వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా మరో ఎండెమిక్ వైరస్.. హెచ్ఐవి లాగే.. కమ్యూనిటీలో తిష్ట వేయవచ్చు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌ను పూర్తిగా నిర్మూలించడం అసాధ్యమని.. దానితో కలిసి జీవించాల్సిందేనని దాదాపుగా చాలా దేశాలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాయి. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ఏళ్లు పట్టే అవకాశం ఉండటంతో కరోనాను ఎదుర్కోవడమే తప్ప.. దాని నుంచి తప్పించుకోలేమని భావిస్తున్నాయి. ఒకవేళ సుదీర్ఘ కాలం పాటు కరోనాకు వ్యాక్సిన్ రాకపోతే.. అది కూడా హెచ్ఐవి/ఎయిడ్స్ తరహాలో మరో ఎండెమిక్(స్థానిక వైరస్) వైరస్‌గా మారే అవకాశం ఉందని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) పేర్కొనడం గమనార్హం.

Recommended Video

WHO Map Shows Ladakh's Aksai Chin As Part Of China

వివాదాల విశాఖ సహా : కరోనా దెబ్బకు భూములను అమ్ముకుంటోన్న జగన్ సర్కార్: వారికి మళ్లీ ఛాన్స్వివాదాల విశాఖ సహా : కరోనా దెబ్బకు భూములను అమ్ముకుంటోన్న జగన్ సర్కార్: వారికి మళ్లీ ఛాన్స్

కమ్యూనిటీలో తిష్టవేసే ఛాన్స్..

కమ్యూనిటీలో తిష్టవేసే ఛాన్స్..

డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి మైకెల్ ర్యాన్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ మరో ఎండెమిక్‌ వైరస్‌గా మారే అవకాశం ఉందన్నారు. కమ్యూనిటీలో అదో స్థానిక వైరస్‌గా తిష్ట వేసుకోవచ్చునని.. ఎప్పటికీ అది వదలకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. ఒకరకంగా చెప్పాలంటే హెచ్ఐవి/ఎయిడ్స్ లాగే కరోనా వైరస్ కూడా ఎప్పటికీ మానవ సమాజాన్ని వదలకపోవచ్చునని చెప్పారు.

హెచ్ఐవి లాగే సుదీర్ఘ కాలం..

హెచ్ఐవి లాగే సుదీర్ఘ కాలం..

'హెచ్ఐవి ఎప్పటికీ మానవ సమాజాన్ని విడిచిపెట్టదు. కానీ దాన్ని ఎదుర్కొని ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేందుకు కొన్ని చికిత్స పద్దతులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా మనం వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలి. కరోనా వైరస్ ఎప్పుడు అంతమవుతుందో తెలియదు. ఒకవేళ అత్యంత ప్రభావవంతమైన వ్యాక్సిన్‌ని తయారుచేయగలిగి.. ప్రపంచంలోని ప్రతీ ఒక్కరికీ దాన్ని అందజేయగలిగితేనే ఈ వైరస్‌ను నిర్మూలించగలం.' అని మైకెల్ ర్యాన్ తెలిపారు.

లాక్ డౌన్‌ను ఎత్తివేయడంపై వార్నింగ్..

లాక్ డౌన్‌ను ఎత్తివేయడంపై వార్నింగ్..

ఒక కొత్త వైరస్ ఇప్పుడు మానవ జనాభాలోకి ప్రవేశిస్తోందని.. దానిపై ఎప్పుడు విజయం సాధిస్తామన్నది కచ్చితంగా చెప్పలేమని ర్యాన్ అన్నారు. ఇక కరోనాతో జీవించడం తప్పదని భావించిన చాలా దేశాలు లాక్ డౌన్‌ను ఎత్తివేసే పనికి పూనుకోవడంపై ర్యాన్ స్పందించారు. లాక్ డౌన్‌ను సడలించినంత మాత్రానా కరోనా రెండో వేవ్ రాకుండా ఉండదని హెచ్చరించారు. చాలా దేశాలు లాక్ డౌన్ నుంచి బయటకు రావాలని భావిస్తున్నాయని.. కానీ ఏ దేశంలోనైనా సాధ్యమైనంత ఎక్కువ స్థాయి అప్రమత్తత అవసరమని సూచించారు.

సాధారణ స్థితికి చేరుకోవాలంటే చాలా దూరం..

సాధారణ స్థితికి చేరుకోవాలంటే చాలా దూరం..

కరోనా నుంచి పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందన్నారు. లాక్ డౌన్‌ సంపూర్ణంగా పనిచేస్తుందని.. ఇక దాన్ని ఎత్తేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే భ్రమలు ప్రమాదంలోకి నెట్టేసే అవకాశం ఉందన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో హెల్త్ కేర్ సిబ్బందిపై దాడులను ఆయన ఖండించారు. అలాంటి దాడులు,వివక్ష అర్థం లేనివన్నారు. కష్ట కాలంలో సాయం చేస్తున్నవారిపై దాడులు చేయడం సరికాదన్నారు.

English summary
Coronavirus may never go away and populations around the world will have to learn to live with it, the World Health Organization (WHO) warned Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X