• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా కేసులు.. 2 కోట్లను దాటి మరింత పైపైకి: ఏడు లక్షల 34 వేలకు పైగా మరణాలు

|

బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోంది. మరణ మృదంగాన్ని మోగిస్తోంది. కరోనా ధాటికి ప్రపంచం మొత్తం కకావికలమౌతోంది. మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే పోతోంది. జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. భారత్ సహా అనేక దేశాల్లో పాజిటివ్ కేసులు.. దానికి అనుగుణంగా మరణాల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణాలు ఏడు లక్షలను ఎప్పుడో దాటేశాయి. వ్యాక్సిన్ వచ్చేంత వరకూ కరోనా కల్లోలా పరిస్థితులు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.

    Coronavirus Upadate : 2nd డెత్ In India, 68-Year-Old Woman Passed Away In Delhi

    ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా 7,34,239 మంది కరోనా వైరస్ బారిన పడి మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పైపైకి వెళ్తోనే ఉంది. 2,00,40,516 కేసులు నమోదు అయ్యాయి. అమెరికాలో కరోనా వల్ల సంభవించిన మరణాలు లక్షన్నరను అధిగమించాయి. 1,65,617 మంది కరోనాకు బలి అయ్యారు. 51,99,444 మంది కరోనా బారిన పడ్డారు. ఆసుపత్రులు, కోవిడ్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. అత్యధిక పాజిటివ్ కేసులు కాలిఫోర్నియాలో నమోదు అయ్యాయి. ఈ ఒక్క రాష్ట్రంలోనే 5,63,021 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

    Coronavirus daily updates around the world and India, here are the updates in AP and Telangana too

    ఫ్లోరిడా, టెక్సాస్‌లల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అయిదు లక్షలను దాటింది. ఫ్లోరిడా-5,32,806, టెక్సాస్-5,10,806 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ రెండు నగరాలతో పోల్చుకుంటే న్యూయార్క్‌‌లో పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తక్కువే. అయినప్పటికీ.. మరణాలు అధికంగా ఉన్నాయి. అమెరికా తరువాత బ్రెజిల్ ఆ స్థాయిలో ప్రాణనష్టాన్ని చవిచూసింది. బ్రెజిల్‌లో లక్షమందికి పైగా మరణించారు.ఇప్పటిదాకా 1,01,136 మంది చనిపోయారు. 30,35,582 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

    మెక్సికోలో కరోనా వైరస్ మరణాలు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటిదాకా 52,298 మంది మరణించారు. 4,75,902 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. పెరూలోనూ అదే తీవ్రత కనిపిస్తోంది. నాలుగు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల జాబితాలో కొత్తగా పెరూ చేరింది. పెరూలో 4,78,024 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 21,072 మంది అక్కడ మరణించారు. దక్షిణాఫ్రికాలో 5,59,859 కేసులు వెలుగు చూశాయి. మరణాల సంఖ్య 10 వేల మార్క్‌ను దాటింది. ఇప్పటిదాకా 10,408 మంది దక్షిణాఫ్రికాలో చనిపోయారు.

    భారత్‌లో 24 గంటల వ్యవధిలో కొత్తగా 62,064 కరోనా వైరస్ కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం నమోదైన కేసుల సంఖ్య 22,15,075కు చేరుకుంది. 44,386 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు కొద్దిసేపటి కిందటే తాజా బులెటిన్‌ను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 6,34,945కు చేరుకుంది. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 15,35,744కు చేరుకుంది.

    తెలంగాణలో 24 గంటల్లో కొత్తగా 1256 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 10 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 80,751కి చేరుకుంది. ఇందులో 57,586 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 637కు పెరిగింది. యాక్టివ్ కేసులు 22,528గా నమోదు అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ కార్యాలయం కొద్దిసేపటి కిందటే బులెటిన్‌ను విడుదల చేసింది. డిశ్చార్జి అయిన వారి సంఖ్య క్రమంగా మెరుగుపడుతోంది. అరలక్షను దాటింది. 24 గంటల వ్యవధిలో 1587 మంది డిశ్చార్జి కావడం దీనికి నిదర్శనం.

    English summary
    Karnataka, Punjab, Odisha, Rajasthan, Goa, West Bengal, Gujarat have locked down their borders as a precautionary measureAll passenger train service have been cancelled till 31 March. Union Health Ministry, on Saturday, authorised private laboratories to test for COVID-19 under guidelines issued by ICMR. China reported its first domestic coronavirus case after a gap of three days. The global death toll has crossed 13,000, with an estimated 3,00,000 people infected.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more