వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్: ప్రపంచంలో మిలియన్ జనాభాలో ఎంత మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారో తెలుసా?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/న్యూఢిల్లీ: కరోనావైరస్(కొవిడ్-19) ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఓ మహమ్మారి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. కొవిడ్ నియంత్రణ కోసం భారత్ తోపాటు అనేక దేశాలు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే.

అయితే, కరోనాను నియంత్రించడంలో పరీక్షలు నిర్వహించడం అనేది కీలక పక్రియ. కాగా, ఇప్పటి వరకు భారతదేశంలో 1,89,111 మందికి కరోనా పరీక్షలు జరిగాయి. ప్రస్తుతం మిలియన్ పాపులేషన్‌కు ఇండియా 137 మందికి పరీక్షలు నిర్వహిస్తోంది. కాగా, మనదేశంలోని కొన్ని రాష్ట్రాల జనాభానే ప్రపంచంలోని కొన్ని దేశాల జనాభాకు సమానంగా, రెట్టింపుగా ఉండటం గమనార్హం.

coronavirus: A look at how countries across the world are testing per million population

ఇక ప్రపంచంలోని ఇతర దేశాల విషయానికొస్తే..

ఫేరో ఐస్‌లాండ్స్: మిలియన్ పాపులేషన్‌కు 112,744 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ 184 కేసులు నమోదు కాగా, ఎవరూ మృతి చెందలేదు.

ఐస్‌లాండ్స్: మిలియన్ ప్రజల్లో 103,308 మందికి పరీక్షలు నిర్వహిస్తోంది. 1701 కేసులు నమోదు కాగా, 8 మరణాలు సంభవించాయి.

యూఏఈ: మిలియన్ ప్రజల్లో 65,538 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 4123 మందికి కరోనా సోకగా, 22 మంది ప్రాణాలు కోల్పోయారు.

లక్సెంబర్గ్: మిలియన్ ప్రజల్లో 46,591 మందికి పరీక్షలు చేస్తున్నారు. 3281 కేసులు నమోదు కాగా, 66 మరణాలు సంభవించాయి.

గిబ్రాల్టర్: మిలియన్ ప్రజల్లో 46,244 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 129 కేసులు నమోదు కాగా, మరణాలు సంభవించలేదు.

ఫక్లాండ్ ఐస్‍లాండ్స్: మిలియన్ పాపులేషన్లో 39,368 మందిని పరీక్షిస్తున్నారు. 5 కేసులు నమోదు కాగా, మరణాలు లేవు.

మాల్టా: మిలియన్ ప్రజల్లో 38,633 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 378 కేసులు నమోదు కాగా, 9 మరణాలు సంభవించాయి.

బహ్రెయిన్: మిలియన్ ప్రజల్లో 37,596 మందికి పరీక్షలు చేస్తున్నారు. 1136 కరోనా కేసులు నమోదు, 6 మరణాలు సంభవించాయి.

శాన్ మారినో: మిలియన్ ప్రజల్లో 24,933 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 356 మంది కరోనా సోకగా, 35 మరణాలు సంభవించాయి.

లీచ్టెన్స్టీన్: మిలియన్ ప్రజల్లో 23,605 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 79 కేసులు నమోదు కాగా, ఒక మరణం సంభవించింది.

నార్వే: మిలియన్ ప్రజల్లో 23,332 మందికి పరీక్షలు నిర్వహించారు. 6525 కరోనా కేసులు నమోదు కాగా, 128 మరణించారు.

ఎస్టోనియా: మిలియన్ ప్రజల్లో 22,878 మందికి పరీక్షలు చేస్తున్నారు. 1309 కేసులు నమోదు కాగా, 25 మరణాలు సంభవించాయి.

ఐల్ ఆఫ్ మ్యాన్: మిలియన్ ప్రజల్లో 22,744 మందికి పరీక్షలు చేస్తున్నారు. 228 కేసులు నమోదు కాగా, 2 మరణాలు సంభవించాయి.

బ్రూనై: మిలియన్ ప్రజల్లో 22,593 పరీక్షలు నిర్వహిస్తున్నారు. 136 కేసులు నమోదు కాగా, ఒక మరణం సంభవించాయి.

స్విట్జర్లాండ్: మిలియన్ ప్రజల్లో 22,393 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 25,415 కేసులు నమోదు కాగా, 1106 మరణాలు సంభవించాయి.

ఎక్కువ కేసులు నమోదైన దేశాలు:

యూఎస్ఏ: మిలియన్ పాపులేషన్‌లో 8,559 మందిని పరీక్షిస్తున్నారు. 560,433 కేసులు నమోదు కాగా, 22,115 మరణాలు సంభవించాయి.

స్పెయిన్: మిలియన్ ప్రజల్లో 12,883 పరీక్షలు నిర్వహిస్తున్నారు. 166,381 కేసులు నమోదు కాగా, 17,209 మరణాలు సంభవించాయి.

ఇటలీ: మిలియన్ ప్రజల్లో 16,708 పరీక్షలు చేస్తున్నారు. 156,363 కేసులు నమోదు కాగా, 19,899 కేసులు నమోదయ్యాయి.

ఫ్రాన్స్: మిలియన్ ప్రజల్లో 5114 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 132,591 కేసులు నమోదు కాగా, 14,393 మరణాలు సంభవించాయి.

జర్మనీ: మిలియన్ ప్రజల్లో 15,730 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 127,854 కేసులు నమోదు కాగా, 3022 మరణాలు సంభవించాయి.

English summary
Testing holds the key in the battle against coronavirus. Several countries have been testing people depending on its capacity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X