వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus:అమెరికాలో మృత్యు క్రీడ... 24 గంటల్లో ఎంతమందో తెలుసా.. అక్కడ తగ్గిన కేసులు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రపంచదేశాలను కోవిడ్-19 వణికిస్తోంది. ఎక్కడో చైనాలో పుట్టిన ఈ మహమ్మారి దాదాపు 192 దేశాలను కబళిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ బాడిన కొన్ని వేల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. కొన్ని దేశాల్లో అయితే మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు కూడా చోటు లేకుండా ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అగ్రరాజ్యం అమెరికా ఇందుకు మినహాయింపు కాదు. అమెరికాలో రోజురోజుకూ కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంటే మరోవైపు అంతకంతకూ మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. అమెరికా తాజా గణాంకాలు చూస్తే పరిస్థితి చేదాటి పోయిందా అనేలా కనిపిస్తోంది.

అగ్రరాజ్యం అమెరికాను మహమ్మారి వణికిస్తోంది. గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదేశంలో కరోనావైరస్ బారిన పడి 1500 మంది మృతి చెందారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ ట్రాకర్ ద్వారా మృతుల విషయం బయటపడింది. ఇలా 24 గంటల్లోనే ఈ స్థాయిలో మృతిచెందడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంటే అమెరికా స్థానిక కాలమాన ప్రకారం గురువారం రాత్రి 8:30 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8:30 గంటల వరకు మృతుల సంఖ్యను లెక్కించగా మొత్తం 1480 మంది ప్రాణాలను ఈ మహమ్మారి మింగేసింది.ఇదిలా ఉంటే కరోనావైరస్ అమెరికాలో వ్యాప్తి చెందినప్పటి నుంచి ఇప్పటి వరకు 7,406 మంది మృతి చెందారు.

Covid-19: 1500 die in 24 hours in US, While Italy shows decrease in Positive cases

Recommended Video

PM Urges People To Light Diyas For 9 Minutes On April 5 At 9 PM

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఇటలీలో కరాళనృత్యం చేసిన కోవిడ్-19, క్రమంగా తగ్గుతున్నట్లుగా కనిపిస్తోంది. కేసులు కూడా క్రితం రోజులతో పోలిస్తే తక్కువగానే నమోదవుతున్నాయి. మృతుల సంఖ్యా పరంగా చూస్తే శుక్రవారం రోజున ఇటలీలో 766 మంది మృతి చెందారు. దీంతో అక్కడి మృతుల సంఖ్య 14,681కి చేరింది. అయితే గురువారం రోజున మృతుల సంఖ్య 760 మాత్రమే ఉన్నింది. ఇక అంతకుముందు 4,668 పాజిటివ్ కేసులు ఉండగా శుక్రవారం మాత్రం 4,585 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే కేసుల సంఖ్య తగ్గింది. ఇదిలా ఉంటే శుక్రవారం నమోదైన కేసులతో వరుసగా ఐదోసారి తగ్గుదల కనిపించింది. ఇక ఇటలీలో ప్రతిరోజు మృతుల సంఖ్య 727 నుంచి 766 మధ్యలో ఉంటోంది.

English summary
The United States recorded nearly 1,500 deaths from COVID-19 between Thursday and Friday,where as in Italy the number of Covid -19 cases witnessed a decrease.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X