• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా వైరస్ ను జయించిన వియాత్నాం ? బాధితులకు కోవిడ్ 19 నుండి ఉపశమనం

|

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న సమయంలో, వియాత్నాం దేశంలో మాత్రం కరోనా అద్భుతం సృష్టించింది .మొత్తం 16 మంది కరోనా వైరస్ సోకిన రోగులను నయం చేసి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్లు వియత్నాం ప్రకటించింది. బుధవారం నాటికి, మొత్తం 16 మంది రోగులను డిశ్చార్జ్ చేసిన వియాత్నాం ఆరోగ్య శాఖ వారిలో 73 ఏళ్ళ వయసులో ఉన్న వృద్ధులకు కూడా నయమై ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది.

  3 Minutes 10 Headlines | Nara Brahmani To Enter Active Politics | YSRCP MLA Deadline To YS Jagan
  కరోనాతో యుద్ధంలో మొదటి రౌండ్ లోనే గెలిచామన్న వియాత్నాం

  కరోనాతో యుద్ధంలో మొదటి రౌండ్ లోనే గెలిచామన్న వియాత్నాం

  వియాత్నాం లో అద్భుతం జరిగింది. కరోనా సోకినా వారికి నయం అయ్యింది .గత 15 రోజులుగా కొత్త కరోనా వైరస్ సోకిన కేసులను కూడా ప్రభుత్వం గుర్తించలేదు. చివరి కరోనా వైరస్ కేసు ఫిబ్రవరి 13 న నమోడైనాటు ప్రకటించింది. హనోయికి ఉత్తరాన ఉన్న ఒక గ్రామం 20 రోజుల పాటు నిర్బంధంగా ఉన్న పరిస్థితి ఉందని చెప్పారు. నగర మరియు ప్రాంతీయ అధికారులతో ఆన్‌లైన్ సమావేశంలో మాట్లాడిన వియత్నాం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉప ప్రధాన మంత్రి వు డక్ డ్యామ్ను కోవిడ్-19 తో పోరాడటం ఒక యుద్ధమైతే, మేము మొదటి రౌండ్లో గెలిచాము కాని మొత్తం యుద్ధంలో మాత్రం కాదని ఆయన పేర్కొన్నారు.

  ప్రభుత్వం వేగంగా స్పందించడం ప్రారంభ దశలో సంక్షోభ నివారణకు కారణం

  ప్రభుత్వం వేగంగా స్పందించడం ప్రారంభ దశలో సంక్షోభ నివారణకు కారణం

  ఎందుకంటె పరిస్థితి చాలా ఊహకందని విధంగా ఉంది అని పేర్కొన్నారు వియత్నాం ఆరోగ్య మంత్రి . ప్రపంచవ్యాప్తంగా, వ్యాప్తి ఇప్పటికే దాదాపు 3,000 మంది ప్రాణాలు తీసింది . మరియు శనివారం నాటికి 83,000 మందికి పైగా సోకింది. కానీ వియాత్నాంలో పరిస్థితి వేరేలా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధికారులు, ఆరోగ్య నిపుణులు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులపై ప్రభుత్వం వేగంగా స్పందించడం ప్రారంభ దశలో సంక్షోభాన్ని నివారించడంలో కీలకమని అన్నారు. ఇక అందులో వియాత్నాం సక్సెస్ అయినట్టు చెప్పొచ్చు .

  వైరస్ సోకిన వారికి నయం .. ప్రభుత్వ ముందస్తు చర్యలే కారణం

  వైరస్ సోకిన వారికి నయం .. ప్రభుత్వ ముందస్తు చర్యలే కారణం

  వైరస్ సోకిన 16 వ మరియు చివరి రోగిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్లు వియత్నాం ప్రభుత్వం ప్రకటించింది.వియత్నాంలో డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి డాక్టర్ కిడాంగ్ పార్క్, ప్రభుత్వం "ప్రతిస్పందన , చురుకుగా వ్యవహరించటం మరియు స్థిరత్వం" విజయానికి కారణమని పేర్కొంది.ఇద్దరు చైనా పౌరులు హో చి మిన్ సిటీలో జనవరి 23 న కరోనా వైరస్ బారిన పడ్డారు. ఫిబ్రవరి 1 న వియత్నాం కరోనావైరస్ ప్రబలుతుంది అన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించింది, దేశంలో కేసుల సంఖ్య ఆరుకు పెరిగింది.

  కరోనాను జయించిన వియాత్నాంc

  కరోనాను జయించిన వియాత్నాంc

  ఫిబ్రవరి 13 న, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోన్ లోయి యొక్క 10,600 మంది నివాసితులను 20 రోజుల పాటు నిర్బంధంలో ఉంచాలని ఆదేశించారు. మరిన్ని కేసులు నిర్ధారించబడిన తరువాత వ్యాప్తి ప్రారంభ దశలో దేశం పర్యవేక్షణ వ్యవస్థను కట్టుదిట్టం చేసింది . నిఘా తీవ్రతరం చేయడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలను మెరుగుపరచడం, సంక్రమణ నివారణ మరియు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో నియంత్రణ మరియు కేసు నిర్వహణను నిర్ధారించడం, స్పష్టమైన రిస్క్ కమ్యూనికేషన్ వ్యవస్థతో పాటు అన్ని రంగాల సహకారంతో వియాత్నాం కరోనాను జయించింది.

  English summary
  Amid the rapid spread of the coronavirus out break around the world, Vietnam has announced that all 16 infected patients in the country were discharged from hospital and declared cured. As of Wednesday, all 16 patients, including the oldest who is 73, had been cured and discharged from the hospital.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X