వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కావాలనే కరోనా సృష్టి: వుహాన్ ల్యాబ్‌లో తయారీ: వైరస్ పుట్టుకపై చైనా వైరాలజిస్ట్ కుండబద్దలు

|
Google Oneindia TeluguNews

హాంకాంగ్: ప్రపంచాన్ని కబలించి పారేస్తోన్న కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన అంశాలు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. చైనాలోని వుహాన్ ల్యాబొరేటరీలో ఉద్దేశపూరకంగా ఈ వైరస్‌ను సృష్టించారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని వెల్లడించిందెవరో కాదు.. చైనాకు చెందిన ఓ వైరాలజిస్ట్. ఆమె పేరు డాక్టర్ లీ-మెంగ్ యాన్. వుహాన్‌లో ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తోన్న ఓ ల్యాబొరేటరీలో ఈ వైరస్‌ పుట్టుకొచ్చిందని, దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయనీ వెల్లడించారు. మొట్టమొదటి సారిగా కరోనా వైరస్ వుహాన్‌ నుంచే వ్యాప్తిలోకి వచ్చిన విషయం తెలిసిందే.

భారత్‌పై చైనా హైబ్రిడ్ యుద్ధం?: ప్రధాని, సీజేఐ, ముఖ్యమంత్రులు: 10 వేలమంది శక్తిమంతుల డేటాభారత్‌పై చైనా హైబ్రిడ్ యుద్ధం?: ప్రధాని, సీజేఐ, ముఖ్యమంత్రులు: 10 వేలమంది శక్తిమంతుల డేటా

 ఆధారాలున్నాయ్..

ఆధారాలున్నాయ్..

డాక్టర్ లీ-మెంగ్ యాన్.. హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పూర్వ విద్యార్థిని. వైరాలజీ అండ్ ఇమ్యునాలజీలో ఆమె స్పెషలైజేషన్‌ను సాధించారు. భద్రతా కారణాల వల్ల ఆమె బలవంతంగా హాంకాంగ్‌ను వీడాల్సి వచ్చింది. హాంకాంగ్‌కు గుడ్‌బై చెప్పిన తరువాత అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడే నివసిస్తున్నారు. తాజాగా ఆమె `లూస్ విమెన్` అనే ఓ బ్రిటీష్ టీవీ టాక్‌షోలో పాల్గొన్నారు. చైనా బండారాన్ని బయట పెట్టారు. కరోనా వైరస్ వూహాన్‌లోని ల్యాబొరేటరీలో తయారైందనడానికి తన వద్ద శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు.

న్యూ న్యమోనియాపై..

న్యూ న్యమోనియాపై..

డిసెంబర్-జనవరి మధ్యకాలంలో తాను న్యూ న్యుమోనియా అనే అంశంపై రెండుసార్లు పరిశోధనలను కొనసాగించానని, దాని ఫలితాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తోన్న తనపై అధికారికి పంపించానని తెలిపారు. దీని ఫలితాలు వెల్లడవుతాయని తాను ఆశించినప్పటికీ.. అలా జరగలేదని అన్నారు. ఈ రీసెర్చ్ ఫలితాలపై పెదవి విప్పొద్దని, దాన్ని బయటపెడితే.. అంతం చేస్తారని తనపై అధికారి వెల్లడించినట్లు లీ-మెంగ్ తెలిపారు. ప్రభుత్వానికి భయపడి పరిశోధకులెవరూ దీనిపై మాట్లాడటానికి ఆసక్తి చూపలేదని అన్నారు.

ఇలాంటి పరిస్థితులొస్తాయని ముందే గ్రహించా..

ఇలాంటి పరిస్థితులొస్తాయని ముందే గ్రహించా..

కరోనా వైరస్ వల్ల ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందనే విషయాన్ని తాను ముందే గ్రహించానని ఆమె తెలిపారు. అమెరికాలోని ఓ చైనా యూట్యూబర్ ద్వారా ఈ ఏడాది జనవరి 17వ తేదీన తాను వైరస్ వల్ల తలెత్తే ప్రమాదంపై కొన్ని వివరాలను వెల్లడించినట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్ చైనాలో వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ పెద్దగా నివారణ చర్యలు తీసుకోలేదని అన్నారు.

Recommended Video

COVID-19:కరోనా ను పుట్టించింది చైనా నే.. గుట్టు బయటపెడితే చంపేస్తాం అన్నారు! -Virologist Dr. Li-Meng
వుహాన్ ఫిష్ మార్కెట్.. కట్టుకథ

వుహాన్ ఫిష్ మార్కెట్.. కట్టుకథ

వూహాన్‌లోని ఫిష్ మార్కెట్ నుంచి వైరస్ పుట్టుకొచ్చిందనడం పూర్తిగా అవాస్తవమని లీ-మెంగ్ తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలతో వైరస్ ల్యాబ్ నుంచే వచ్చిందని చెప్పడానికి ప్రయత్నించానని, చైనా ప్రభుత్వం తనను బెదిరించినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం తనను ఏం చేస్తుందోననే భయాందోళనలతో హాంకాంగ్‌ను వీడానని అన్నారు. కరోనా వైరస్‌ను వుహాన్‌ ల్యాబులోనే తయారుచేశారని, ఈ విషయాన్ని చైనా దాచిపెడుతోందనడంలో సందేహాలు అక్కర్లేదని తేల్చి చెప్పారు. వైరస్ ఎంత ప్రమాదకారి అనేది అక్కడి ప్రభుత్వానికి ముందే ఓ అంచనా ఉందనీ అన్నారు.

English summary
hinese virologist Dr Li-Meng Yan has claimed that the novel coronavirus was made in a government controlled laboratory in Wuhan and asserted that she has scientific proof to back the claim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X