వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ వర్కర్ల పాలిట శాపంగా మారిన కరోనా: థాయ్‌లాండ్‌లో రోడ్డునపడ్డ 3 లక్షల మంది, తిండికి తిప్పలు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ సెక్స్ వర్కర్ల జీవితాలపై పెను ప్రభావం చూపుతోంది. ఎక్కడికక్కడ లాక్ డౌన్ అమలు చేయడంతో రెడ్ లైట్ ఏరియాలు బోసిపోతున్నాయి. విటులు లేక సెక్స్ వర్కర్లు గోళ్లు గిల్లుకుంటున్నారు. థాయ్‌లాండ్ అంటేనే విహారానికి కేరాఫ్ అడ్రస్. బ్యాంకాక్ వీధుల్లో టూరిస్టులతో కళకళలాడేవి. కానీ పరిస్థితి మారింది. జనం లేక రహదారులు వెలవెలబోతున్నాయి.

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు..

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు..

బ్యాంకాక్‌లోని రెడ్ లైట్ ఏరియా.. పొట్టయా లాంటి జిల్లాల్లో జనసంచారం లేదు. పబ్బులు, క్లబ్బులు, నైట్ క్లబ్బులు కూడా క్లోజ్ చేడంతో.. వేశ్యలా పరిస్థితి దారుణంగా మారిపోయింది. లాక్ డౌన్ కారణంగా విటులు రాకపోవడంతో బ్యాంకాక్‌లో 3 లక్షల మంది వేశ్యల జీవనం దుర్భరంగా మారింది. తమకు ఉపాధి లేదని.. ఎలా జీవించాలని వారు ప్రశ్నిస్తున్నారు.

కర్ప్యూ..?

కర్ప్యూ..?

విటులు లేక తమ ఉపాధి దెబ్బతిందని సెక్స్ వర్కర్‌గా మారిన ట్రాన్స్ జెండర్ ఒకరు వాపోయారు. తన గది అద్దె ఎలా కట్టాలి..? తానేం తినాలి అని ప్రశ్నించారు. ఉదయం లాక్ డౌన్ కాదు.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు కర్ఫ్యూ విధించడంతో బార్లు, రెస్టారెంట్లు మూసివేస్తున్నారు. దీంతో తమ ఉపాధిపై ప్రభావం చూపిందని సెక్స్ వర్కర్ గోడు వెల్లబోసుకున్నారు. చాలా ప్రాంతాలు మూసివేయడంతో సొంత గ్రామాలకు వెళ్లేందుకు జనం క్యూ కట్టారు. దీంతో పిమ్ సహా ఇతర సెక్స్ వర్కర్లు ఉపాధి లేక గోడు వెల్లబోసుకుంటున్నారు.

10 రోజుల నుంచి లేక..

10 రోజుల నుంచి లేక..

తనకు 10 రోజుల నుంచి కస్టమర్ల లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నానని పిమ్ పేర్కొన్నారు. ఆమె స్నేహితురాలు ఆలిస్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇదివరకు వారానికి 300 డాలర్ల నుంచి 600 డాలర్లు సంపాదించేదానని.. కానీ ఇప్పుడు వ్యాపారం మొత్తం దెబ్బతిందని పేర్కొన్నారు. వాస్తవానికి తాము పేదరికం నుంచి రావడంతోనే వ్యభిచార వృత్తిని ఎంచుకున్నామని పేర్కొన్నారు. కానీ తమ వద్ద కనీస నగదు లేకపోవడంతో ఉన్న ఇంటి నుంచి ఓనర్లు గెంటేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

రాత్రి 10 తర్వాత కర్ప్యూ..

రాత్రి 10 తర్వాత కర్ప్యూ..

కొన్ని వారాల క్రితం థాయ్‌లాండ్‌కు వచ్చామని మరికొందరు చెబుతున్నారు. గ్రాడ్యుయేషన్ చేసిన పని లేక.. పడుపువృత్తిలో దిగామని తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ విధించడంతో సెక్స్ వర్కర్ల జీవితం దుర్భంగా మారింది.

24 గంటల కర్ఫ్యూ..?

24 గంటల కర్ఫ్యూ..?

థాయ్‌లాండ్‌లో వైరస్ కేసులు పెరుగుతుండటంతో 24 గంటల కర్ప్యూ కూడా విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 2 వేల మందికి వైరస్ సోకగా.. 20 మంది చనిపోవడంతో వ్యాధి నివారణపై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సెక్స్ రాకెట్ల ద్వారా వైరస్ వ్యాపిస్తోందని ఉద్దేశంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నది.

English summary
shutdown to contain the coronavirus has killed Thailand's party scene and forced sex workers like Pim out of bars and onto desolate streets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X