వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: చైనాతో చెక్క భజన, విదేశాంగ మంత్రికి కట్నకానుకలు ఇచ్చిన కరోనా, అయ్యో పాపం !

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: చైనా ఆడబిడ్డ కరోనా వైరస్ కు (COVID 19) తనామనా అనేతేడా లేకుండా పోయింది. ప్రతినిత్యం భారత్ మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉత్తర కుమారుడిలా ప్రగల్పాలు పలుకుతున్న దాయాది దేశం పాకిస్థాన్ విదేశాంగ మంత్రిని చూసి అయ్యో పాపం అనాలో ? లేక సరైన శాస్తి జరిగింది ? అనాలో మన భారతీయులకు అర్థం కావడం లేదు. చైనా ఆడబిడ్డ కరోనా పాక్ విదేశాంగ మంత్రికి కట్నకానుకలు సమర్పించుకుంది. చైనాను చూసి మిడిమిడి పాటుపడిన పాకిస్థాన్ లో కరోనా వైరస్ బారిన పడుతున్న రాజకీయ ప్రముఖుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆదేశంలోని మంత్రులు ఇంటి నుంచి బయటకు రావాలంటే గజగజ వణికిపోతున్నారు.

Lockdown murder: భర్తకు దిక్కులేని ఆస్తి, భార్యకు ఫేస్ బుక్ ప్రియులు, సినిమా స్కెచ్, హైవేలో ఫినిష్Lockdown murder: భర్తకు దిక్కులేని ఆస్తి, భార్యకు ఫేస్ బుక్ ప్రియులు, సినిమా స్కెచ్, హైవేలో ఫినిష్

 నిద్రలేస్తే ఖురేషికి అదే పని

నిద్రలేస్తే ఖురేషికి అదే పని

పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషికి నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు భారత్ మీద అరోపణలు చెయ్యడమే పనిగా పెట్టుకున్నాడు. భారత్ మీద ఆరోపణలు చెయ్యకపోతే ఎక్కడ తన పదవి పీకేస్తారో ? అనే భయం షా మహమ్మద్ ఖురేషికి పట్టుకుంది. అందుకే ఏదో ఒకరకంగా భారత్ మీద విమర్శలు చేస్తూ వస్తున్న షా మహమ్మద్ ఖురేషి మెళ్లిమెళ్లిగా కాలం వెళ్లదీస్తున్నాడు.

 కట్నకానుకలు ఇచ్చిన కరోనా

కట్నకానుకలు ఇచ్చిన కరోనా

పాకిస్థాన్ లో కరోనా వైరస్ తాండవం చేస్తోంది. అసలే మనోళ్లు (పాకిస్థాన్ ప్రజలు) చెప్పిన మాట బాగా వింటారు కాబట్టి కరోనా విషయంలో అంతంత మాత్రమే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి మీద పగపట్టిన కారోనా వైరస్ ఆయనకు కట్నకానుకలు సమర్పించుకుంది. జ్వరంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న షా మహ్మద్ ఖురేషికి కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్దారించారు.

 కరోనా వచ్చింది మిత్రమా

కరోనా వచ్చింది మిత్రమా

పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేపి తనకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది మిత్రమా, మెరుగైనా చికిత్స అందించండి అంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు సమాచారం ఇచ్చారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి స్థానిక మీడియాకు స్వయంగా చెప్పారు. ఇదే విషయాన్ని షా మహమ్మద్ ఖురేషి ట్వీట్ చేశారు.

 నాపని నాదే, అందులో తేడా లేదు

నాపని నాదే, అందులో తేడా లేదు

తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని, తాను హోమ్ క్వారంటైన్ లో ఉంటానని, ప్రతిరోజు తన దినచర్యలను ఇంటి నుంచి చూసుకుంటానని పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి అన్నారు. కరోనా వచ్చినా భారత్ మీద విమర్శలు చెయ్యడం, చైనాతో కలిసి చెక్క భజన చెయ్యడం మాత్రం మానుకోనని పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేపి పరోక్షంగా చెప్పారు.

 ఏం చేస్తున్నారో ఆదేవుడికే తెలియాలి !

ఏం చేస్తున్నారో ఆదేవుడికే తెలియాలి !

ఇప్పటి వరకు పాక్ మాజీ ప్రధాని, ప్రస్తుత రైల్వేశాఖా మంత్రికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. పాకిస్థాన్ లో ఇప్పటి వరకు 2, 51, 896 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. పాకిస్థాన్ లో కరోనా వైరస్ వ్యాధికి 4, 451 మంది మరణించారు. పాకిస్థాన్ లో ప్రతిరోజు సగటున 4, 000 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూస్తోంది. కరోనా వైరస్ కట్టడి కోసం పాకిస్థాన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఆ దేవుడికే తెలియాలని కుయ్యోమెర్రో అంటున్నారు పాక్ ప్రజలు.

English summary
Coronavirus: Pakistan Foreign Minister Shah Mahmood Qureshi Tests Positive For COVID -19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X