• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వీడియో : ముద్దులతో నడిరోడ్డుపై రెచ్చిపోయి.. చివరకు ప్రాణాలు కోల్పోయి..!

|
  ముద్దుల్లో మునిగి బ్రిడ్జ్ నుండి కిందకి పడ్డ జంట (వీడియో)

  లీమా : భార్యభర్తలు ప్రేమను ఆస్వాదిస్తూ.. మరో లోకంలో విహరిస్తూ కానరాని లోకాలకు వెళ్లిపోయిన ఘటన పెరూ దేశంలో చోటుచేసుకుంది. తమను తాము మరిచిపోయి.. ముద్దు మురిపెంతో తెగ రెచ్చిపోయి.. చివరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారకర ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  పెరూ దేశానికి చెందిన 36 ఏళ్ల హెక్టర్ విడాల్.. 34 సంవత్సరాల ఎస్పినోజ్ భార్యభర్తలు. ఈ ఇద్దరు కూడా పర్వాతారోహకులు. వృత్తిరీత్యా క్యూసో టౌన్‌లో నివాసముంటూ టూరిస్ట్ గైడ్స్‌గా జీవనం సాగిస్తున్నారు. అయితే శుక్రవారం (09.08.2019) నాడు తమ విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన సమయంలో రాత్రి ఒంటి గంట సమయంలో కాసేపు సేదదీరుదామని బెత్లెహాం బ్రిడ్జిపై ఆగారు. ఆ క్రమంలో ముద్దుల్లో మునిగిపోయి మృత్యువాత పడ్డారు.

   couple plunge 50ft to their deaths at the time of kissing on bridge

  బెత్లెహాం బ్రిడ్జిపైన ముద్దుల్లో మునిగిపోయి ప్రేమ పరవశంలో తడిసి ముద్దవుతున్న వేళ అనుకోని ప్రమాదం జరిగింది. ముద్దుల్లో మునిగిపోయిన భార్యాభర్తలు సెకన్ల వ్యవధిలో బ్రిడ్జిపై నుంచి కిందపడి ప్రాణాలు విడిచారు. ముద్దుల్లో లీనమైన సమయంలో ఆమె బ్రిడ్జి రెయిలింగ్ ఆనుకుని నిలబడ్డారు. కిస్సింగ్‌లో భాగంగా తన భర్తను మరింత దగ్గరగా లాక్కొనేందుకు ట్రై చేశారు. అయితే ఆమె సడెన్‌గా తనవైపు లాక్కోవడం.. బ్యాలెన్స్ ఆగకపోవడం.. ఇద్దరూ కలిసి బ్రిడ్జి నుంచి కిందపడటం చకచకా జరిగిపోయాయి.

  50 ఫీట్ల ఎత్తు నుంచి కిందకు పడటంతో ఎస్పినోజ్ స్పాట్‌లోనే మృత్యువాత పడ్డారు. విడాల్ మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఈ సీన్‌కు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డు కావడంతో ఫుటేజ్ బయటకొచ్చింది. లేదంటే వీరిని ఎవరైనా చంపారేమోననే అనుమానాలు బలపడేవి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముద్దుల్లో మునిగిపోయి భార్యాభర్తలు ఇలా చనిపోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A Couple Hector Vidal, 36, and Maybeth Espinoza, 34, were filmed falling over the barrier in Peru during a romantic moment in the early hours of last Saturday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more