వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కల్లోలం .. ప్రపంచవ్యాప్తంగా 9 లక్షలు దాటిన మరణాలు.. వ్యాక్సిన్ కోసం నిరీక్షణ

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం, భారీగా మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తుంది. ఇక వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 2,80,22,276 కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 9లక్షలు దాటింది.

నిమ్స్‌లో కోవ్యాక్సిన్‌ రెండో దశ ట్రయల్స్‌ ప్రారంభించిన భారత్ బయోటెక్ ఫార్మాసూటికల్స్నిమ్స్‌లో కోవ్యాక్సిన్‌ రెండో దశ ట్రయల్స్‌ ప్రారంభించిన భారత్ బయోటెక్ ఫార్మాసూటికల్స్

మరణాలలో యూఎస్ ఫస్ట్ , బ్రెజిల్ సెకండ్

మరణాలలో యూఎస్ ఫస్ట్ , బ్రెజిల్ సెకండ్

గత సంవత్సరం చివరలో చైనాలో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచమంతా విస్తరించింది.కరోనా ప్రబలడం మొదలైన నాటి నుండి ఇప్పటి వరకు కరోనా వైరస్ కంట్రోల్ లోకి రాలేదు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం ప్రపంచమంతా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినప్పటికీ పెద్దగా ఫలితం లేకుండా పోతుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు ఎక్కువగా ఉన్న దేశం యునైటెడ్ స్టేట్స్ కాగా ఆ తర్వాతి స్థానంలో బ్రెజిల్ నిలిచింది.

 కరోనా కేసుల్లో యూఎస్ మొదటి స్థానంలో.. రెండో స్థానంలో ఇండియా

కరోనా కేసుల్లో యూఎస్ మొదటి స్థానంలో.. రెండో స్థానంలో ఇండియా

కరోనా వైరస్ కు సంబంధించిన గణాంకాలు వరల్డ్ మీటర్స్ ప్రకారం యు ఎస్ ఎ లో ఇప్పటివరకు 65, 49, 475 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాలు చూస్తే 1, 95,239 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ప్రపంచంలోనే కరోనా వైరస్ కు అత్యంత ప్రభావితమైన మొదటి దేశంగా యూఎస్ ఉంది. ఆ తర్వాతి స్థానానికి ప్రస్తుతం ఇండియా చేరుకుంది. ఇండియాలో కరోనా వైరస్ కేసులు 44 , 22,965 కాగా ఇప్పటి వరకు మొత్తం మరణాలు 75,091 గా ఉంది.

 ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు

మూడో స్థానంలో బ్రెజిల్ నిలిచింది. బ్రెజిల్లో ఇప్పటివరకు 41, 99, 332కేసులు నమోదు కాగా 1,28 ,653 మరణాలు నమోదైనట్లు గా తెలుస్తుంది. మరణాలలో మొదటి స్థానంలో అమెరికా, రెండో స్థానంలో బ్రెజిల్ నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది కరోనా వైరస్ కారణంగా అనారోగ్యం పాలై ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 70,13,614 యాక్టివ్ కేసులు ఉండగా, కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 2,01,00,662 గా ఉంది.

Recommended Video

Oxford-AstraZeneca Covid-19 Vaccine Trials Pause ప్రయోగాల దశలో సైడ్ ఎఫెక్ట్స్...!! | Oneindia Telugu
ఇప్పటివరకు కరోనా మరణాలు 9,08,000.. వ్యాక్సిన్ కోసం నిరీక్షణ

ఇప్పటివరకు కరోనా మరణాలు 9,08,000.. వ్యాక్సిన్ కోసం నిరీక్షణ

వరల్డ్ మీటర్స్ ప్రకారం కరోనా మరణాలు 9,08,000 చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభాన్ని, ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుండి బయటపడాలంటే కచ్చితంగా వ్యాక్సిన్ రావాల్సిందే. అందుకే యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ తయారీపై నిమగ్నమయ్యాయి ప్రపంచ దేశాలు. వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్త రేసు జరుగుతోంది, తొమ్మిది ఫార్మా కంపెనీలు ఇప్పటికే చివరి దశ 3 ట్రయల్స్‌లో ఉన్నాయి. మరోపక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా మహమ్మారి చివరిది కాదంటూ పేర్కొనడం మరింత ప్రమాదకర పరిస్థితులు, ప్రమాదకర వైరస్లు ముందుముందు వచ్చే అవకాశం ఉందని చెప్పడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచమే కరోనాతో సమరం చేస్తుంది.

English summary
the number of corona cases worldwide was2,80,22,276 , while the number of deaths due to corona to date was 9,08,000 . The country with the most coronavirus deaths is the United States with over 1,90,000 fatalities, followed by Brazil. With billions of people around the world still suffering from the fallout of the crisis, a worldwide race for a vaccine is underway, with nine companies already in late-stage Phase 3 trials
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X