వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus:హ్యుమన్ ట్రయల్స్, సెప్టెంబ‌ర్ నాటికి అందుబాటులోకి వ్యాక్సిన్..? ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాల్లో శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు. వైరస్‌ వ్యాక్సిన్ కోసం గురువారం నుంచి మనుషుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షిస్తామని లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది. ఒకవేళ తమ ప్రయత్నంలో వ్యాక్సిన్ కనుగొనే ప్రక్రియ విజయవంతమైతే శరదృతువు నాటికి టీకా అందుబాటులోకి వస్తుందని వివరించారు. కరోనా వైరస్ సృష్టించిన విలయంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్ష 75వేల మంది చనిపోగా... ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తల ప్రకటన కాస్త ఊరట కలిగిస్తోంది.

Recommended Video

Coronavirus Vaccine Could Be Ready By September
నిధులు మంజూరు..

నిధులు మంజూరు..

వ్యాక్సిన్ కనుగొనేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆక్స్ ఫర్డ్ వర్సిటీకి అండగా ఉంటుందని బ్రిటన్ ఆరోగ్యశాఖ కార్యదర్శి మ్యాట్ హన్‌కాక్ ప్రకటించారు. వ్యాక్సిన్ కనుగొనే క్రమంలో నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ కోసం 20 మిలియన్ల పౌండ్లు, తర్వాత పరివోధన కోసం 22.5 మిలియన్ ఫౌండ్లను ఇంపిరీయల్ కాలేజ్ లండన్‌‌కు అందజేయబోతున్నామని ప్రకటించారు.

5 నెలల్లో ..?

5 నెలల్లో ..?

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనేందుకు 18 నెలల సమయం పడుతోందని నిపుణులు అభిప్రాయపడ్డారు. కానీ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ నేతృత్వంలోని ఆక్స్ ఫర్డ్ పరిశోధకులు మాత్రం సెప్టెంబర్ నాటికి వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతోందని ధీమా వ్యక్తం చేశారు. తమ పరిశోధన విజయవంతమైతై వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని బృందంలోని సభ్యుడు, ఆక్స్ ఫర్ ప్రొఫెసర్ ఆండ్రూ పొలార్డ్ తెలిపారు. కానీ పరిశోధనలో చాలా సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది అని పేర్కొన్నారు.

కోట్లలో వ్యాక్సిన్..

కోట్లలో వ్యాక్సిన్..

ఒకవేళ వ్యాక్సిన్ ప్రయోగం విజయవంతమైతే మాత్రం లక్షలు, కోట్ల సంఖ్యలో ఉత్పత్తి చేయాలని.. కానీ ఇందుకు సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అని చెప్పారు. పెద్దమొత్తంలో వ్యాక్సిన్ తయారు చేయడం అంతా ఈజీ కాదు అని అభిప్రాయపడ్డారు.

ఆ సమయంలోనే...

ఆ సమయంలోనే...

సార్స్, మెర్స్ వైరస్‌పై ఆక్స్ ఫర్డ్ బృందం పరిశోధనలు జరిపినందున.. కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రయోగం కూడా అప్పగించిందని పేర్కొన్నారు. వాస్తవానికి కరోనా వైరస్ ఆవిర్బవించే నాటికే మెర్స్‌పై తమ బృందం పరిశోధన జరుపుతోందని పేర్కొన్నారు. మనుషుల్లో పరీక్షిస్తున్నామని తెలిపారు. కరోనా వైరస్ నుంచి జన్యు సంకేతం జనవరిలో కనుగొనబడిందని.. జన్యు సంకేతానికి తిరిగెళ్లి కొత్త టీకాలను వేగంగా తయారుచేయడం సాధ్యమైందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తిపై స్పష్టమైన హామీ ఇవ్వలేమని తెలిపారు.

క్లినికల్ ట్రయల్స్

క్లినికల్ ట్రయల్స్

టీకాలు ఎంతకాలం పనిచేస్తాయి, ఎంత సమయం రక్షణ ఉంటుందనే అంశం తెలుసుకునేందుకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలని పొలార్డ్ తెలిపారు. ఇదో కొత్త రకం వైరస్ అని, ఇది ఎలా వస్తుందో తెలియనందున వ్యాక్సిన్ కనుగొనే ప్రక్రియ మరింత ఆలస్యమవుతోందని చెప్పారు.

English summary
Human trials of a potential coronavirus vaccine developed at the University of Oxford are to begin on Thursday, health secretary Matt Hancock has announced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X