వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోర్న్ వీడియోల్లో నటించే జంటలకు బంపర్ ఆఫర్

By Pratap
|
Google Oneindia TeluguNews

బ్రిటన్: ఇంగ్లాండులోని కోవెంట్రీ విశ్వవిద్యాలయం కండోమ్‌లపై ఉన్న అపోహలను తొలగించేందుకు విచిత్రమైన ప్రచారానికి పూనుకుది. యువతలో కండోమ్‌లో వాడకంపై ఉన్న అపోహలను తొలగించాలనే ఉద్దేశంతో పోర్న్ వీడియోలు చిత్రీకరించాలని కోవెంట్రీ విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా 18-25 ఏళ్లున్న నిజాయితీగల మూడు జంటలతో పోర్న్ వీడియోలు చిత్రీకరించాలని నిర్ణయించింది. ఆ జంటల కోసం అన్వేషణ ప్రారంభించింది. విద్యార్థి గదుల్లో, కార్లలో ఏర్పాటు చేసిన సహజ వాతావరణంలో శృంగారంలో పాల్గొనే జంటల కోసం గాలిస్తోంది. వారు శృంగారంలో రెచ్చిపోయి ఉన్నప్పుడు ఆ దృశ్యాలను చిత్రీకరించి కండోమ్‌ల ప్రమోషన్ కోసం వాడుకుంటామని చెబుతోంది.

Coventry University is looking for three young couples to have sex on film

శృంగారంలో పాల్గొని తమకుసహకరించే జంటల్లో ఒక్కొక్కరికి 400 పౌండ్లు (దాదాపు రూ.33వేలు) ఇస్తామని ప్రకటించింది. 15-24 ఏళ్ల మధ్య ఉన్న యువతీ యువకుల్లో కండోమ్‌ల వాడకాన్ని పెంచడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని యూనివర్సిటీ చెబుతోంది. అయితే తాము చిత్రీకరించిన వీడియోలను మాత్రం 18 ఏళ్లు నిండిన వారికే అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. కండోమ్ తొడుక్కుంటే మూడ్ రాదనే అపోహలను పోగొట్టేందుకే ఈ ప్రయత్నమని తెలిపింది.

కండోమ్‌ల తొడుక్కోవడం వల్ల శృంగారానుభూతిలో ఎటువంటి తేడా ఉండదని, వాటిని వాడడం ద్వారా ఎన్నో వ్యాధుల నుంచి బయటపడవచ్చని తెలిపింది. ముఖ్యంగా యువకులు కండోమ్‌లు లేకుండా ఆవేశంలో శృంగారంలో పాల్గొంటూ వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

English summary
A new project by a university is asking couples to have sex on film in order to promote the use of condoms to young people.Three couples aged between 18 and 25 will be filmed having sex in 'natural settings', including a student room and a car and will be paid £400 for their work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X