వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus:వైరస్‌పై పోరుకు చైనాకు అమెరికా భారీ ఆర్థిక సాయం .. ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : కొన్ని రోజుల క్రితం చైనాతో అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం నడిచింది. కరోనా వైరస్ చైనాను గడగడలాడించడంతో అమెరికా ఓ మెట్టుదిగి వచ్చింది. చైనాలో కరోనావైరస్‌ బాధితులను ఆదుకునేందుకు ఆ మహమ్మారిపై పోరు చేసేందుకు అగ్రరాజ్యం డ్రాగన్ కంట్రీకి 100 మిలియన్ అమెరికన్ డాలర్లు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు ఇతర దేశాల్లో కరోనా వైరస్ బారినపడి ఇంకా ఆయా దేశాలను గడగడలాడిస్తున్న వైరస్‌పై పోరుకు అమెరికా తనవంతు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందని ఆ దేశ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపే చెప్పారు. ఇక అమెరికా ప్రభుత్వంతో పాటు తమ దేశంలోని పలు ప్రైవేట్ సంస్థలు కూడా ఈ మహమ్మారిని పారద్రోలేందుకు తమవంతుగా పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడం స్వాగతించదగ్గ విషయమని పాంపే చెప్పారు. ఇది అమెరికా నాయకత్వానికి నిదర్శనమని పునరుద్ఘాటించారు.

చైనాకు సహాయం చేయాలన్న అమెరికా కమిట్‌మెంట్‌ ప్రస్తుతం ఉన్న నిధుల నుంచే కాకుండా ఇతర ఎంఎన్‌సీలు విరాళంగా ఇచ్చే నిధులు కూడా వినియోగిస్తామని మైక్ పాంపే చెప్పారు. ఇక కరోనా వైరస్‌ పోరులో భాగంగా పలు వస్తువులను దిగుమతి చేసుకుంటున్న కంపెనీలకు దిగుమతి సుంకం మినహాయింపు ఇచ్చింది చైనా. అమెరికా నుంచి వచ్చే వస్తువులపై కూడా దిగుమతి సుంకాన్ని ఎత్తివేసింది చైనా ప్రభుత్వం.

Coronavirus:US to assist China and other countries with $100 million fighting Virus

కరోనా వైరస్‌ను ఎదుర్కొని దేశం నుంచి పారద్రోలేందుకు చైనా ప్రభుత్వం అన్ని రకాల మార్గాలను వెతుకుతోంది. ఇందులో భాగంగా మొన్నటి వరకు అగ్రరాజ్యం అమెరికాతో వాణిజ్య యుద్ధం చేసిన చైనా... ఈ కష్ట సమయంలో ఆదేశ సహకారాన్ని కోరింది. కరోనావైరస్ పోరుకు తమ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రకటించడంతో.. అగ్రరాజ్యం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు చైనా తెలిపింది. ఇప్పటికే కరోనావైరస్‌ను గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇదిలా ఉంటే కరోనా వైరస్ వ్యాప్తి మరింతగా జరుగుతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary
The United States stands ready to spend up to $100 million to assist China and other countries impacted by coronavirus, US Secretary of State Mike Pompeo announced on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X