వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: తుపాకులు కొనుగోలు చేస్తోన్న అమెరికన్లు, గతేడాది కంటే 80 శాతం ఎక్కువ, ఎందుకంటే..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వల్ల అమెరికన్ల మైండ్ సెట్ మారిందేమో తెలియడం లేదు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనివిధంగా వారు తుపాకులు కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగానే అమెరికాలో నల్లజాతీయలు అంటే.. శ్వేత జాతీయులకు పట్టదు. కరోనా వైరస్ వణికిస్తోన్న క్రమంలో తుపాకీలు కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ కారణం అది కాదని.. మరొ రీజన్ ఉంది అని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ చెబుతోంది.

 2.4 మిలియన్లు..

2.4 మిలియన్లు..

మార్చి నెలలో గన్ షాపులను ఎక్కువమంది అమెరికన్లు సందర్శించారు. గతంలో ఎన్నడూ ఇంతమంది తుపాకుల కొనుగోలు కోసం రాలేదని ఎఫ్‌బీఐ పేర్కొన్నది. తుపాకీ కొనుగోలు కోసం దరఖాస్తులు పెరగడంతో 2.4 మిలియన్ల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. గతేడాది మార్చి నెల కన్నా.. ఈ ఏడాది 80 శాతం తుపాకుల కొనుగోలు కోసం ముందుకొచ్చారని పేర్కొన్నది. ఇంత పెద్దమొత్తంలో ప్రజలు రావడంతో మార్చి 16 నుంచి నెలాఖరు వరకు 1.2 మిలియన్ల మంది నేపథ్యాన్ని చెక్ చేశామని వివరించారు.

ఎఫ్‌బీఐ చెక్ చేసి..

ఎఫ్‌బీఐ చెక్ చేసి..

తుపాకీ కోసం దరఖాస్తు చేసుకున్నాక.. ఎఫ్‌బీఐ చెక్ చేసి రిపోర్ట్ ఇచ్చాక గన్ డీలర్లు ఆర్డర్ మేరకు తుపాకులను అందజేస్తారు. ఒకసారి వారి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయడంతో మరిన్ని గన్స్ తీసుకుంటారు. కానీ వారు మొత్తం ఎన్ని కొనుగోలు చేశారనే అంశంపై మాత్రం స్పష్టత ఉండదు. అయితే గతనెలలో ప్రైవేట్ డీలర్ల నుంచి ఎన్ని తుపాకులు కొనుగోలు చేశారనే అంశాన్ని మాత్రం ఎఫ్ ఐ బీ ట్రాక్ చేస్తోంది.

ఫ్యాషన్ కాదు, ఇందుకే

ఫ్యాషన్ కాదు, ఇందుకే

అమెరికాలో తుపాకీ కొనుగోలు చేయడం ఫ్యాషన్ కాదని.. కానీ తమ భద్రత కోసం కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ తెలిపింది. ఆపత్కాలంలో తమతోపాటు కుటుంబసభ్యులు, ప్రేమించేవారిని కాపాడేందుకు తుపాకులు కొనుగోలు చేస్తారని వెల్లడించింది. కరోనా వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో తుపాకులు కొనుగోలు చేస్తున్నారనే అంశాన్ని కొట్టిపారేసింది. అదేం లేదని.. వ్యక్తిగత భద్రత కోసమేనని పేర్కొన్నది.

English summary
People in the United States have responded to the coronavirus pandemic by inundating gun stores, according to new government data on the number of background checks conducted in March.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X