వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయం: ఒక్కరోజే 1.50 లక్షల మందికి పాజిటివ్, డబ్ల్యూహెచ్‌వో ఆందోళన..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా లక్ష యాభై వేల పాజిటివ్ కేసులను గుర్తించారు. ఇది ఒకరోజు హైయస్ట్ పాజిటివ్ కేసులు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. ఇందులో సగానికిపైగా అమెరికాలోనే రికార్డయ్యాయని.. దక్షిణ ఆసియా, మధ్య ప్రాచ్యలో కూడా ఎక్కువ కేసులను గుర్తించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధానమ్ తెలిపారు.

పీక్ స్టేజీ..

పీక్ స్టేజీ..


వైరస్ వేగంగా వ్యాపించడంతో ప్రమాదకరమైన దశలోకి చేరుతోందన్నారు. కానీ చాలా మంది ప్రజలు ఇంటికే పరిమితమవుతున్నారని గుర్తుచేశారు. ఆయా దేశాలు ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకున్నాయని తెలిపారు. కానీ వైరస్ మాత్రం ఇంకా వేగంగా వ్యాపించడం మాత్రం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. వైరస్ వ్యాపిస్తోన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఇతరులతో భౌతికదూరం పాటించాలని సూచించారు.

మాస్క్ కంపల్సరీ

మాస్క్ కంపల్సరీ


ఒకవేళ మీకు అస్వస్దత ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ముక్కుకు మాస్క్ వేసుకోవాలని, చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. లక్షణాలు కనిపించిన ప్రతీ ఒక్కరినీ పరీక్షించాలని ఆయా దేశాలకు సూచించామని తెలిపారు. లక్షణాలు కనిపించిన వారిని క్వారంటైన్ చేయాలని కోరారు. వైరస్ పెరుగుతోన్న నేపథ్యంలో కొన్ని దేశాల్లో మరణాలు కూడా పెరుగుతున్నాయని చెప్పారు.

Recommended Video

Bandla Ganesh కు Coronavirus పాజిటివ్..టెన్షన్ లో Tollywood!
డ్రగ్‌కు డీసీజీఐ ఓకే

డ్రగ్‌కు డీసీజీఐ ఓకే

మరోవైపు కరోనా వైరస్ కోసం పెవిపిరవిర్ డ్రగ్ ఉపయోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. కుటుంబసభ్యుల అనుమతి తీసుకొని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇస్తామని చెబుతోంది. సదరు రోగులకు 14 రోజులపాటు ట్రీట్ మెంట్ ఇస్తామని, ఇందుకోసం వెయ్యిమందిని ఎంపిక చేస్తామని తెలిపింది.

English summary
coronavirus pandemic is "accelerating" and that more than 1,50,000 cases were reported yesterday - the highest single-day number so far World Health Organization Chief Tedros Adhanom Ghebreyesus said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X