వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఆఫీస్‌లో నిత్యం పోర్న్ వీడియోలు చూసి మృతి'

By Srinivas
|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనాకు చెందిన ఓ టెక్నాలజీ కంపెనీ నష్టపరిహారాన్ని చెల్లించకుండా ఉండటం కోసం చనిపోయిన వ్యక్తి పైన ఆరోపణలు చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అతను దాదాపు వంద రోజుల పాటు ఓవర్ టైమ్ డ్యూటీ చేయడం వల్లే చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

అయితే కంపెనీ మాత్రం అతను పని చేయడం మాని పోర్న్ సినిమాలు చూసేవాడని, అందుకే చనిపోయాడని చెబుతోంది. బీజింగ్‌కు చెందిన జాంగ్ అనే వ్యక్తి బ్రెయిన్ హేమరేజ్ కారణంగా గత ఏడాది మరణించాడు.

 Court Decides If Man Died From Too Much Overtime Or Too Much Porn

యాజమాన్యం సూచించిన డిజైన్లను రూపొందించేందుకు వంద రోజుల పాటు విశ్రాంతి లేకుండా పని చేశాడని, అందుకు తగిన నష్టపరిహారం సదరు కంపెనీయే చెల్లించాలని కుటుంబ సభ్యులు బీజింగ్ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

అయితే, జాంగ్ కార్యాలయ వేళల్లో పని మానేసి విపరీతంగా పోర్న్ చిత్రాలు చూసేవాడని, అందుకే అథనికి బ్రెయిన్ హేమరేజ్ వచ్చిందని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. అతను తన డెస్క్ టాప్‌లో పోర్న్ సినిమాలు చూస్తున్న దృశ్యాలు కార్యాలయంలో ఉన్న ఇంటర్నేషనల్ సర్వైలెన్స్ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయని, అందుకు సంబంధించిన దృశ్యాలను కోర్టులో సమర్పించింది. కోర్టు త్వరలో తీర్పు వెలువరించనుంది.

English summary
Court Decides If Man Died From Too Much Overtime Or Too Much Porn.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X