వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయం: కిమ్ దేశంలో ప్రశాంతం.. మహమ్మారిపై ఉత్తర కొరియా ఘనవిజయం.. స్కూళ్లు రీఓపెన్..

|
Google Oneindia TeluguNews

ప్రపంచమంతటా వ్యాప్తి చెంది ఆరు నెలలు గడుస్తున్నా.. కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. రాబోయే రెండు నెలల్లో పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య మరింత పెరగొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. శుక్రవారం నాటికి గ్లోబల్‌గా వైరస్ సోకినవాళ్ల సంఖ్య 1.1కోటికి, మరణాల సంఖ్య 5.25లక్షలకు పెరిగింది. అన్ని దేశాలూ ఎప్పటికప్పుడు తమ దగ్గర నమోదవుతోన్న కేసుల వివరాలను, వైరస్ మారుతోన్న తీరును అంతర్జాతీయ సమాజంతో పంచుకుంటున్నది... ఒక్క ఉత్తరకొరియా తప్ప. కరోనా విలయ కాలంలో అక్కడేం జరుగుతున్నదోననే అనుమానాలకు తెరదించుతూ అధినేత కిమ్ జాంగ్ ఉన్ సంచలన ప్రకటన చేశారు.

చైనాపై ప్రధాని మోదీ పంచముఖ వ్యూహం.. లదాక్ ఎందుకు వెళ్లారంటే.. ఇక డ్రాగన్ పని అయినట్లే..చైనాపై ప్రధాని మోదీ పంచముఖ వ్యూహం.. లదాక్ ఎందుకు వెళ్లారంటే.. ఇక డ్రాగన్ పని అయినట్లే..

కరోనాపై గెలిచాం..

కరోనాపై గెలిచాం..

ఒక్క న్యూజిలాండ్ తప్ప దాదాపు ప్రపంచ దేశాలన్నీ కరోనా విలయంలో కొట్టుమిట్టాడుతుండగా... తాము కరోనా రక్కసిపై ఘన విజయం సాధించినట్లు ఉత్తరకొరియా క్లెయిమ్ చేసుకుంది. రాజధాని పోంగ్యాంగ్ లో గురువారం జరిగిన అధికార పార్టీ(వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా) పొలిట్ బ్యూరో మీటింగ్ లో అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఈ మేరకు ప్రకటించినట్లు ఆదేశ అధికార మీడియా కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ) వెల్లడించింది.

లదాక్‌లో మోదీ..అబద్దాలు చెప్పిందెవరు?.. చైనా పేరెత్తని ప్రధాని.. స్థానికుల మాటిది.. రాహుల్ ఫైర్లదాక్‌లో మోదీ..అబద్దాలు చెప్పిందెవరు?.. చైనా పేరెత్తని ప్రధాని.. స్థానికుల మాటిది.. రాహుల్ ఫైర్

సీరియస్ వార్నింగ్..

సీరియస్ వార్నింగ్..


కరోనా వైరస్ వ్యాప్తిని ముందే పసిగట్టిన కిమ్ జాంగ్.. జనవరి 30 నుంచే దేశవ్యాప్త లాక్ డౌన్ విధించారు. శుక్రవారం నాటి పొటిట్ బ్యూరో మీటింగ్ లో.. గడిచిన ఆరు నెలలుగా దేశవ్యాప్తంగా చేపట్టిన కరోనా నియంత్రణ చర్యలను కిమ్ రివ్యూ చేశారు. మొత్తానికి మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. కరోనాపై పోరులో పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుల పాత్రను ఆయన ప్రశంసించారు. అదే సమయంలో కొన్ని సీరియస్ హెచ్చరికలు సైతం జారీచేశారు. ‘‘పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చిందికదాని రిలాక్స్ అయిపోవద్దు. మనం జాగ్రత్తగా లేకపోతే భయానక విలయాన్ని చవిచూడాల్సి ఉంటుంది''అని కిమ్ వ్యాఖ్యానించినట్లు కేసీఎన్ఏ తెలిపింది.

స్కూళ్లు తప్ప మిగతావి బంద్..

స్కూళ్లు తప్ప మిగతావి బంద్..

అసలు ఉత్తరకొరియాలో కరోనా కేసులు ఎన్ని నమోదయ్యాయో, అక్కడ వ్యాప్తి చెందిన వైరస్ ఎలాంటి రకమో, ఎంత మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు.. అనే వివరాలేవీ వెల్లడికాలేదు. అయితే ప్రస్తుతానికి మాత్రం దేశంలో ప్రశాంత వాతావరణం నెలకొందని అధికారిక మీడియా పేర్కొంది. అందుకు తగ్గట్టే నార్త వ్యవహారాల పరిశీలకులు సైతం కీలక ప్రకటనలు చేశారు. ప్యోంగ్యాంగ్ లో అసాధారణ పరిస్థులులేవీ లేవని, జులై 1 నుంచి దేశవ్యాప్తంగా స్కూళ్లు రీ ఓపెన్ అయ్యాయని, స్కూల్స్ తప్ప మిగతా పబ్లిక్ ప్రదేశాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయని, మాస్కుల వాడకాన్ని ముందునుంచే తప్పనిసరి చేశారని పరిశీలకులు తెలిపారు.

కిమ్ చెప్పింది నిజమేనా?

కిమ్ చెప్పింది నిజమేనా?

కరోనా పుట్టిన చైనాతో, దాని తర్వాత బాగా ఎఫెక్టయిన సౌత్ కొరియాతో సుదీర్ఘ సరిహద్దును పంచుకునే ఉత్తర కొరియాలో వైరస్ కేసులకు సంబంధించిన అధికారిక సమాచారమేదీ ప్రపంచానికి అందుబాటులోలేదు. కిమ్ మీడియా ఏది చెబితే అది మాత్రమే ప్రచురించుకోవాల్సిన పరిస్థితి. నార్త్ కొరియాలో జనవరి 30 నుంచీ ఎమర్జెన్సీ కొనసాగుతుండటం, తొలినాళ్లలోనే పెద్ద సంఖ్యలో అనుమానితులను క్వారంటైన్ కు పంపడం లాంటి చర్యల కారణంగా కిమ్ నిజంగానే కరోనాను కట్టిచేసి ఉండొచ్చని నార్త్ పరిశీలకులు పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు కేవలం 12 మంది ఫిరాయింపుదారులు మాత్రమే నార్త్ నుంచి సౌత్ లోకి ప్రవేశించడాన్ని బట్టి సరిహద్దుల్లోనూ అప్రమత్తత కొనసాగుతోందని అర్థం చేసుకోవచ్చని తెలిపారు.

English summary
North Korean leader Kim Jong-un has hailed his country's "shining success" in dealing with Covid-19, according to state news agency KCNA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X