వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరుసగా రెండో రోజూ భారత్‌లో 40 వేలకు పైగా కొత్త కేసులు.. విమాన సర్వీసులు మరో నెల రద్దు

|
Google Oneindia TeluguNews

బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోంది. మరణ మృదంగాన్ని మోగిస్తోంది. కరోనా ధాటికి ప్రపంచం మొత్తం కకావికలమౌతోంది. మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే పోతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య 42 లక్షలను దాటేశాయి. గంటగంటకూ రాకెట్లా దూసుకెళ్తున్నాయి. అనేక దేశాల్లో పాజిటివ్ కేసులు.. దానికి అనుగుణంగా మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో, మరణాలకు అడ్డుకట్ట వేయడంలో విజయవంతమైన అగ్రదేశాలు ఇప్పుడిప్పుడే కుదురుకుంటోన్నాయి.

Recommended Video

Coronavirus Upadate : 2nd డెత్ In India, 68-Year-Old Woman Passed Away In Delhi

విమానయాన సర్వీసులను పునరుద్ధరించడంపై దృష్టి సారించాయి. కొత్త వేరియంట్లు కలవరపాటుకు గురి చేస్తోన్నాయి. అదే సమయంలో భారత్.. అంతర్జాతీయ విమాన సర్వీసులను మరో నెలరోజుల పాటు పొడిగించింది. ఈ నిషేధం ఆగస్టు 31వ తేదీ వరకు కొనసాగుతుంది.
ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి 42,18,536 మంది మరణించారు. పాజిటివ్ కేసులు 19,75,59,684 నమోదయ్యాయి. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అమెరికాలో ఇప్పటిదాకా 6,28,492 మంది చనిపోయారు. పాజిటివ్ కేసుల సంఖ్య మూడున్నర కోట్లను దాటాయి.

Coronavirus daily updates around the world and India, here are the updates in AP and Telangana too

ఇప్పటిదాకా 3,55,84,272 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. బ్రెజిల్‌లో 5,54,626 మంది చనిపోయారు. 1,98,39,369 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అమెరికా తరువాత అత్యధిక మరణాల జాబితాలో బ్రెజిల్ రెండోస్థానంలో ఉంది. మెక్సికోలో కరోనా వల్ల 2,39,997 మంది మరణించారు. 28,10,097 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. పెరూలో కరోనా మరణాలు రెండు లక్షలకు చేరువ అవుతున్నాయి. ఇప్పటిదాకా అక్కడ 1,96,214 మంది చనిపోయారు.

బ్రిటన్‌లో కరోనా మరణాలు 1,29,515కి చేరుకున్నాయి. ఇటలీలో లక్షమందికి పైగా కరోనా బారిన పడి చనిపోయారు. ఇటలీలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం మరణాల సంఖ్య 1,28,029. లక్షకు పైగా మరణాలు నమోదైన దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్, భారత్, మెక్సికో, బ్రిటన్‌, ఇటలీ, రష్యా, పెరూ, ఫ్రాన్స్ తరువాత కొత్తగా అర్జెంటీనా కూడా చేరింది. అర్జెంటీనాలో లక్షకు పైగా మరణాలు నమోదయ్యాయి. 1,05,113 మంది మరణించారు. ఆయా దేశాల్లో మరణాల రేటులో వేగం తగ్గింది.

భారత్‌లో 24 గంటల వ్యవధిలో కొత్తగా 44,230 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 555 మంది మరణించారు. 42,360 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,15,72,344కు చేరింది. ఇందులో 3,07,43,972 మంది కోలుకున్నారు. 4,23,217 మంది మృత్యువాత పడ్డారు. యాక్టివ్ కేసులు 4,05,155గా నమోదయ్యాయి.

ఏపీలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,068 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 22 మంది మరణించారు. 2,127 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 19,64,117కు చేరుకుంది. ఇందులో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 19,29,565 మంది ఉన్నారు. 13,354 మంది మృత్యువాత పడ్డారు. తాజా బులెటిన్ ప్రకారం.. 21,198 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

English summary
Karnataka, Punjab, Odisha, Rajasthan, Goa, West Bengal, Gujarat have locked down their borders as a precautionary measureAll passenger train service have been cancelled till 31 March. Union Health Ministry, on Saturday, authorised private laboratories to test for COVID-19 under guidelines issued by ICMR. China reported its first domestic coronavirus case after a gap of three days. The global death toll has crossed 13,000, with an estimated 3,00,000 people infected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X