వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుప్పకూలిన కరోనా క్వారంటైన్ భవనం: 10 మంది మృతి

|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనాలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే కరోనావైరస్ బారినపడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా, కరోనా అనుమానితుల్ని వైద్య పర్యవేక్షణలో ఉంచిన క్వారంటైన్ హోటల్ భవనం కుప్పకూలడంతో పది మంది మృతి చెందారు.

మరో 24 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో ఆ భవనంలో సుమారు 70 మందికిపైగా ఉన్నట్లు సమాచారం. క్వాన్ జై నగరంలో శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Coronavirus quarantine hotel collapsed in China: 10 killed

ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మొత్తం 43 మందిని కాపాడామని, 36 మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది మొత్తం కలిపి వెయ్యి మంది వరకు సహాయక చర్యలు పాల్గొన్నారు.

బాధితులంతా కరోనా అనుమానితులు కావడంతో సహాయ సిబ్బంది టోపీలు, మాస్కులు, కళ్లజోడు లాంటివి ధరించి సహాయక చర్యలు చేపట్టారు. క్వారంటైన్ భవనంలో ప్రమాద సమయంలో 58 మంది కరోనా అనుమానితులు ఉన్నారని అధికారులు వెల్లడించారు.

Recommended Video

3 Minutes 10 Headlines | COVID-19 Outbreak In India & Telugu States | Yes Bank Crisis

కాగా, కరోనావైరస్ బారిన పడి ఇప్పటికే చైనాలో 3వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో 50వేల మందికిపైగా కరోనా అనుమానితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనాలో తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తున్న కరోనావైరస్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనా కాకుండా ఇతర దేశాల్లో కరోనా మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటలీలో 200 మందికిపైగా, అమెరికాలో 50 మందికిపైగా కరోనాతో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

English summary
Ten people died after a hotel being used as a coronavirus quarantine center collapsed Saturday night in southeastern China, according to the Ministry of Emergency Management.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X