వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోరం: అప్పుడే పుట్టిన బిడ్డకు ‘హెరాయిన్’, ఛీ.. వీళ్లు తల్లిదండ్రులేనా?

అప్పుడే పుట్టిన పసికందుకు హెరాయిన్ ఇచ్చిన తల్లిదండ్రుల ఉదంతమిది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పుట్టిన గంటల వ్యవధిలోనే బిడ్డకు హెరాయిన్ ఇచ్చిన ఆ తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అప్పుడే పుట్టిన పసికందుకు హెరాయిన్ ఇచ్చిన తల్లిదండ్రుల ఉదంతమిది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పుట్టిన గంటల వ్యవధిలోనే బిడ్డకు హెరాయిన్ ఇచ్చిన ఆ తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. అమెరికాలోని ఉటా కౌంటీకి చెందిన దంపతులు లేసీ క్రిస్టెన్ సన్(26), కాల్బీ వైల్డ్(29) దంపతులకు ఉటా వ్యాలీ ఆసుప్రతిలో ఏప్రిల్ 9న మూడో బిడ్డ జన్మించింది.

Couple arrested after drugging heroin-addicted newborn to hide symptoms

బిడ్డ తల్లి లేసీ క్రిస్టెన్ సన్ గర్భవతిగా ఉన్న సమయంలో నొప్పులను తట్టుకునేందుకు డాక్టర్లు సూచించిన మందులతోపాటుగా తరచూ హెరాయిన్ కూడా తీసుకునేది. దీంతో ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా హెరాయిన్ కు అలవాటు పడింది.

అయితే ఈ విషయం ఆసుపత్రిలోని వైద్యులకు, సిబ్బందికి తెలియకూడదని భావించిన క్రిస్టెన్ సన్ దంపతులు భావించారు. అదను చూసుకుని డాక్టర్లు, నర్సు లేని సమయంలో సబోక్సోన్ అనే టాబ్లెట్లను మెత్తగా పొడి చేసి బిడ్డ నాలుకపై రాశారు.

ఇది గమనించిన ఆసుపత్రి వైద్యులు పోలీసులకు సమాచారం అందించగా వారు రంగప్రవేశం చేసి క్రిస్టెన్ నసన్ దంపతుల ఇంట్లో సోదాలు నిర్వహించి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను పట్టుకున్నారు.

గర్భవతిగా ఉండి.. డ్రగ్స్ వాడడమే కాక, పుట్టిన బిడ్డకు కూడా అలవాటు చేసిన నేరానికి గాను లేసీ క్రిస్టెన్ సన్ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Colby Wilde and Lacey Christenson welcomed their third child into the world on April 9 at Utah Valley Hospital. The doctors, nurses and medical staff eventually cleared out of the room, giving the parents a few moments alone with their new daughter. Unlike most new parents, they did not hold the newborn child, overcome with emotion. Instead, Wilde quickly crushed pills of Suboxone, an FDA-approved drug used to treat heroin addiction and withdrawal, police say. He moistened his finger and dipped it in the resulting powder. Then he stuck his finger in his daughter's mouth, smearing it along her tiny, tender gums. Though she had been in the world less than half a day, the baby, like thousands others in the United States, was already addicted to opioids.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X