• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నెగిటివ్ వచ్చినా శరీరంలో వైరస్ తిష్ట .. కరోనా వైరస్ పై చైనాలో రీసెర్చ్ చేసిన ఇండియన్ సైంటిస్ట్

|

చైనాను వణికించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఇప్పుడు భయభ్రాంతులకు గురి చేస్తుంది.ముఖ్యంగా ఇటలీని కరోనా మమమ్మారి పట్టి పీడిస్తుంది. ఇటలీని కన్నీట ముంచింది . శవాల దిబ్బలుగా ఇటలీని మార్చింది . అగ్రరాజ్యమైన అమెరికా సైతం కరోనాతో వణుకుతుంది. ఇక ఇండియాలోనూ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న పరిస్థితులు ఇండియన్స్ ను భయపెడుతున్నాయి . ఇక ఈ నేపధ్యంలో అసలు కరోనా వైరస్ ఏంటి? అది ఎలా ప్రవర్తిస్తుంది. మానవ శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది . దీనిని అరికట్టటం ఎలా అని పరిశోధనలు చేస్తున్న క్రమంలో కరోనా వైరస్ గురించి ఆసక్తికరమైన అంశం ఒకటి పరిశోధనలో వెలుగులోకి వచ్చింది .

జగన్ చేతల మనిషి .. పొలికేకలకి, పరిపాలనకి తేడా ఇదే : వైసీపీ ఎంపీ

కరోనా పాజిటివ్ తగ్గినా వైరస్ ప్రభావం

కరోనా పాజిటివ్ తగ్గినా వైరస్ ప్రభావం

కరోనా మహమ్మారికి సంబంధించిన లక్షణాలు కనిపించగానే ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్స పొందిన చాలా మంది తర్వాత నయమై ఇళ్ళకు కూడా వెళ్తున్నారు. చికిత్స పొందిన వారి రక్త నమూనాల్లో నెగటివ్ వచ్చినప్పటికీ కూడా ఈ భయంకర వైరస్ ఎనిమిది రోజుల పాటు శరీరంలో తిష్ట వేసి ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది . ఇక వారు క్వారంటైన్ పాటించి తగు జాగ్రత్తలు ,పౌష్టికాహారం తీసుకోకుంటే మళ్ళీ కరోనా వారిపై తమ ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని ఈ పరిశోధనలో తేలింది.

 నెగిటివ్ రిపోర్ట్ వచ్చినా 8 రోజుల పాటు ఉంటుందని తేల్చిన రీసెర్చ్

నెగిటివ్ రిపోర్ట్ వచ్చినా 8 రోజుల పాటు ఉంటుందని తేల్చిన రీసెర్చ్

కరోనా వైరస్ బారిన పడిన వారికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చినా మరో ఎనిమిది రోజుల పాటు వైరస్ శరీరంలోనే తిష్ట వేసుకుని కూర్చుంటోందని, ఇది చాలా డేంజర్ అని 'అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ రెస్పిరేటరీ అండ్‌ క్రిటికల్‌ కేర్‌ మెడిసిన్‌' తాజా సంచికలో ప్రచురితమైన వివరాలను బట్టి తెలుస్తుంది. ఇక వ్యాధి బారిన పడి, చికిత్స పొందాక, ఆ లక్షణాలు కనిపించక పోయినా, ఆపై మరో ఎనిమిది రోజుల పాటు వైరస్‌ వారి శరీరంలోనే దాగుందని గుర్తించినట్టు భారతీయ సంతతి శాస్త్రవేత్త లోకేశ్‌ శర్మ తెలిపారు. చైనాలో కరోనా రోగులపై ఆయన ఓ పరిశోధన చేసి, దాని వివరాలను ప్రకటించారు. ఇక ఈ వివరాలు కూడా కరోనా విషయంలో జాగ్రత్త అనే అంశాన్ని స్పష్టంగా చెప్తుంది .

 నెగిటివ్ వచ్చినా 8 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని సూచన

నెగిటివ్ వచ్చినా 8 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని సూచన

ఇక లోకేశ్‌ శర్మ తాము చేసిన పరిశోధనలో బీజింగ్‌ లోని పీఎల్‌ఏ జనరల్‌ హాస్పిటల్ లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 9 మధ్య వ్యాధికి చికిత్స పొందిన 16 మందికి సంబంధించిన శాంపిల్స్ తీసుకున్నామని , వీరి నుంచి రోజు విడిచి రోజు రక్త నమూనాలు సేకరించామని పేర్కొన్నారు . చికిత్స తరువాత వైరస్‌ లేదని నిర్ధారణ అయిన వారిలో సగం మందిలో మరో ఎనిమిది రోజులపాటు వైరస్‌ దాగుందని తెలిపారు. చికిత్స పొందిన వారు మరికొన్ని రోజులు క్వారంటైన్ లో ఉంటేనే మంచిదని సూచించారు. నెగిటివ్ వచ్చిందని తగ్గిపోయింది అనుకుంటే పొరబాటేనని తేల్చి చెప్పారు. నెగిటివ్ అని చెప్పినా కొద్ది రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ పాటించాలని సూచించారు.

English summary
According to the latest issue of the American Journal of Respiratory and Critical Care Medicine, the virus has remained in the body for another eight days, despite the negative report of those infected with coronavirus. Indian geneologist Lokesh Sharma said the virus was found in the body for eight more days after it was infected, treated and the symptoms disappeared.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more