వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: రెక్కలు చాచిన కరోనా: అమెరికా, అరబ్ ఎమిరేట్స్ సహా 13 దేశాలకు ప్రాణాంతక వైరస్..!

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: చైనాను అల్లకల్లోలానికి గురి చేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్. రెక్కలు చాచింది. తన పరిధిని విస్తరించుకుంది. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి.. క్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఖండాంతరాలను దాటుకుంటోంది. ఇప్పటికే 13 దేశాల్లో కరోనా వైరస్ కేసులు కనిపించాయి. మరి కొన్ని దేశాల్లో దీనికి సంబంధించిన జాడలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తర అమెరికా మొదలుకుని ఆసియా వరకూ కరోనా వైరస్ కేసులు నమోదువుతున్నాయి.

గవర్నర్ Vs ముఖ్యమంత్రి: సీఎం చదవమంటేనే చదువుతున్నా: దానితో సంబంధం లేదంటూ..!గవర్నర్ Vs ముఖ్యమంత్రి: సీఎం చదవమంటేనే చదువుతున్నా: దానితో సంబంధం లేదంటూ..!

వుహాన్ సిటీలో 3,554 కేసులు..

వుహాన్ సిటీలో 3,554 కేసులు..

కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తోన్న వుహాన్ సిటీలో ఇప్పటిదాకా 3,554 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. పదుల సంఖ్యలో స్థానికులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారికి కూడా కరోనా వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. వాటిని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. చైనాకు పొరుగునే ఉన్న దక్షిణ కొరియా-4, జపాన్-7, థాయ్‌లాండ్-14, వియత్నాం-2, కాంబోడియా-1, మలేసియా-7, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-2, శ్రీలంక-1, సింగపూర్-7, ఆస్ట్రేలియా-5, జర్మనీ-4, ఫ్రాన్స్-4, అమెరికా-5, కెనడాలో ఒక కేసులు నమోదయ్యాయి.

అమెరికాలో అయిదు కేసులు..

అమెరికాలో అయిదు కేసులు..

అమెరికాలో వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయిస్‌లల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా కేసు నమోదు కాగా.. కాలిఫోర్నియాలో ఇద్దరిలో ఈ వైరస్ లక్షణాలను గుర్తించారు. కరోనా వైరస్‌ విస్తరణను అడ్డుకోవడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినప్పటికీ.. అవి పెద్దగా ఫలితాలనివ్వట్లేదని అంటున్నారు. కరోనా వైరస్ లక్షణాలు గల ప్రయాణికులను గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు.

చైనాలో 130కి చేరిన మృతుల సంఖ్య..

చైనాలో 130కి చేరిన మృతుల సంఖ్య..

ఇదిలావుండగా.. చైనాలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే వస్తోంది. ఆరంభంలో 52 మంది మరణించారు. క్రమంగా ఈ సంఖ్య 130కి చేరుకుంది. ఈ వైరస్ బారిన పడిన పలువురి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. కరోనా వైరస్‌ రూపుమాపడానికి అవసరమైన మందులు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. దీనికి అవసరమైన మందుల కోసం చైనా వైద్య ఆరోగ్య రంగానికి చెందిన నిపుణులు పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

English summary
The disease has been detected in at least 13 other countries, almost all involving people who traveled from China. Five cases have been confirmed in the United States: a woman in her 60s in Chicago, a man in his 30s in Washington state, two people in southern California, and one person in Arizona.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X