వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాను వాడుకుంటున్న పాక్: హఫీజ్ సయీద్ సహా 50 మంది ఉగ్రవాదుల విడుదల

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు దేశాలు అనేక చర్యలు చేపడుతుంటే.. ఆ మహమ్మారిని సాకుగా చూపి ఉగ్రవాదులను వదిలేసే కార్యక్రామన్ని చేపట్టింది పాకిస్థాన్. జైళ్లలో ఉన్న ఖైదీలకు వైరస్ సోకకూడదనే కారణంతో పాక్ ప్రభుత్వం జైళ్లలో ఉన్న ఖైదీలను వారి ఇళ్లకు పంపేసింది.

Recommended Video

PCB Files Defamation Case On Shoaib Akhtar
హఫీజ్ సయీద్ సహా ఉగ్రవాదుల విడుదల

హఫీజ్ సయీద్ సహా ఉగ్రవాదుల విడుదల

లాహోర్‌లోని ఓ జైళ్లో 50 మంది ఉగ్రవాదులకు కరోనా సోకినట్లుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ తర్వాత ఇదే కారణం చెప్పి ప్రమాదకర ఉగ్రవాదులను కూడా విడుదల చేశారు. లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్ లాంటి ఉగ్రవాదులు కూడా జైళ్ల నుంచి విడుదలైన ఖైదీల్లో ఉండటం గమనార్హం.

పాకిస్థాన్ గ్రే లిస్టు తప్పించుకునేందుకు..

పాకిస్థాన్ గ్రే లిస్టు తప్పించుకునేందుకు..

పాకిస్థాన్ గ్రే లిస్ట్ ముప్పు తప్పాలంటే ఉగ్రవాద కార్యకలాపాల్ని పూర్తిగా నిషేధించాలని ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) గట్టిగా హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలల్లో అక్కడి ప్రభుత్వం చాలా మంది ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసింది. పాకిస్థాన్ ను గ్రే లిస్టులో చేర్చాలా? వద్దా అనే అంశంపై వచ్చే నెలల(జూన్)లో ఎఫ్ఏటీఎఫ్ సమీక్ష నిర్వహించనుంది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదల చర్యలకు పాల్పడుతున్న సుమారు 1800 మంది టెర్రరిస్టులను అధికారిక జాబితా నుంచి ఇటీవల పాకిస్థాన్ తొలగించడం గమనార్హం.

పాక్ ఉగ్రవాదం...

పాక్ ఉగ్రవాదం...

ఇది ఇలావుండగా భారత సరిహద్దులోకి ఉగ్రవాదులను పంపడం, కాల్పులకు తెగపడటం మాత్రం పాకిస్థాన్ ఆపడం లేదు. కాశ్మీర్ సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా కాల్పులకు పాల్పడుతోంది. సాధారణ ప్రజలతోపాటు సైనికుల ప్రాణాలు తీస్తున్నారు పాక్ సైనికులు, ఉగ్రవాదులు. తాజాగా పాక్ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కల్నల్, మేజర్ కూడా ఉన్నారు. కాగా, భారత జవాన్ల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

English summary
Just about all of their operatives, who were in jail as a condition to keep Pakistan out of Financial Action Task Force's (FATF) blacklist, have now walked free in the name of stemming Coronavirus.These terrorists are living and plotting freely from the comfort of their homes, including LeT chief Hafiz Saeed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X