఆనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్​ రీసెర్చ్ లో ఆసక్తికర విషయాలు

ఆనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్​ రీసెర్చ్ లో ఆసక్తికర విషయాలు

ఇటీవ‌ల క‌రోనా నెగ‌టివ్ గా నిర్ధార‌ణ అయిన కొంద‌రు పేషెంట్స్ నుంచి సేక‌రించిన క‌ళ్లె, మ‌లం న‌మూనాల్లో కరోనా వైరస్​ను గుర్తించారు చైనా డాక్ట‌ర్లు. ఆనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్​లో ఈ రీసెర్చ్ ప్రచురితమైంది.కరోనా బారిన అప్డిన వ్య‌క్తిని హాస్పిట‌ల్ నుంచి డిచ్చార్జ్ చేసేముందు ఎక్కువ‌గా క‌ఫం ద్వారా టెస్టులు చేస్తారు. ఆ రిజ‌ల్ట్స్ బ‌ట్టి స‌ద‌రు వ్య‌క్తి క్వారంటైన్​లో ఉండాల్సింది లేనిది డిసైడ్ చేస్తార‌ని చైనాలోని క్యాపిటల్​ మెడిక‌ల్ యూనివ‌ర్సిటి పరిశోధలుకు తెలిపారు. ఇక వచ్చిన రిజ‌ల్ట్స్ సరైనవేనా లేక బాడీలోని ఇతర భాగాల నుంచి శాంపిల్స్ సేకరించాలా అనే విషయంపై పరిశోధకులు చర్చలు జరుపుతున్నారు.

 క‌ళ్లె, మ‌లం న‌మూనాల్లో కరోనా వైరస్

క‌ళ్లె, మ‌లం న‌మూనాల్లో కరోనా వైరస్

రక్త నమూనా టెస్టుల్లో కరోనా నెగిటివ్​గా తేలిన తర్వాత కూడా కొందరు రోగుల కళ్లెలో 39 రోజులు, మలంలో 13 రోజుల పాటు ఈ డేంజ‌ర‌స్ వైరస్​ ఉంటున్నట్లు గుర్తించారు వైద్యులు . అయితే సదరు నెగిటివ్ వచ్చిన రోగి ద్వారా ఇతరుల‌కు వైర‌స్ వ్యాప్తి చెందుతుంద‌నే విష‌యంపై క్లారిటీ లేద‌ని వైద్యులు పేర్కొన్నారు. ఈ విష‌యంపై మ‌రింత అధ్య‌య‌నం అవ‌స‌ర‌మ‌ని వారు అభిప్రాయ‌ప‌డ‌తున్నారు. మొత్తానికి కరోనా వైరస్ నెగిటివ్ వచ్చినా కళ్లెలో, మలంలో వైరస్ బ్రతికే ఉంటుందని చెప్తున్నారు .

English summary
Corona epidemic trembles the world. Doctors are being treated in isolation wards when coronary symptoms appear. One study found that the hormone virus remained in the body for up to eight days, despite negative results in the treated blood samples. More recent research has shown that coronavirus remains alive in the victim's (sputum), as well as in the victim's stool, even if the corona is negative.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X