వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో మరోసారి 'సీ ఫుడ్' కలకలం... ఇంపోర్టెడ్ ప్యాకేజీపై కరోనా ఆనవాళ్లు...

|
Google Oneindia TeluguNews

చైనాలో ఓ ఇంపోర్టెడ్ సీ ఫుడ్ ప్యాకేజీపై కరోనా వైరస్ ఆనవాళ్లు కలకలం రేపాయి. దలియన్ అనే పోర్టు పట్టణం నుంచి ఆ ఇంపోర్టెడ్ ప్యాకేజీ వచ్చినట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. చైనాలోని లియావోనింగ్ అనే ఈశాన్య ప్రావిన్స్‌లో ఉన్న దలియన్ నుంచి వచ్చిన దిగుమతులపై కరోనా ఆనవాళ్లను గుర్తించడం గత జులై నుంచి ఇది రెండోసారి.

అసలు మూలాలు తెలియదన్న అధికారులు..

అసలు మూలాలు తెలియదన్న అధికారులు..

తూర్పు ప్రావిన్స్‌‌ షాండోంగ్ లోని యాంటై నగరానికి చెందిన మూడు కంపెనీలు ఈ సీ ఫుడ్ ప్యాకేజీలను దిగుమతి చేసుకున్నాయి. అయితే ఆ ప్యాకేజీ దలియన్ పట్టణం నుంచి వచ్చినప్పటికీ... దాని అసలు మూలాలు ఎక్కడన్నది తెలియదని స్థానిక ప్రభుత్వ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. దిగుమతి చేసుకున్న ఆ ప్యాకేజీలను సీజ్ చేశామని.... వాటిని తాకిన వ్యక్తులందరినీ క్వారెంటైన్‌కు పంపించామని తెలిపారు. కరోనా పరీక్షల్లో వాళ్లందరికీ నెగటివ్‌గా తేలిందన్నారు.

మొదట ఈక్వెడార్ నుంచి...

మొదట ఈక్వెడార్ నుంచి...

ప్రాసెస్ చేయబడిన సీ ఫుడ్‌ను మాత్రమే ఎగుమతి చేశారని... మిగతాది ఇప్పటికీ కోల్డ్ స్టోరేజీలోనే భద్రపరిచి ఉంచవచ్చునని తెలిపారు. అంతకుముందు,జులై నెలలో దలియన్ పట్టణ పోర్టులో దిగుమతి అయిన వస్తువులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా... ఈక్వెడార్ నుంచి వచ్చిన సీ ఫుడ్ ప్యాకేజీపై కరోనా ఆనవాళ్లు కనిపించాయి. అగస్టు 9 నాటికి దలియన్ పట్టణంలో మొత్తం 92 కరోనా కేసులు నమోదయ్యాయి.

కరోనా మూలాలు...?

కరోనా మూలాలు...?

చైనాలోని వుహాన్ పట్టణంలో గతేడాది సెప్టెంబర్‌లో మొదటిసారిగా కరోనా వైరస్ మూలాలు వెలుగుచూశాయి. అయితే అంతకు కొద్ది నెలల ముందు నుంచే అక్కడ వైరస్ వ్యాప్తి జరుగుతూ వచ్చిందన్న వాదన ఉంది. ఇప్పటికీ వైరస్ మూలాలపై కచ్చితమైన సమాచారామేదీ అందుబాటులో లేదు. వుహాన్‌లోని ఓ సీ ఫుడ్ మార్కెట్ నుంచి వైరస్ పుట్టుకొచ్చిన చెప్తున్నప్పటికీ... దానికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలేవీ లేవు. ఆ తర్వాత దాని చుట్టూ అనేక కుట్ర కోణాలు కూడా వెలుగుచూశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 'చైనా వైరస్' అని పిలవడం మొదలుపెట్టారు. వైరస్‌పై ప్రపంచ దేశాలను ఆలస్యంగా అప్రమత్తం చేసినందుకు... పాండెమిక్‌గా ప్రకటించడంలో జాప్యం చేసినందుకు డబ్ల్యూహెచ్ఓని సైతం నిందించారు.

Recommended Video

Women Army At IND-PAK Loc, POK కు అత్యంత చేరువగా మహిళా సైనికులు ! || Oneindia Telugu
ముందడుగేసిన రష్యా...

ముందడుగేసిన రష్యా...

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రయోగాల్లో తలమునకలైనయ్యాయి. ఇప్పటికైతే రష్యా ఓ అడుగు ముందుకేసి వ్యాక్సిన్‌ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. స్పుత్నిక్-విగా నామకరణం చేసిన ఈ వ్యాక్సిన్‌పై అనేక సందేహాలు,అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సరైన ట్రయల్స్ లేకుండానే వ్యాక్సిన్ మార్కెట్లోకి ఎలా తీసుకొస్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. రష్యా మాత్రం మొదట వైద్య సిబ్బంది,ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు సన్నద్దమవుతోంది.

English summary
Chinese authorities have found traces of the novel coronavirus (COVID-19) on the packaging of imported frozen seafood that arrived from the port city of Dalian for the second time since July, news agency Reuters reported. Dalian, a major port in the northeastern province of Liaoning, recently saw a surge in cases of COVID-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X