వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాకు విరుగుడు ఆ జంతువు: వైరస్‌ను మట్టుబెట్టే యాంటీబాడీస్ ఫుల్‌గా: సహజంగా వృద్ధి చెందేలా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: లామా.. చూడ్డానికి ఓ చిన్న సైజు ఒంటెలా, కంగారూల్లా కనిపించే ఈ జంతువు దక్షిణ అమెరికా దేశాల్లో పరిమితంగా కనిపిస్తుంటాయి. పెరూ, కొలంబియాల్లో ఓ మోస్తరు సంఖ్యలో తిరుగాడుతుంటాయి ఇవి. డొమెస్టిక్ యానిమల్‌ గుర్తింపు ఉన్న ఈ లామా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. పరిశోధకుల నోళ్లల్లో నానుతోంది. కారణం- భయానక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి అవసరమైన విరుగుడు ఈ జీవిలో ఉండటమే. మరే జంతువులోనూ లేని విధంగా లామాలో విభిన్నమైన జీవకణాల నిర్మాణం ఉందని, దాని ద్వారా కరోనా వైరస్‌కు విరుగుడును కనుగొనవచ్చని చెబుతున్నారు పరిశోధకులు.

Recommended Video

COVID-19 : Coronavirus ను మట్టుబెట్టే యాంటీబాడీస్ Llamas జంతువుల్లో.. తేల్చేసిన అధ్యయనం! || Oneindia

యువజన నైపుణ్యమే మన బలం: స్కిల్ ఇండియా.. ఆత్మనిర్భర్ భారత్: ఇవే లక్ష్యం: ప్రధాని మోడీయువజన నైపుణ్యమే మన బలం: స్కిల్ ఇండియా.. ఆత్మనిర్భర్ భారత్: ఇవే లక్ష్యం: ప్రధాని మోడీ

వైరస్ దాడి చేస్తే..

వైరస్ దాడి చేస్తే..

ఏదైనా వైరస్ దాడి చేస్తే.. దాన్ని సమర్థవంతంగా నిర్మూలించగలిగే సహజసిద్ధ జీవకణాలు, లక్షణాలు.. ఒక్క లామా జంతువుల్లో మాత్రమే ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ తరహా జీవకణాల నిర్మాణం మరే ఇతర జంతువుల్లో లేదని నిర్దారించారు. వైరస్ సోకిన సమయంలో లామా సహజసిద్ధంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటుందని వెల్లడించారు. ఈ తరహా సూక్ష్మ జీవకణాలను తాము నానోబాడీస్‌గా గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. లామా రక్తకణాలను సేకరించి, దానిపై నిర్వహించిన పరిశోధనల సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని, కరోనా వంటి వైరస్‌ను నిర్మూలించగలిగే సామర్థ్యం వాటికి ఉందని చెప్పారు.

మానవ రక్తకణాల్లో వైరస్ ప్రవేశించకుండా..

మానవ రక్తకణాల్లో వైరస్ ప్రవేశించకుండా..

రోసాలిండ్ ఫ్రాంక్లిన్ ఇన్‌స్టిట్యూట్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, డైమండ్ లైట్ సోర్స్, పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులతో కూడిన టీమ్ నేచర్ స్ట్రక్చరల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ మేగజైన్‌లో ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు. లామా జంతువుల్లో కనిపించే నానోబాడీస్ కణాల్లో ఉండే ప్రొటీన్లు కరోనా వైరస్‌ను మానవ రక్తకణాల్లో ప్రవేశించకుండా నిరోధించగలుగుతాయని స్పష్టం చేశారు. ఇదే అంశంపై టెక్సాస్‌లోని మెక్‌లెల్లాన్ ల్యాబొరేటరీలో శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలను కొనసాగిస్తున్నారు కూడా. మానవ రక్తకణాల్లోకి లామా నానోబాడీస్‌ను ఇంజెక్ట్ చేసే విషయంపై టెక్సాస్ లాబ్‌లో పరిశోధనలు చేస్తున్నారు.

 లామా నానోబాడీస్‌లను ఇంజెక్ట్ చేస్తే..

లామా నానోబాడీస్‌లను ఇంజెక్ట్ చేస్తే..

మానవ రక్తకణాల్లోకి లామా యాంటీబాడీస్, నానోబాడీస్‌లను మిళితం చేసే విషయంపై పరిశోధనలు చేస్తున్నామని, కరోనా వైరస్ సోకడాన్ని నిరోధించేలా ఇది ఎంత వరకు పని చేయగలుగుతుందనే దిశగా తమ పరిశోధనలు కొనసాగుతున్నట్లు రోసాలిండ్ ఫ్రాంక్లిన్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ స్ట్రక్చరల్ బయాలజీ ప్రొఫెసర్ జేమ్స్ నైస్మిత్ తెలిపారు. వైరస్ సోకిన తరువాత.. అది ప్రభావం చూపకుండా ఉండేలా లామాల్లోని నానోబాడీస్ పని చేస్తాయని, వైరస్ స్పైక్స్‌, చైన్‌ను అవి నిర్మూలిస్తాయని తాము గుర్తించినట్లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ డైమండ్ లైట్ సోర్స్ ప్రొఫెసర్ డేవిడ్ స్టువర్ట్ చెప్పారు.

వైరస్‌ను న్యూట్రలైజ్ చేయగల శక్తి..

వైరస్‌ను న్యూట్రలైజ్ చేయగల శక్తి..

మానవ శరీరంలోకి ప్రవేశించిన తరువాత కరోనా వైరస్ తనను తాను విభజించుకుంటుందని, కొన్ని ప్రధాన అవయవాలపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఇలా వైరస్ వ్యాప్తి చెందడాన్ని లామాల్లోని నానోబాడీస్ అడ్డుకుంటాయని తెలిపారు. వైరస్ చైన్‌ను తెంచేస్తాయని అన్నారు. వైరస్ స్పైక్స్‌ను బెండ్ చేయగలుగుతాయని, ఫలితంగా అవి న్యూట్రలైజ్ అవుతాయని పేర్కొన్నారు. హెచ్ఐవీ, ఇన్‌ప్లుయెన్జాలను అరికట్టగలిగే సామర్థ్యం లామా నానో కణాల్లో ఉందని ఇదివరకు గుర్తించామని, ఇక తాజాగా కరోనా వైరస్‌ను కూడా రూపుమాప గల సత్తా వాటికి ఉన్నట్లు నిర్ధారించామని అన్నారు.

English summary
Researchers discovered that a special type of antibody found in llamas could be vital in fighting the coronavirus infection in humans. The World speaks to professor James Naismith, the director of the Rosalind Franklin Institute in the UK, and lead researcher in a new study on llama antibodies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X