వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వ్యాప్తి, వ్యాక్సిన్‌పై WHO షాకింగ్ - ‘మంత్రదండం’ ఎన్నటికీ రాబోదంటూ..

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) షాకింగ్ ప్రకటనల పరంపర కొనసాగుతున్నది. ప్రాణాంతక వైరస్ పుట్టుకొచ్చి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా సోమవారం సమావేశమైన డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ విభాగం.. కరోనా ఇప్పుడప్పుడే రూపుమాసిపోదని, దశాబ్దాల తరబడి దాని ప్రభావం ఉంటుందని ప్రకటించింది. తాజాగా మంగళవారం కూడా అలాంటిదే మరో ప్రకటన చేశారు సంస్థ జనరల్ సెక్రటరీ టెడ్రోస్ అథోనామ్.

ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఎలాంటి మంత్రదండం లేదని, కరోనాను అంతం చేసే ఆ అద్భుత ఆయుధం ఇప్పటికప్పుడు అందుబాటులోకి వస్తుందని కూడా ఊహించలేమని డబ్ల్యూహెచ్‌వో జనరల్ టెడ్రోస్ వ్యాఖ్యానించారు. సమర్థవంతమైన వ్యాక్సిన్లు తయారైతే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశాల్లేవని ఆయన చెప్పారు.

సీఎం జగన్ మరో రెండు కీలక నిర్ణయాలు - ఏపీ వ్యాప్తంగా ఆ కమిటీలు రద్దు - నకిలీలపై ఇంటెలిజెన్స్ నిఘా..సీఎం జగన్ మరో రెండు కీలక నిర్ణయాలు - ఏపీ వ్యాప్తంగా ఆ కమిటీలు రద్దు - నకిలీలపై ఇంటెలిజెన్స్ నిఘా..

Coronavirus: Despite vaccines, There may never be a ‘silver bullet’ for Covid-19, WHO warns

''కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. వైరస్ ను నిలువరించగల సమర్థవంతమైన వ్యాక్సిన్లు రావాలని ఆశిస్తున్నాం. అప్పటిదాకా దాన్ని ఎదుర్కొనే మంత్రదండమేదీ మన దగ్గర లేనట్లే''అని టెడ్రోస్ అన్నారు.

Recommended Video

#AmitabhBachchan : కరోనా నుంచి కోలుకున్న Amitabh Bachchan! || Oneindia Telugu

వైరస్ ఒక్కో దేశంలో ఒక్కోలా వ్యవహరిస్తుండటంతో కొన్ని ఆయా దేశాల్లో కొత్త కేసులు, మరణాల రేటు భిన్నంగా ఉంటోంది. సోమవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 1.83కోట్లకు పెరిగింది. మరణాల సంఖ్య 7లక్షలకు చేరువైంది. ఇప్పటిదాకా అంతా కలిపి 1.15కోట్ల మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు.

English summary
The World Health Organization warned on Monday that, despite strong hopes for a vaccine, there might never be a “silver bullet” for COVID-19, and the road to normality would be long.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X