వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 20లక్షలు ఖర్చుచేసి పిల్లికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లిని కాపాడుకునేందుకు ఓ దంపతులు భారీ మొత్తం ఖర్చు చేశారు. కుటుంబంలో భాగంగా ఉన్న ఆ పిల్లి ఒక్కసారిగా అనారోగ్యం పాలవడంతో ఆందోళన చెందిన వారు డబ్బుల గురించి ఆలోచించలేదు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్ అందించారు.

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన అండ్రే డోన్సియార్ దంపతులు పెంచుకుంటున్న పిల్లి ‘ఓకీ' ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. దీంతో ఆందోళన చెందిన ఆ దంపతులు పిల్లిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Couple Spend Thousands of Dollars on Cat's Kidney Transplant

పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని వెటర్నరీ ఆస్పత్రి తరలించగా.. ఆ పిల్లి మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నదని, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ తప్పనిసరని వైద్యులు సూచించారు.
కిడ్నీ మార్పిడి చేయాల్సిందేనని, భారీగా ఖర్చవుతుందని చెప్పారు. దీంతో పిల్లిని ఎలాగైనా కాపాడుకోవాలని ఆ దంపతులు ఆరాటపడ్డారు.

ఎంత ఖర్చయినా సరే తమ ఓకీని బతికించాలని ఆ దంపతులు బతిమాలడంతో వైద్యులు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసి దాన్ని బతికించారు. ఇందుకోసం ఆ దంపతులు రూ. 20లక్షలు ఖర్చు చేశారు. కాగా, 12ఏళ్ల ఓకీ మరో మూడేళ్లు బతుకొచ్చని వైద్యులు పేర్కొన్నారు.

English summary
In a heart warming deed, a US couple may end up spending a whopping USD 30,000 set aside for a house to save the life of their pet cat that has recently undergone a kidney transplant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X