వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో కరోనా మరో స్ట్రెయిన్‌- బ్రిటన్‌ వైరస్‌ కంటే 50 శాతం స్పీడుగా-టాస్క్‌ఫోర్స్‌ వార్నింగ్‌

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌ నుంచి ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తరుణంలో యూరప్‌ దేశాల్ల కొత్త స్ట్రెయిన్‌ కలకలం రేగుతోంది.. ముందుగా బ్రిటన్‌లో బయటపడిన ఈ కొత్త రకం వైరస్‌ ఇతర దేశాలకు వ్యాపిస్తుందన్న భయాల మధ్యే అమెరికాలో ఇంకో కొత్త స్ట్రెయిన్‌ బయటపడినట్లు వస్తున్న వార్తలు మరింత కలకలం రేపుతున్నాయి.

 తెలంగాణలో కొత్తగా 298 కరోనా కేసులు: 5వేల దిగువకు యాక్టివ్ కేసులు తెలంగాణలో కొత్తగా 298 కరోనా కేసులు: 5వేల దిగువకు యాక్టివ్ కేసులు

బ్రిటన్‌లో కొత్తగా రెండు రకాల వైరస్‌ వ్యాప్తి చెందుతున్నట్లు తేలింది. ఇది బ్రిటన్‌ నుంచి ఇతర దేశాలకు ప్రయాణిస్తున్న వారి నుంచి ఆయా దేశాలకు పాకుతున్నట్లు కూడా నిర్ధారణ అవుతుంది. తాజాగా వ్యాక్సిన్‌పై జరుగుతున్న పరిశోధనలకు ఇది సవాల్‌ విసురుతుండగానే అమెరికాలో మరో కొత్త స్ట్రెయిన్‌ బయటపడినట్లు తెలుస్తోంది. వైట్‌హౌస్‌లో కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షులు బైడెన్‌, కమలా హ్యారిస్‌ అడుగుపెట్టేందుకు ముందే టాస్క్‌ఫోర్స్‌ చేసిన హెచ్చరికలే ఇందుకు కారణం.

could US too have own new covid-19 variant? white house task force warning

బ్రిటన్‌లో పుట్టిన కొత్త స్ట్రెయిన్‌ కంటే ఇది 50 శాతం ఎక్కువగా వ్యాప్తి చెందె లక్షణం కలిగి ఉందని వైట్‌హౌస్‌ కరోనా టాస్క్‌ఫోర్స్‌ హెచ్చరికలు జారీ చేసింది. ఇది అమెరికాలో ఇప్పటికే వ్యాపిస్తున్నట్లు కూడా పేర్కొంది. ఈ కొత్త వైరస్‌ స్ట్రెయిన్ వల్ల మరింత భారీగా కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని టాస్క్‌ఫోర్స్‌ హెచ్చరించింది. దీంతో అమెరికా తీవ్ర కలకలం రేగుతోంది. అసలే దేశంలో మాస్కుల వినియోగం, భౌతిక దూరం, ఇతర ఆంక్షలు అంతంతమాత్రంగా అమలవుతున్న తరుణంలో ప్రమాదం ముంచుకొస్తోందని టాస్క్‌ఫోర్స్ తెలిపింది.

English summary
Now, with the new UK variant on a rampage, the White House Coronavirus Task Force has warned that there is a strong possibility that even the United States could have a “more transmissible” Covid-19 strain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X