• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మౌనం బద్దలు.. 'జార్జ్ ఫ్లాయిడ్' కోసం కదిలిన దిగ్గజాలు.. మరో చరిత్రే..

|

ఒక మహా సంక్షోభం సమాజాన్ని చుట్టుముట్టినప్పుడు చర్చోపచర్చలు,అభిప్రాయాల వెల్లువ సహజం. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ చాలామంది తమ అభిప్రాయాలను పంచుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో కార్పోరేట్ కంపెనీలు మాత్రం తటస్థ వైఖరిని అవలంభిస్తుంటాయి. వివాదాల జోలికి వెళ్తే ఎక్కడ తమ బ్రాండ్ వాల్యూ పడిపోతోందోనన్న అభద్రతా భావం వారిని వెంటాడుతుంది. కానీ అమెరికాను కుదిపేస్తోన్న జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతంతో కార్పోరేట్లు కూడా స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రజా పోరాటాన్ని విస్మరించి.. భవిష్యత్తులో తమ బ్రాండ్లను మార్కెట్ చేసుకోలేమన్న అవగాహనకు కార్పోరేట్ కంపెనీలు వచ్చాయి. ఏదైతేనేం కార్పోరేట్ రెస్పాన్సిబిలిటీకి ఇది సార్థకతే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 అమెరికాను అగ్నిగోళంలా మార్చేసిన జార్జ్ ఫ్లాయిడ్ పోస్ట్‌మార్టమ్ నివేదిక: షాకింగ్ అమెరికాను అగ్నిగోళంలా మార్చేసిన జార్జ్ ఫ్లాయిడ్ పోస్ట్‌మార్టమ్ నివేదిక: షాకింగ్

సంఘీభావం ప్రకటించిన టీవీ చానెళ్లు..

సంఘీభావం ప్రకటించిన టీవీ చానెళ్లు..

జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతానికి నిరసనగా అమెరికావ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలకు పలు టీవీ చానెళ్లు మద్దతుగా నిలిచాయి. నిరసనలకు సంఘీభావంగా జూన్ 1,సాయంత్రం 5గంటలకు ఎంటీవీ తమ ప్రసారాలను 8.46నిమిషాల పాటు నిలిపివేసింది. అలాగే ViacomCBSకి చెందిన పలు చానెళ్లు,Nickelodeon తదితర చానెళ్లు కూడా 8.46 నిమిషాల పాటు టీవీ ప్రసారాలను నిలిపివేసి సంఘీభావం ప్రకటించాయి. మిన్నెపోలిస్ పోలీస్ అధికారి డెరెక్ చెవెన్ తన మోకాలితో జార్జ్ ఫ్లాయిడ్‌ తలను 8.46నిమిషాల పాటు నేలకు అదిమిపట్టడంతో అతను ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో '8.46' అనేది ఇప్పుడు ఉద్యమ నినాదంగా మారింది.

కొత్త పిలుపునిచ్చిన నైక్..

ప్రముఖ షూ కంపెనీ నైక్ 30 ఏళ్ల తమ ఫేమస్ కొటేషన్ 'జస్ట్ డూ యిట్'ని తాజా ఉద్యమానికి అనుగుణంగా మార్చి 'ఫర్ వన్స్.. డోంట్ డూ యిట్(ఈ ఒక్కసారికి ఇలా చేయకండి)' అంటూ కొత్త పిలుపునిచ్చింది. 'అమెరికాలో ఏ సమస్యా లేదని నటించకండి.', 'జాత్యహంకారంపై పోరుకు వెన్ను చూపకండి.','అమాయక ప్రజలను బలి తీసుకోవడాన్ని ఒప్పుకోకండి.','నాకేమి సంబంధం,ఇది నన్నేం చేస్తుందని భావించకండి.','మౌనంగా కూర్చుండిపోవద్దు.. మార్పు కోసం పోరులో అందరం భాగస్వాములం అవుదాం.' అంటూ నైక్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అమెరికన్ ప్రజలకు పిలుపునిచ్చింది. అటు ఆర్థిక సేవల కంపెనీ గోల్డ్ మాన్ సాక్స్ జాత్యహంకారంపై పోరుకు 10మిలియన్ డాలర్లను ప్రకటించింది.

టాప్ కార్పోరేట్ కంపెనీల మద్దతు..

టాప్ కార్పోరేట్ కంపెనీల మద్దతు..

అమెరికాలోని టాప్-50 కార్పోరేట్ కంపెనీల్లో అబ్బాట్ లేబోరేటరీస్,బెర్క్ షౌర్ హాత్‌అవే,కాస్ట్‌కో హోల్‌సేల్,ఎక్సన్ మొబలి సహా తదితర కంపెనీలు ఇప్పటికే ప్రజా పోరాటానికి మద్దతుగా బహిరంగ స్టేట్‌మెంట్స్ ఇచ్చాయి. జాతి వివక్షపై పోరుకు అబ్బాట్ కంపెనీ 1.1మిలియన్ డాలర్లను ప్రకటించింది. ఐస్‌క్రీమ్ తయారీ సంస్థ బెన్&జెర్రీ.. 'మనం తెల్ల ఆధిపత్యాన్ని కూల్చివేయాలి' అంటూ ట్విట్టర్‌లో పిలుపునిచ్చింది. అంతేకాదు పౌర హక్కుల రక్షణ కొత్త చట్టాలు తేవాలని,అధ్యక్షుడు ట్రంప్ జాతి ఐక్యతకు పిలుపునివ్వాలని కోరింది.

మద్దతుగా నిలిచిన మైక్రోసాఫ్ట్..


యాపిల్ సీఈవో టిమ్ కుక్ జార్జ్ ఫ్లాయిడ్‌ కుటుంబానికి న్యాయం జరగాలన్నారు. సంక్షోభం చల్లారేదాక చూస్తూ కూర్చోవద్దని.. మన ఆలోచన దృక్పథాన్ని,చర్యలను ఒకసారి పున:పరీశీలించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. మైక్రోసాఫ్ట్ సైతం జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతాన్ని ఖండించింది. అంతేకాదు,ఈ వివక్షపై గొంతెత్తడానికి బ్లాక్&ఆఫ్రికన్ అమెరికన్లకు తమ ప్లాట్‌ఫామ్‌లో అవకాశం కల్పిస్తోంది. వారి ఆలోచనలను,అభిప్రాయాలను పంచుకుంటోంది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కూడా దీనిపై స్పందించారు. ఆఫ్రికన్ అమెరికన్ కమ్యూనిటీకి తన సంఘీభావాన్ని తెలియజేసిన ఆయన.. మన సమాజంలో విద్వేషానికి,జాతి వివక్షకు తావు లేదన్నారు.

English summary
MTV went dark for 8 minutes and 46 seconds. Goldman Sachs pledged $10 million “to help address racial and economic injustice.” And Nike reworked its well-worn slogan for these troubled times: “For Once,” it said, “Don’t Do It.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X