• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనావైరస్: టిక్‌టాక్ వీడియోలకు, కోవిడ్ వ్యాక్సీన్‌కు ఏమిటి సంబంధం?

By BBC News తెలుగు
|

డాక్టర్ అన్నా బ్లాక్నీ, డాక్టర్ విల్ బడ్

సైన్స్, టిక్‌టాక్ కలిసి సాగుతాయని మీరు ఊహించి ఉండకపోవచ్చు. కానీ, కరోనావైరస్ అనే చీకటి సొరంగానికి మరో చివర వ్యాక్సీన్ అనే వెలుగు కనిపిస్తుండడంతో ఈ రెండూ ముఖ్యమైన భాగస్వాములుగా మారాయి.

అవును, టీకాల అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న శాస్త్రవేత్తలు ఆ టీకాలు ఎంత సురక్షితమో చెప్పడానికి, వాటి గురించి సమాచారం ప్రజలకు అందించడానికి టిక్‌టాక్‌ను సాధనంగా మార్చుకుంటున్నారు.

''వినోదం కోసం ఇక్కడకు రండి.. కానీ, సైన్స్‌కి కట్టుబడండి అనేది టిక్ టాక్ విషయంలో నా వైఖరి’’ అన్నారు రేడియో 1 న్యూస్‌బీట్‌తో మాట్లాడిన డాక్టర్ అన్నా బ్లాక్నీ. అన్నా అమెరికాకు చెందినవారు.

లండన్ ఇంపీరియల్ కాలేజీలో కోవిడ్ వ్యాక్సీన్ అభివృద్ధి చేస్తున్న బృందంలో ఆమె కూడా ఉన్నారు.

అన్నా బ్లాక్నీ

వ్యాక్సీన్ గురించి వివరాలు అందిస్తూ ఆమె టిక్‌టాక్‌లో పెట్టిన వీడియోలతో బాగా పాపులర్ అయ్యారు.

30 ఏళ్ల అన్నాకు ఇప్పుడు టిక్ టాక్‌లో 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె వీడియోలను 28 లక్షల మంది లైక్‌ చేశారు.

'సైన్స్‌ను మరింతగా నమ్మండి’టిక్‌టాక్‌లో మరో సైన్స్ స్టార్ డాక్టర్ విల్ బడ్. లండన్‌లో వివిధ వ్యాక్సీన్ల అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న రీసెర్చ్ డాక్టర్ ఆయన.

టీకాల సమాచారం ప్రజలకు అందించడం.. వారిలోని మీమాంసను తొలగించడమే తన లక్ష్యమని 26 ఏళ్ల విల్ చెప్పారు.

''ఇవన్నీ సరదా వీడియోలు. 50 నుంచి 60 సెకన్ల నిడివి ఉంటాయి.

డాక్టర్ అన్నా బ్లాక్నీ

వీటి ఆధారంగా ప్రజలు టీకాల సమాచారం తెలుసుకోవడంతో పాటు సైన్స్‌ను మరింతగా నమ్మే అవకాశం ఉంటుంది’’ అన్నారు విల్.

2016లో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న విల్ కరోనావైరస్ కారణంగా తొలుత లాక్‌డౌన్ విధించినప్పుడు ఇల్లు కదలలేదు.

కరోనావైరస్ భయం ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు.ప్రజలు తాము తల దూర్చలేని విషయాల గురించి ప్రజలు భయపడుతున్నారనీ ఆయనకు తెలుసు.

''నేను అలాంటివారికి సాయం చేయాలనుకుంటున్నాను. నా నుంచి సమాచారం పొందిన తరువాత టీకా వేయించుకోవాలో వద్దో వారో నిర్ణయించుకుంటారు’’ అంటారు విల్.

ఆక్స్‌ఫర్డ్, ఇంపీరియల్ కోవాక్, జాన్సెన్ వ్యాక్సీన్ ప్రయోగాల కోసం పని చేస్తున్న విల్

టిక్‌టాక్‌లో సమాధానమిచ్చే ప్రశ్నలువిల్, అన్నాలకు ప్రజల నుంచి అనేక రకాల ప్రశ్నలు వస్తుంటాయి.

టీకా ఎంత వేగంగా అందుబాటులోకి వస్తుంది.. టీకా సురక్షితమేనా వంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి.

''వ్యాక్సీన్ ఎలా పనిచేస్తుంది.. మందులతోపోల్చితే వ్యాక్సీన్ ఎంతవేగంగా పనిచేస్తుంది.. వేర్వేరు వ్యాక్సీన్ల మధ్య వ్యత్యాసం వంటివి వివరిస్తాం’’ అన్నారు విల్.

ఇదంతా పోకడల గురించేసంక్లిష్టమైన శాస్త్రీయ సమాచారాన్ని చిన్న వీడియోలో ఉంచడానికి ప్రయత్నించడం సవాలే. అయినా, విల్ , అన్నాలు ఎలా చేస్తున్నారు?'

'టిక్‌టాక్ ట్రెండ్స్ అనుసరించి టీకా లేదా సైన్స్ థీమ్‌తో ప్రయత్నిస్తాం’’ అని అన్నా చెప్పారు.

విల్ చేసిన వీడియోల్లో డ్యాన్స్ చేస్తూ టీకా గురించి వివరించింది ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకుంది.

సింగర్ డాలీ పార్టన్ వ్యాక్సీన్ రీసెర్చ్ కోసం విరాళం ఇచ్చిన తరువాత ఆమెతో కలిసి అన్నా చేసిన వీడియో‌కు భారీగా వ్యూస్ వచ్చాయి.

విల్ తన వీడియోల్లో ఒకట్రెండు ముఖ్యాంశాలు చెబుతారు. గ్రాఫ్ కానీ న్యూస్ స్టోరీ కానీ బ్యాక్‌గ్రౌండ్‌గా వాడుతూ తాను చెప్పాల్సిన సమాచారాన్ని వివరంగా చెబుతారు.

''చూసేవాళ్లకు బోర్ కొట్టకుండా వారిని ఎంగేజ్ చేసేలా వీడియోలు రూపొందిస్తాను’’ అన్నారు విల్.

ప్రజలు అడిగే అనేక ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పాల్సి ఉంటుందని వారంటారు.

''ప్రశ్నలు అడిగేవారితో వాదనకు దిగకుండా, ఉద్వేగాలకు లోను కాకుండా ఉండాలి. అలాకాకపోతే చెప్పాల్సింది చెప్పలేం. వాస్తవాలతో జవాబు చెప్పాల్సి ఉంటుంది’’ అన్నారు విల్, అన్నా.

''ప్రస్తుత తప్పుడు సమాచారం, ఫేక్ న్యూస్ కాలంలో పూర్తి వాస్తవాలతో ప్రజల సందేహాలకు సమాధానమిస్తూ వారిని చైతన్యపరచడం నా పని’’ అన్నారు అన్నా.

టిక్‌టాక్ మంచి సాధనంగా కనిపిస్తోంది నాకు.. ఇంకా చాలామంది సైంటిస్టులు ఈ పనిచేస్తే బాగుంటుంది అంటున్నారు అన్నా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What is the connection between corona vaccine and tik tok videos
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X