హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ : పెరిగిన సెక్స్ బూమ్.. ఇవిగో రిపోర్ట్స్..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా చాలా దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. దీంతో చాలావరకు కంపెనీలు మూతపడ్డాయి. ప్రజలకు నిత్యావసరాలు,అత్యవసర సేవలు అందించే కంపెనీలు తప్పితే మిగతావన్నీ మూతపడ్డాయి. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌తో నెట్టుకొస్తున్నాయి. పరిశ్రమలన్నీ మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా చాలావరకు ఉత్పత్తులు నిలిచిపోయాయి. చాలా కంపెనీలు కోట్ల నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి నెలకొంది. అయితే వీటికి అతీతంగా ఒక్క సెక్స్ ఇండస్ట్రీ సేల్స్ మాత్రం మంచి బూమ్‌లో దూసుకెళ్తున్నాయి.

సెక్స్ టాయ్స్,వయాగ్రా అమ్మకాల్లో పెరుగుదల

సెక్స్ టాయ్స్,వయాగ్రా అమ్మకాల్లో పెరుగుదల

స్వీడన్‌కు చెందిన లగ్జరీ సెక్స్ టాయ్ బ్రాండ్ లెలో తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఆ సంస్థ ఉత్పత్తులు సాధారణ రోజుల్లో కంటే 40శాతం పెరిగాయి. అన్ సమ్మర్స్ అనే సెక్స్ టాయ్స్&లింగరీ రిటైలర్ .. గతేడాదితో పోల్చితే తమ అమ్మకాల్లో 27శాతం పెరుగుదల నమోదైనట్టు వెల్లడించింది. అంతేకాదు,కండోమ్స్ విక్రయాలు రెట్టింపు అయినట్టు తెలిపింది. ఈకామర్స్ ఫార్మా సంస్థ యూకె మెడ్స్.. తమ సంస్థ నుంచి 23శాతం వయాగ్రా విక్రయాలు పెరిగినట్టు తెలిపింది.

యాక్టివ్ సెక్స్‌లో దంపతులు

యాక్టివ్ సెక్స్‌లో దంపతులు

లాక్ డౌన్ కారణంగా ఎక్కడికీ ప్రయాణించే అవకాశం లేకపోవడం.. పనిలేకుండా ఇంట్లోనే ఉండటంతో.. చాలామంది దంపతులు శృంగారంలో యాక్టివ్‌గా పాల్గొంటున్నారని అమెరికాకు చెందిన కిన్సే ఇనిస్టిట్యూట్ సీనియర్ అధ్యయనకారుడు హెలెన్ ఫిషర్ తెలిపారు. ఇక్కడి ఇనిస్టిట్యూట్‌లో శృంగారం,లింగం,ప్రత్యుత్పత్తి వంటి అంశాలపై నిరంతరం అధ్యయనం చేస్తుంటారు. నిజానికి ఇలాంటి కఠిన సమయాల్లో శృంగారం మంచిదేనని ఆయన చెప్పారు. శృంగారం వల్ల డోపమైన్ విడుదలవడం అనుభూతికి గురిచేస్తుందన్నారు. స్త్రీ పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరగడం వల్ల ఇరువురిలోనూ మరిన్ని కోరికలు కలుగుతాయని చెప్పారు. సమయం దొరికింది కాబట్టి శృంగారంలో పాల్గొంటున్నారని చెప్పడం కాదు కానీ.. ఆరోగ్యానికి కూడా ఇది మంచిదని అభిప్రాయపడ్డారు.

పెరిగిన డేటింగ్ సైట్స్ ట్రాఫిక్

పెరిగిన డేటింగ్ సైట్స్ ట్రాఫిక్

ఇక లాక్ డౌన్ కారణంగా ఇంట్లో సంతోషంగా గడపలేకపోతున్నవారు.. ఇంటర్నెట్‌లో ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్టు తేలింది. కొంతమంది వివాహేతర సంబంధాల కోసం Illicit Encounters లాంటి డేటింగ్ వెబ్‌సైట్స్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీంతో గతేడాది ఇదే సమయం కంటే ప్రస్తుతం 15శాతం ట్రాఫిక్ పెరిగినట్టు ఆ సైట్ యాజమాన్యం వెల్లడించింది. గత నాలుగు వారాల్లో 54శాతం మంది పురుషులు ఈ సైట్ ద్వారా కొత్త సంబంధాలను వెతుకున్నట్టు తెలిపింది. ఇందులో 74శాతం మంది ఇంట్లో బోర్‌గా ఫీల్ అవడం వల్లే ఈ డేటింగ్ సైట్‌కువస్తున్నారని వెల్లడించింది.

ఇదొక ఓదార్పు లాంటిదేనట..

ఇదొక ఓదార్పు లాంటిదేనట..

యూకెలో సాధారణ రోజులతో పోల్చితే టిండర్ యాప్‌లో డైలీ కన్వర్సేషన్స్ 12శాతం పెరిగాయి. ఇది ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో సగటున ఎనిమిది శాతం కంటే ఎక్కువ. యూకె కంటే రెండు,మూడు వారాలు ముందే వైరస్ వ్యాప్తి చెందిన ఇటలీలో టిండర్ యాప్ కన్వర్సేషన్స్ 29శాతం పెరిగాయి. కరోనా కష్ట కాలంలో ఇలాంటి డేటింగ్ వెబ్ సైట్స్‌తో ఇతరులకు కనెక్ట్ అవడం ద్వారా కొంతమంది స్వీయ ఓదార్పు పొందుతున్నారని రిలేషన్‌షిప్ కౌన్సిలర్ ముర్రే బ్లాకెట్ తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి తమను తాము మరల్చుకునేందుకు కూూడా ఇది ఉపయోగపడుతున్నట్టు చెప్పారు.

English summary
Lelo, a Swedish luxury sex toy brand, says it has seen sales increase by 40 percent. Ann Summers, a sex toy and lingerie retailer, has seen a 27 percent increase in sales of sex toys compared to this time last year, and condom sales have doubled in the space of just a week. UK Meds, an online pharmacy based in Nottingham, reported a spike in Viagra sales and a 23 percent increase in orders of the morning-after pill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X