వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: చికెన్ తింటే కరోనా వస్తుంది జాగ్రత్త, చైనా, మీకు సిగ్గు శరం మానం మర్యాద ఉందా!

|
Google Oneindia TeluguNews

బీజింగ్/ బ్రెజిల్: చికెన్ మీరు తింటే కరోనా వైరస్ వస్తుంది ? మీరు జాగ్రత్తగా ఉండాలంటూ చైనా ప్రజలను అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న రొయ్యల ప్యాకెట్ లపై కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు, వైరస్ నమూనాలు ఉన్నాయని, ఇప్పుడు చికెన్ పార్శిల్ ప్యాకెట్ ల మీద అలాగే కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని షెన్ జెన్ నగర ప్రజలను చైనా ప్రభుత్వం హెచ్చరించింది. ప్రపంచానికి కరోనా వైరస్ ను పరిచయం చేసిన చైనానే మరో దేశం మనకు కరోనా వైరస్ ను పంపిస్తోందని ఆరోపణలు చెయ్యడం విడ్డూరంగా ఉందని, అసలు మీకు సిగ్గు శరం మానం మర్యాద ఏమైనా ఉన్నాయా అంటూ ప్రపంచ దేశాల ప్రజలు డ్రాగెన్ ప్రభుత్వం మీద మండిపడుతున్నారు.

Gold smuggling: నేను ముద్దమందారం, ముట్టుకుంటే, రూ. 100 కోట్ల స్కామ్, నో బెయిల్, ఈడీ కస్టడీ !Gold smuggling: నేను ముద్దమందారం, ముట్టుకుంటే, రూ. 100 కోట్ల స్కామ్, నో బెయిల్, ఈడీ కస్టడీ !

కరోనా పుట్టినిల్లు చైనా కాదా ?

కరోనా పుట్టినిల్లు చైనా కాదా ?

ప్రపంచ దేశాలకు ఈ రోజుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఒకే ఒక్క పేరు కరోనా వైరస్ (COVID 19) అనే విషయం చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా దేశం. చైనా నిర్లక్షం కారణంగానే ప్రపంచం మొత్తం కరోనా వైరస్ వ్యాపించదని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో సహ ప్రపంచ దేశాలు బహిరంగంగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

నిన్న రొయ్యలు... నేడు చికెన్

నిన్న రొయ్యలు... నేడు చికెన్

విదేశాల నుంచి చైనాకు దిగుమతి అవుతున్న మాంసాహారం ప్యాకెట్ల మీద కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని, వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని చైనీయులను అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. ఇంత వరకు రొయ్యల దిగుమతుల ప్యాకెట్ల మీద కరోనా వైరస్ ఉందని ఆరోపిస్తూ వస్తున్న చైనా ప్రభుత్వం ఇప్పుడు ఆదేశాలనికి దిగుమతి చేసుకుంటున్న చికెన్ లో కరోనా వైరస్ లక్షణాలు, వైరస్ నమూనాలు ఉన్నాయని ఆరోపించడంతో ప్రపంచ దేశాల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మీకు సిగ్గు శరం మానం మర్యాద ఉందా !

మీకు సిగ్గు శరం మానం మర్యాద ఉందా !

బ్రెజిల్ నుంచి చైనా దేశానికి ప్రతిరోజు భారీగా వేల టన్నుల చికెన్ ఎగుమతి అవుతోంది. బ్రెజిల్ దేశం నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న చికెన్ ప్యాకెట్లు, వాటి బాక్స్ ల మీద కరోనా వైరస్ లక్షణాలు, వాటి నమూనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఆ చికెన్ మీరు తినకూడదని చైనాలోని షెన్ జెన్ నగర ప్రజలను స్థానిక ప్రభుత్వం హెచ్చరించింది. ఈ విషయాన్ని రాయిటర్స్ రిపోర్టు వెలుగులోకి తీసుకురావడంతో అసలు మీకు సిగ్గు శరం మానం మర్యాద ఏమైనా ఉందా అంటూ చైనా మీద ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి.

దిక్కుమాలిన పని చేసి నీతులు చెబుతారా ?

దిక్కుమాలిన పని చేసి నీతులు చెబుతారా ?

కరోనా వైరస్ చైనాలో వెలుగు చూసినా దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్షం చేసి WHOకు తప్పుడు సమాచారం ఇచ్చి నేడు ప్రచంచ దేశాలకు నిద్రలేకుండా చేసిన చైనా ప్రభుత్వంపై ప్రపంచ దేశాలు విరుచుకుపడుతున్నాయి. దిక్కుమాలిన పని చేసింది మీరు, ఇప్పుడు ఇతర దేశాల మీద నిందలు వేస్తున్నారా ? బ్రెజిల్ నుంచి తెప్పించుకుంటున్న చికెన్ వలన మీకే కరోనా వస్తుందని నీతులు చెబుతారా ? అంటూ ప్రజలు మండిపడుతున్నారు.

Recommended Video

Reliance Industries Ranked 2nd Biggest Brand Globally After Apple || Oneindia Telugu
సినిమా చూసేసి స్క్రీన్ చించేసినట్లుంది

సినిమా చూసేసి స్క్రీన్ చించేసినట్లుంది


ఈక్వెడార్ నుంచి చైనాకు రవాణా అవుతున్న రొయ్యలను ఇప్పటికే చైనా ప్రభుత్వం నిషేధించింది. ఈక్వెడార్ నుంచి దిగుమతి అవుతున్న రొయ్యలపై కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని ఆరోగ్య పరీక్షల్లో వెలుగు చూసిందని, అందుకే సముద్ర మాంసాహారంపై నిషేధం విదించామని బుధవారం చైనా ప్రభుత్వం ప్రకటించింది. అయితే చైనా మునిసిపల్ ఆరోగ్య శాఖ అధికారులు కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు క్షుణ్ణంగా పరిశీలించకుండానే ఇలాంటి చర్యలు తీసుకుంటోందని రయిటర్స్ నివేదిక స్పష్టం చేస్తోంది.

English summary
Coronavirus: After sea foods, Chicken imported from Brazil tests positive for COVID 19 virus, says China’s Shenzhen government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X