• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొనసాగుతోన్న కరోనా కల్లోలం: అమెరికాలో ఒక్కరోజే 66 వేలకు పైగా.. భారత్‌లో రికార్డు స్థాయిలో

|

బీజింగ్: ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్ రోజురోజుకూ మరింత విస్తరిస్తోంది. రోజులు గడిచే కొద్దీ మరింత బలపడుతోంది. దాని ఉధృతి ఎక్కడా తగ్గట్లేదు. రోజుల తరబడి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నా.. ఆ ప్రాణాంతక వైరస్‌ విస్తరించడానికి అడ్డుకట్ట పడట్లేదు. విధి లేని పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను సడలించుకోవాల్సిన పరిస్థితులను కల్పించింది ఆ మహమ్మారి. భారత్‌ సహా ప్రపంచ దేశాలపై పంజా విసురుతోంది. కరోనా బారిన పడి అల్లాడుతోన్న దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్ తరువాత భారత్ ఉంటోంది. రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

    Coronavirus Upadate : 2nd డెత్ In India, 68-Year-Old Woman Passed Away In Delhi

    అయిదున్నర లక్షల మందికి పైగా

    కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 5,68,269కు చేరుకుంది. అత్యధిక మరణాలు నమోదైన దేశాల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలో బ్రెజిల్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసులు 1,28,67,129లకు చేరుకున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతోండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా దాని తీవ్రత తగ్గుముఖం పట్టలేదు. అమెరికా, బ్రెజిల్‌లల్లో అత్యధిక మరణాలు నమోదు అవుతున్నాయి.

    Coronavirus daily updates around the world and India, here are the updates in AP and Telangana too

    అమెరికాలో మళ్లీ పెరుగుదల..

    రెండు రోజులుగా అమెరికాలో కొద్దిగా తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా వైరస్ తీవత్ర మళ్లీ ఒక్కసారిగా పెరిగింది. శనివారం ఒక్కరోజే 66,528 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇది రెండోసారి. 33,55,895 మంది అమెరికన్లు ఈ వైరస్ బారిన పడ్డారు. 1,37,405 మంది ప్రాణాలను కోల్పోయారు. బ్రెజిల్‌లో కరోనా కాటు వల్ల 71,492 మంది బలి అయ్యారు. 18,40,812 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంటోంది.

    భారత్‌లో విజృంభణ

    భారత్‌లో శరవేగంగా కరోనా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకి రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా 28,637 పాజిటివ్ కేసులు నమోదు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,49,553 కి చేరింది. 551 మంది మరణించారు. మొత్తంగా మరణించిన వారి సంఖ్య 22,674కి చేరుకుంది. దేశంలో అత్యధికంగా తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణ, ఏపీ, హర్యానా, పశ్చిమ బెంగాల్, గుజరాత్‌, రాజస్థాన్‌‌లల్లో కేసులు నమోదు అవుతున్నాయి.

    ఏపీలో రికార్డు స్థాయిలో..

    కొత్తగా నమోదైన 1933 పాజిటివ్ కేసుల్లో 1914 కేసులు వేర్వేరు జిల్లాల్లో నమోదు అయ్యాయి. 19 కేసులు పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన ద్వారా వ్యాప్తిచెందాయి. కొత్తగా 19 మంది మృత్యువాత పడ్డారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 17,624 శాంపిళ్లను పరీక్షించారు. కొత్తగా నమోదైన కేసులతో ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 30 వేలకు చేరువగా వెళ్లింది. మొత్తం 29,168 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 15,412 మంది డిశ్చార్జి అయ్యారు. 328 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 13,428గా నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు.

    English summary
    Karnataka, Punjab, Odisha, Rajasthan, Goa, West Bengal, Gujarat have locked down their borders as a precautionary measureAll passenger train service have been cancelled till 31 March. Union Health Ministry, on Saturday, authorised private laboratories to test for COVID-19 under guidelines issued by ICMR. China reported its first domestic coronavirus case after a gap of three days. The global death toll has crossed 13,000, with an estimated 3,00,000 people infected.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more